.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు టీమ్ ఇండియా అర్హత సాధిస్తుందా?
ఇండియన్ క్రికెట్ టీమ్ 12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై టెస్ట్ సిరీస్ కోల్పోయింది. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టు బ్యాటింగ్‌లో తడబడినప్పుడే.. క్రికెట్ అభిమానులకు ఎక్కడో ఒక అనుమానం మొదలైంది.
ఇటీవల కాలంలో భారత జట్టు పెర్ఫార్మెన్స్‌లో consistency లోపించింది. ఎప్పుడు ఎలా ఆడతారో అర్థం కాదు. బంగ్లాపై ఎలాగో గెలిచిన తర్వాత.. న్యూజీలాండ్ జట్టుతో సిరీస్ అనగానే.. పెద్దగా ఆశలేం పెట్టుకోలేదు.
Ads
న్యూజీలాండ్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ డిఫెండింగ్ ఛాంపియన్లు అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. వాళ్లు 2023లో డబ్ల్యూటీసీ గెలవడానికి ఎంత నిబద్దతతో ఉన్నారో అందరికీ తెలిసిందే. ఐపీఎల్‌లో ఒకే జట్టులో ఉన్న న్యూజీలాండ్ ఆటగాళ్లు.. ఇండియన్ బ్యాటర్లకు నెట్స్‌లో కూడా బంతులు విసరడానికి కూడా ఒప్పుకోలేదు. అంటే.. ఐపీఎల్ కంటే తమ ప్రాధాన్యత ఏదో ఆనాడే చెప్పారు. అనుకున్నట్లే టీమ్ ఇండియాను కివీస్ జట్టు ఫైనల్‌లో ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.
ఇప్పుడు కూడా తొలి టెస్టు నుంచే న్యూజీలాండ్ టీమ్ చక్కటి వ్యూహంతో ఆడింది. ఇండియన్ బ్యాటర్లకు ఎలా బంతులు విసరాలో.. భారత జట్టు బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో స్టడీ చేసి వచ్చారు. అందుకే వరుసగా రెండు టెస్టులు గెలిచారు. భారత గడ్డపై 2012 తర్వాత టెస్టు సిరీస్ గెలిచి షభాష్ అనిపించుకున్నారు.
సరే, ఇప్పుడు ఈ సిరీస్ రికార్డుల జోలికి పోవడం లేదు. కానీ ఇండియా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధిస్తుందా లేదా అనేది ఒక సారి పరిశీలిద్దాం.
– భారత జట్టుకు ఇంకా ఈ సీజన్‌లో ఆరు టెస్టులు మిగిలి ఉన్నాయి.
– ఒక టెస్టు న్యూజీలాండ్‌తో హోమ్ గ్రౌండ్‌లో ఆడాలి. మిగిలిన ఐదు టెస్టులు ఆస్ట్రేలియా గడ్డపై ఆడాలి.
– మిగిలిన ఆరు టెస్టుల్లో కనీసం రెండు టెస్టులు గెలిచి.. మిగిలిన నాలుగు టెస్టులు డ్రా చేసుకుంటే భారత జట్టు ఫైనల్‌కు వెళ్తుంది.
– అంటే మిగిలిన ఆరు టెస్టుల్లో భారత జట్టు ఓటమి అనేది లేకుండా చూసుకోవాలి.
– ఇండియా ఒక్క టెస్టు ఓడినా.. ఫైనల్‌కు చేరుకోవడం కష్టం.
– ఇక ఇండియా టాప్ పొజిషన్‌లో ఉండాలంటే మిగిలిన మ్యాచ్‌లలో కనీసం ఐదు గెలవాలి.
– ఇండియా ఫైనల్స్‌కు చేరలేకపోతే.. ఆస్ట్రేలియా, శ్రీలంక లేదా న్యూజీలాండ్‌కు ఛాన్స్ ఉంది.
– హోమ్ గ్రౌండ్‌లోనే భారత జట్టుకు ఇప్పుడు గడ్డు పరిస్థితి ఉంది. ఇక ఆసీస్‌ను వారి దేశంలోనే ఓడించాలంటే కష్టపడాల్సిందే. – ఇది ఇండియాకు పెద్ద టాస్కే. #భాయ్‌జాన్ – జాన్ కోరా
Share this Article