Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శ్రీకాంత్ అయ్యంగార్..! తెలుగు ఇండస్ట్రీ ఎలా భరిస్తుందో ఈ దరిద్రాన్ని..!!

October 26, 2024 by M S R

.మీరు ఒక హోటల్‌కు వెళ్లారు… అదిరిపోయే రేట్లు… తీరా చూస్తే ఫుడ్ పరమ దరిద్రం… బిల్లు కట్టాక కడుపు మండి తిట్టుకుంటున్నారు… ఆ హోటళ్లో బోళ్లు తోముకుని, టేబుళ్లు క్లీన్ చేసే క్లీనర్ ఒకడికి రోషం పుట్టుకొచ్చి… ఆ వినియోగదారుడిని ఉద్దేశించి…‘

‘పిత్తుకన్నా దరిద్రం, మీరేమిట్రా… కనీసం ఒక్క ఇడ్లీ బండి కూడా నడపలేనోడు వచ్చి హోటళ్ల తిండి గురించి మాట్లాడుతున్నారు… హోటల్ నడపడం ఎంత కష్టమో తెలుసారా మీకు… క్రిముల దొడ్డి తింటారురా మీరు..? దరిద్రానికి విరేచనాలు లేస్తే పుట్టేవాళ్లురా మీరు..? బ్లడీ పారసైట్స్ మీరు… మీలాంటి ట్రాష్‌కు ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టాలిరా…ముక్కు స్ట్రెయిట్‌గా… పత్రికా విలేకరులు సహకరిస్తారు… ప్రాణాలకు పణంగా పెట్టి హోటళ్లు నడిపిస్తూనే ఉంటాం… జనం వస్తూనే ఉంటారు..’’ అని మాటల దాడికి దిగాడు అనుకొండి… మీరేమంటారు..?

ఈడ్చి నాలుగు తంతారు వాడిని అక్కడే…‘నేను డబ్బు పెట్టాను, డబ్బుకు తగిన ఫుడ్ టేస్ట్, హైజినిక్, క్వాలిటేటివ్ ఫుడ్ నా హక్కు, కడుపు మండితే తిడతానా, తంతానా, నువ్వు ఎవడివిరా, ఈ హోటల్ నీదా..? బోళ్లు తోముకునేవాడివి నీకెందుకురా ఈ అజ్ఞానపు మాటలు..? ఎక్కడి నుంచో ఇక్కడికి బతకడానికి వచ్చి, మిమ్మల్ని పోషించే మమ్మల్నే తిడతావురా ఇడియట్..?’ అని వాయించేస్తారు… అంతేనా..?

Ads

సర్, సర్, మీరు ఘనులు సార్… గొప్పోళ్లు సర్ అని సాగిలపడి దండాలు పెడతారా..? ఇదంతా ఎందుకు అంటే..? కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగార్ అని ఓ నటుడు కమ్ రైటర్ కమ్ ఇంకా ఏమిటేమిటో… తెలుగు సినిమాల మీద పడి బతికేవాడే… సినిమా సమీక్షకులంటే అదీ తనకున్న అభిప్రాయం… పైన చెప్పిన మాటలు తను అన్నవే…

View this post on Instagram

A post shared by Telugu FilmNagar (@telugufilmnagar)

పైన హోటల్ వాడు వినియోగదారుడిని ఏమన్నాడో… శ్రీకాంత్ కూడా సినిమా రివ్యూయర్లను అదే తిట్టాడు… అవే తిట్లు… అదే వాడి భాష, అదే వాడి సంస్కారం… వాడు (ఈ వాడు అనే పదం కావాలనే వాడుతున్నాను, దానికి వాడు అర్హుడే… అంతకుమించి పదాల్ని వాడటానికి మన సంస్కారం అడ్డొస్తుంది… మనం శ్రీంత్ అయ్యంగార్లం కాదు కదా…)

పొట్టేల్ సక్సెస్ మీట్ అట… ఆ సినిమాయే ఓ దరిద్రం… అడ్డగోలు రేట్లు పెట్టి సినిమా చూసినవాడు ఖచ్చితంగా తిడతాడు… ఎందుకు తిట్టొద్దు… రివ్యూయర్ కూడా ఓ ప్రేక్షకుడే కదా… ఆ సినిమా మీద నెగెటివ్ రివ్యూలు వస్తున్నాయట, వారిని తిడుతున్నాడు అలా… ఎందుకు తిట్టొద్దు…

సరుకు పబ్లిక్‌లో అమ్మకానికి పెట్టింది మీరు, డబ్బు పెట్టేది మేము… మీరు పోషిస్తున్నారురా మమ్మల్ని… క్రిముల దొడ్డి తినే క్లీనర్‌గా అని కస్టమర్ అనగా రివ్యూయర్ లేదా ప్రేక్షకుడు అనలేడా నిన్ను..?

రివ్యూయర్లు అంత దరిద్రులే అయితే నిన్నెవడు పట్టించుకొమ్మన్నాడు..? క్రిముల దొడ్డి నాకేవాళ్లే అయితే వాడి మూతిని వాసన చూసే దరిద్రం దేనికి నీకు..? నువ్వేమైనా పొట్టేల్ నిర్మాతవా..? నీకేమిట్రా నొప్పి..? ప్రొఫెషనల్ రివ్యూయర్లే కాదు… పబ్లిక్‌లోకి వచ్చిన ఏ సరుకు నాణ్యత గురించైనా సమీక్షించే అర్హత, అవకాశం, అవసరం ఖచ్చితంగా ఉంది… నీలాంటి అజ్ఞానులకు అర్థం కాదు…

ఒక సినిమా గురించి అభిప్రాయం చెప్పాలంటే కనీసం షార్ట్ ఫిలిమ్ తీసి ఉండాలా..? విమానయాన సర్వీసును సమీక్షించాలంటే విమానం ఇంజన్ అయినా కనీసం తయారు చేసి ఉండాలా… లేక కనీసం ఆటో నడిపి ఉండాలా..?

రేయ్, ఎవర్రా మీరంతా..? కోట్లు ఖర్చు పెట్టేది ఎవరినీ ఉద్దరించడానికి కాదు, దండుకోవడానికి… మీరు చేసేది వ్యాపారం… ఏ వ్యాపారి సరుకైనా సరే డెఫినిట్‌గా ప్రజా సమీక్షకు నిలబడాల్సిందే…

నీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకుందామా..? వద్దులే… తవ్వితే అవే క్రిములు… అదే క్రిముల దొడ్డి… పబ్లిక్ డొమైన్‌లో ఏమైనా కూసేముందు జాగ్రత్త… పబ్లిక్ కూడా ఏమైనా అంటారు..? తట్టుకోగలవా..?! చివరగా… ఈ కథనం రాసేవాడు ప్రొఫెషనల్ రివ్యూయర్ కాదు… జర్నలిస్టు… మేం రివ్యూలు కూడా రాస్తాం… అవసరమైతే కడిగేస్తాం… నీలాంటోళ్లను చాలామందిని చూసింది ఈ తెలుగు సమాజం… కాలగతిలో చాలామంది కొట్టుకుపోయారు…

నువ్వెక్కడి వాడివో తెలియదు… కానీ ముందుగా భాషను, కూతను సంస్కరించుకో… ముందు పశువుల డాక్టరువట కదా… అవీ సిగ్గుపడే భాష ఏమిట్రా…

అవునూ, పొట్టేల్ నిర్మాత, దర్శకుల అభిప్రాయమూ ఇదేనా..?!పెంట మీద చాలా పురుగులు పుడుతుంటాయి, అక్కడే చచ్చిపోయి, అందులోనే కలిసిపోతూ ఉంటాయి… అవి కూడా జీవులే… అవీ అర్థం కాకుండా ఏవో కూతలు కూడా పెడుతూ ఉంటయ్..!! ఇలా రివ్యూయర్లు, ప్రేక్షకులు, జర్నలిస్టులు కూడా తిట్టగలరు…

Update :: ఫిలిమ్ క్రిటిక్స్ కు ఎట్టకేలకు రోషం వచ్చింది… ఈ దేడ్ దిమాక్ గాడిపై యాక్షన్ తీసుకోవాలని MAA కు ఫిర్యాదు చేసింది… ఏదో జరుగుతుందని కాదు… Protest…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కురువాపురం వెళ్లొచ్చాం… శ్రీపాద వల్లభుడి గుడిలో దివ్యానుభూతి…
  • సంస్కారం, మర్యాద, పరిణతి… రేవంత్ రెడ్డి తలెత్తుకున్నాడు కేసీయార్ ఎదుట..!!
  • NCP ఏకీకరణ..? NDA వైపు శరద్ పవార్ అడుగులు..? ఇండి కూటమికి దెబ్బ..!!
  • సువ్వి కస్తూరి రంగ – సువ్వి కావేటి రంగ … మరుపురాని పాట…
  • మన ఇంట్లో, మన కాలనీ గుడిలో దేవుడు దేవుడు కాడా..?
  • సాక్షి… విడ్డూర పాత్రికేయం… వితండ పాత్రికేయం… ఈ రెండు స్టోరీలూ అవే…
  • రిపబ్లిక్ టీవీ ఆర్నబ్ గోస్వామి ‘పొలిటికల్ లైన్’ నిజంగానే మారిందా..?!
  • ఆత్మాభిమానం ఓవర్‌డోస్… అపార్థాలు, అవమానాలు, మనోగాయాలు…
  • విడిపోయిన జంటను కలిపిన సుప్రీం ‘సిక్స్త్ సెన్స్’… కానీ..?
  • ప్రపంచాధిపత్యం కోసం మొదలైన ‘డిజిటల్ కురుక్షేత్రం’..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions