మావల్లే అంటే మా నుంచే తీవ్రమైన ప్రతిఘటన, నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో రేవంత్ రెడ్డి 20 వేల కోట్ల మేరకు కరెంటు చార్జీలు పెంచలేదు తెలుసా అంటున్నాడు మాజీ యువరాజు కేటీయార్…
నవ్వొచ్చింది… అఫ్‌కోర్స్, బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోయాక అత్యంత ప్రజాస్వామిక పార్టీ అయిపోయింది… గతంలో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుని, ప్రజల వ్యతిరేకత మూటగట్టుకున్న ఆ పార్టీ హరీష్, కేటీయార్‌లు ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా పరుగులు తీస్తున్నారు…
ఏదో ఒకటి… ట్వీటాలి, ఉరకాలి, తిట్టాలి, జనంలో రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత పెంచాలి… (నిజానికి కాంగ్రెసోళ్లను ఎవరూ దెబ్బతీయనక్కర్లేదు… వాళ్లే చేసుకోగలరు… అత్యంత సమర్థులు…) ఇదే ధ్యేయం… రేవంత్ రెడ్డి కరెంటు చార్జీలను 20 వేల కోట్ల మేరకు పెంచుతాడని కలగని, కలలోనే ట్వీటి, ఇక ప్రజలు లక్షలాదిగా రోడ్ల మీదకు వచ్చి సచివాలయాన్ని, గాంధీభవన్‌ను ముట్టడిస్తారని అనుకుని… ఆ స్టేట్‌మెంట్ ఇచ్చినట్టున్నాడు…
Ads
అసలే భద్రాద్రి థర్మల్ ప్లాంటు సబ్ క్రిటికల్ టెక్నాలజీ మీద బోలెడు ఆరోపణలు, విమర్శలున్నాయి… కాళేశ్వరంలాగే ఇదీ తెలంగాణకు గుదిబండ కాబోతోంది… మరోవైపు యాదాద్రి థర్మల్ ప్లాంటు ధర ఏకంగా 8.50 దాటేట్టు కనిపిస్తోంది… అది నడపాలో ఏం చేయాలో రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వానికి అంతుపట్టదు…
రేవంత్ రెడ్డికి గత కేసీయార్ పాలనలో యథేచ్ఛగా సాగిన కరెంటు కొనుగోళ్లు, కమీషన్ల బాగోతంపై విచారణకు ఆదేశించాలనే సోయి లేనట్టుంది… చత్తీస్‌గఢ్ కరెంటు మీద విమర్శలు ఏనాటి నుంచో ఉన్నవే… కేసీయార్ పాలనలో దాదాపు 25 వేల కోట్ల దాకా ప్రజలపై భారం మోపారని ప్రభుత్వవర్గాలే లెక్కలు చెబుతున్నాయి… పెరిగిన కరెంటు బిల్లుల భారం జనానికీ తెలుసు… ఫిక్స్‌డ్ ఛార్జీలు, స్లాబుల మార్పిడితో బోలెడు దొంగదెబ్బలు కొట్టాడు కేసీయార్…
ఇలా కేసీయార్ హయాంలో కరెంటు అనేదే పెద్ద అక్రమాలు, భారాల బాగోతం… అలాంటిది మా కారణంగానే 20 వేల కోట్ల భారం వేయలేదు తెలుసా అనే కేటీయార్ స్టేట్‌మెంట్ అందుకే నవ్వొచ్చింది…
నమస్తే తెలంగాణలో ఈరోజు కనిపించిన ఓ వార్త కేటీయార్ ట్వీట్లకన్నా మరీ నవ్వు పుట్టించింది… డిస్కమ్‌లు సకాలంలో ఏఆర్ఆర్ (కరెంటు సంస్థల ఆదాయ వ్యయాల నివేదిక) సమర్పించలేదు కాబట్టి రెగ్యులేటరీ కమిషన్ కోటిన్నర జరిమానా విధించిందట… ఆ భారం జనం మీద పడుతున్నదట… రేవంత్ సర్కారు ఘోర వైఫల్యమట…
హహహ… కొన్ని వేల కోట్ల అక్రమాలు, భారాల మాట విడిచి బీఆర్ఎస్ గొంతుక కోటిన్నర మాట మాట్లాడుతోంది… ఏం రాయాలో తెలియదు, రాసేవాళ్లు కనీసం కరెంటు బేసిక్స్ తెలుసుకోవాలనే సోయి కూడా లేనట్టుంది… నమస్తే పార్టీని నడిపిస్తుందో, పార్టీ తరహాలోనే నమస్తే నడుస్తుందో గానీ… ఈమధ్య బీఆర్ఎస్ నేతల ట్వీట్లు, నమస్తే వార్తలు సేమ్ సేమ్…!!
Share this Article