నిఖిల్ గురించి ఒకసారి చెప్పాలి… అదేనండీ, బిగ్‌బాస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇప్పుడు… విష్ణుప్రియను మోసే మీడియా, సోషల్ మీడియా తన మీద ట్రోలింగ్ స్టార్ట్ చేశాయి…
తను ఓ అటవీ మృగం టైపు అట… పానీపట్టు టాస్కులో ప్రేరణ, యష్మి పట్ల రూడ్‌గా బిహేవ్ చేశాడట… నిజానికి ఒక మాట చెప్పుకోవాలి ముందుగా… ఈసారి బిట్‌బాస్‌లో (అఫ్ కోర్స్ గత సీజన్‌లో కూడా…) కన్నడ బ్యాచ్ పర్‌ఫెక్ట్ గేమ్ ఆడుతున్నారు…
మన తెలుగు ఘనులకన్నా మంచి తెలుగు మాట్లాడుతున్నారు… హౌజులో కూడా వాళ్లు తెలుగులోనే సంభాషిస్తారు… పృథ్వి, యష్మి, ప్రేరణ, నిఖిల్ ఎవరైతేనేం..? నిఖిల్ క్రికెట్‌లో ధోనీలాంటోడు… మొహంలో ఏ ఎమోషనూ కనిపించదు… హెలికాప్టర్ షాట్ కొడితే ప్రత్యర్థి జట్టు షాక్…
Ads
సేమ్, నిఖిల్ మొహంలో ఏ ఎమోషన్సూ పలకవు… నవ్వు అనేది మచ్చుకైనా కనిపించదు… కానీ ఆటలో దిగాడంటే రాక్షసుడే… ఎదురుగా ఎవరున్నా సరే నెట్టేసుకుంటూ ముందుకు వెళ్లిపోతాడు, యాక్టివ్… పానీపట్టు ఆటలో తను మా యష్మి, మా ప్రేరణ అని చూడలేదు…
వెళ్లి తన చంకలో వాళ్లిద్దరి చేతులూ ఇరికించుకుని ట్యాంకుకు దూరం జరిపాడు… పార్ట్ ఆఫ్ గేమ్… తను అసభ్యంగా, అనాగరికంగా బిహేవ్ చేసిందేమీ లేదు… అశ్లీలపు టచ్ ఏమాత్రం లేదు… సరే, గౌతమ్ అనే పిచ్చోడు ఏదో అరిచాడు… నిఖిల్ కోపంగా ట్యాంకును గుద్ది, లోపలకు వెళ్లిపోయాడు విసురుగా…
తను ఆటలో ఎమోషన్ ప్రదర్శించడం తొలిసారి… యష్మి ఏదో చెప్పబోయి దగ్గరకు రాబోతే, సారీ, డోన్ట్ టచ్ మి అనేశాడు… అక్కడ కన్నడ ప్రేమ, పక్షపాతం ఏమీ లేవు… జస్ట్, గేమ్, జస్ట్ యాన్ ఎమోషన్… అంతే… తను కన్నీళ్లు పెట్టుకోవడమే ఓ స్ట్రేంజ్ థింగ్…
అసలు ఆ ఆటే బిగ్‌బాస్ మార్క్ చెత్తా ఆట… ఎవరైనా వెళ్లి నీళ్లు కాపాడుకునే ప్లేయర్లను బయటికి లాగొచ్చు, హోల్ బ్లాకర్లను పీకిపారేయొచ్చు… టేస్టీ తేజ తెలివి, నబీల్ దారుఢ్యం కారణంగా విష్ణుప్రియ టీమ్ గెలవొచ్చుగాక… కానీ భలే పోరాడింది మాత్రం ప్రేరణ, యష్మి… అఫ్కోర్స్స, రోహిణి, నయని పవని కూడా బాగానే ఆడారు గానీ…
నయని పవని మళ్లీ ఏదో ఏడ్చింది… ఆమె అంతే… ఈసారి బయటికి పోతుందేమో బహుశా… అంతటి ఎర్రగడ్డ సీనియర్ కేస్ మణికంఠే విసుగుగా వెళ్లిపోయాడు సింపతీ గేమ్ వర్కవుట్ గాక… నయని పవని ఎంత..? ఈ ఆట తీరు చూశాక హఠాత్తుగా యష్మి వోట్లు పెరిగాయి, పెరుగుతాయి… ఆ టెంపర్ చూపించింది… మొదట్లో ఆమె మీద ఉన్న నెగెటివిటీ బ్రేకయిపోయింది… గుడ్…
Share this Article