శ్రీమురళి… తాజాగా విడుదలైన పాన్ ఇండియా కన్నడ సినిమా బఘీరాలో హీరో… శ్రీమురళి ఎవరనే వివరాలు సెర్చుతుంటే ఆసక్తికరం అనిపించింది తన నేపథ్యం… పక్కా సినిమా కుటుంబం తనది…
కన్నడిగే కానీ, మనతోనూ తనకు బంధం ఉంది… మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడి కొడుకు ప్రశాంత్ నీల్… తెలుసు కదా… కేజీఎఫ్‌తో ఎక్కడికో వెళ్లిపోయాడు… ప్రశాంత్ నీల్ సోదరి పేరు విద్య… తనను లవ్ చేసి, పెళ్లి చేసుకున్నాడు శ్రీమురళి… అప్పుడప్పుడూ తెలుగు తెరపై కనిపించే ఆదర్శ్ ప్రశాంత్ నీల్ కజిన్…
వీళ్లకు ఫేమస్ రాజకుమార్ ఫ్యామిలీతో బంధం ఏమిటంటే..? రాజకుమార్ భార్య పార్వతమ్మ… ఆమె సోదరుడు, నిర్మాత చిన్నెగౌడ కొడుకే ఈ శ్రీమురళి… మేనల్లుడు… అలా పునీత్ రాజకుమార్, శివ రాజకుమార్‌లతో కుటుంబ బంధం… పార్వతమ్మ మరో ఇద్దరు సోదరులు కూడా సినిమా నిర్మాతలే… అలా శ్రీమురళి చుట్టూ అల్లుకున్న బంధాలన్నీ సినిమావాళ్లే…
Ads
2003లోనే సినిమాల్లోకి వచ్చిన శ్రీమురళి పట్టుమని పాతిక సినిమాలు కూడా చేసి ఉండడు… అన్నట్టు ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రంలో హీరో కూడా శ్రీమురళే… ఆ సినిమా నిర్మాత ప్రశాంత్ నీల్ సోదరుడే…
మరి బఘీరా..? ఈ సినిమాకు మూల కథ అందించింది ప్రశాంత్ నీల్… ఆ బ్రాండ్‌తోనే సినిమా ప్రచారం చేసుకున్నారు… కానీ కథకు తగిన ప్రజెంటేషన్ ఉంటేనే కదా సినిమా ఆడేది… ఆకట్టుకునేది… కొన్నేళ్లుగా బ్లాక్ బస్టర్లను అందిస్తున్న హొంబలే ఫిలిమ్స్ వాళ్లే దీన్ని కూడా నిర్మించినా దర్శకుడు సూరి సినిమాను రక్తికట్టించలేకపోయాడు… (మూల కథ ప్రశాంత్‌దే అయినా స్క్రీన్ ప్లే, మాటలు దర్శకుడివే…)
సూరి అంటే ఎవరో కాదు… సలార్ సినిమా రచయిత..! బఘీరా విషయానికి వస్తే పోలీస్ కొలువులో ఉండి అక్రమార్కుల వేటకు పరిమితులు ఎదుర్కునే హీరో… పగలు ఖాకీ కొలువు, రాత్రి బఘీరా పేరుతో సూపర్ హీరోగా ఒక్కొక్కడినీ వేటాడుతుంటాడు… అదీ కథ… కథలో కొత్తదనం ఏమీ లేదు… పైగా సినిమా మొత్తం దంచుడే దంచుడు… యాక్షన్ యాక్షన్…
తెర నుంచి కారే నెత్తుటితో థియేటర్ అంతా కమురు వాసనే… సినిమా కథను హాలీవుడ్ పాపులర్ కామిక్ బ్యాట్‌మన్ తరహాలో రాశాడు ప్రశాంత్ నీల్… తనే దర్శకత్వం వహిస్తే ఎలా ఉండేదో గానీ ఈ దర్శకుడు తడబడ్డాడు… ఓవర్ హీరోయిక్ ఎలివేషన్లు మాత్రమే సినిమాను పైకి లేపుతాయనే భ్రమలో ఉన్నట్టున్నాడు…
రుక్మిణి వసంత్ ఈమధ్య బాగానే పాపులరైన నటి… ఆమెను మరీ ఓ పేలవమైన పాత్రకు పరిమితం చేశారు… ప్రకాశ్ రాజ్‌కు మొదట్లో హైప్ ఇచ్చారు కానీ తరువాత తేలిపోయింది పాత్ర… పైగా ప్రకాశ్ రాజ్ నటన, డిక్షన్ మరీ మొనాటనీ అయిపోయింది… హొంబలే ఫిలిమ్స్ అంటేనే సంగీతం అజనీష్ కదా… ఇందులోనూ తనే… తన బీజీఎం మాత్రమే సినిమాకు కాస్త బలం… అంతకుమించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు…
Share this Article