Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

2025… అంతానికి ఇది ఆరంభం… ఈ జోస్యాలు నిజమేనా..?

November 1, 2024 by M S R

ఎడారుల్లో వరదలొస్తున్నాయి… కరువు ప్రాంతాల్లోనూ భారీగా వర్షాలు… హఠాత్తుగా కుండపోత, నగరాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది… మరోవైపు ఉక్రెయిన్ – రష్యా యుద్ధం సాగుతూనే ఉంది… ఇజ్రాయిల్- పాలస్తీనా యుద్ధం ఇప్పుడు ఇరాన్, లెబనాన్ దేశాలకూ పాకింది… తాజాగా ఇజ్రాయిల్ మీద ఇరాన్ మళ్లీ దాడులు చేసింది… ప్రతీకారం తప్పదని ఇజ్రాయిల్ హెచ్చరించింది… తైవాన్ మీదకు చైనా ఉరుముతోంది…

ఈ యుద్ధాలేమో మూడో ప్రపంచ యుద్దానికి ప్రారంభమనే జోస్యాలు వినిపిస్తుంటే… అసలు ప్రపంచ అంతానికి ఆల్రెడీ ఇది ఆరంభమనీ, 2025లో ఇక ప్రపంచ అంతమేననీ, బల్గేరియన్ వరల్డ్ ఫేమస్ అంధ జ్యోతిష్కురాలు బాబా వంగా చెప్పింది ఇదేననీ చాలా వార్తలు కనిపిస్తున్నాయి…

ఇదుగో ప్రళయం, అదుగో వినాశనం బాపతు కుట్ర సిద్ధాంతాలు మీడియాలో చాలా కనిపిస్తాయి… కానీ ఇది వేరు… ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కుడు (మన కాలజ్ఞానం బ్రహ్మంలాగే) నోస్ట్రడామస్, బాబా వంగాలు యుగాంతం 2025లో ఆరంభమవుతుందని రాసేశారని తాజా వార్తలు చెబుతున్నాయి… కానీ కరెక్టు కాదు…

Ads

ప్రపంచ యుద్ద సంకేతాలు నిజమే… ప్రాకృతిక ఉపద్రవాలూ నిజమే… కానీ వాళ్లు నిజంగా ఏం జోస్యాలు చెప్పారో ఎవరికీ ఇదమిత్థంగా తెలియదు… ఏదో మార్మిక భాషలో వాళ్లు చెప్పినా సరే, మనవాళ్లు పలురకాలుగా బాష్యం చెబుతున్నారు… ఒకవేళ బాబా వంగా చెప్పిన జోస్యాలపై వచ్చే వార్తల సారాంశం ఓసారి నిశితంగా గమనించినా సరే, 2025లో యుగాంతం అనేది అబద్ధమని అర్థమవుతుంది…

  • యూరపులో వచ్చే సంవత్సరం భీకరమైన యుద్ధం…
  • మానవులకు గ్రహాంతరవాసులు పరిచయం అవుతారు…
  • రష్యా అధ్యక్షుడు ప్రపంచాధినేత అవుతాడు (పుతిన్?)…
  • మనిషిని ఇప్పటివరకూ తెలియని మరో కొత్త ‘శక్తి (ఎనర్జీ) కనిపెడతాడు…
  • 2043 నాటికి యూరప్ ముస్లిం పాలనలోకి వచ్చేస్తుంది…
  • 2076 నాటికి కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది…
  • మనుషుల నడుమ మైండ్ టు మైండ్ కమ్యూనికేషన్ స్టార్టవుతుంది…
  • విశ్వాన్ని ఇప్పటివరకూ అర్థం చేసుకున్న తీరు వేరు, భవిష్యత్తు వేరు…

ఇవీ వివిధ జ్యోతిష్కుల పేర్లతో ప్రచారంలో ఉన్న అంశాలు… పుతిన్‌కు ఇప్పటికే 72 ఏళ్లు… పైగా నాటో దేశాలతో పోలిస్తే రష్యా సాధనసంపత్తి చాలా పరిమితం ఇప్పుడు… ఒకవేళ చైనా, రష్యా కలిసి ప్రపంచం మీద ఆధిపత్యం సంపాదించినా సరే, వ్యతిరేకంగా మరో బలమైన దేశాల కూటమి ఏర్పాటు తప్పదు… నిజానికి కమ్యూనిజం రష్యాలో ఎప్పుడో మాయమైంది.., చైనా కూడా కమ్యూనిజానికి కొత్త ఆచరణ చూపిస్తోంది… ఉత్తర కొరియా వంటి దేశాల్లో నియంతృత్వం తప్ప కమ్యూనిజం ఎక్కడుంది..?

సో, 2076… అంటే చాలాదూరం… కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుందనేది ఓ సందేహం… అలాగే ఏలియన్స్ వస్తారనీ, మనిషితో రిలేషన్ మొదలవుతుందనేదీ కాస్త నమ్మబుల్‌గా లేదు… మనకన్నా బాగా సాంకేతికంగా డెవలప్ అయిన ఏదో గ్రహం నుంచి వస్తారు, అదుగో వచ్చేస్తున్నారు, కనిపిస్తున్నారు అనే వార్తలు శతాబ్దకాలంగా వింటున్నవే…

క్లీన్ ఆల్టర్నేట్ ఎనర్జీ వినడానికి బాగానే ఉంది… ఏమో, మనిషి కనిపెడతాడేమో… అదే జరిగితే మన చుట్టూ ప్రపంచం తీరూ మారిపోతుంది… 2043 నాటి యూరప్ మొత్తం ముస్లింల పాలన కిందకు వస్తుందనే ప్రిడిక్షన్ మిగతా మతాల ప్రతిఘటన మీద ఆధారపడి ఉంటుంది… ఒకవేళ నిజంగానే యూరప్‌లో ముస్లింల ప్రాబల్యం పెరిగితే దాని ప్రభావం సార్క్ దేశాల మీద… మన మీద… ప్రత్యేకించి సనాతన హిందూ ధర్మం మీద బలంగా పడుతుంది..! కారణం… భారతదేశ అంతర్గత హిందూ వ్యతిరేక శక్తులు, పార్టీలు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions