Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కెనడాలో ఓ గుడిపై, హిందూ భక్తులపై ఖలిస్థానీ మూకల దాడి…

November 4, 2024 by M S R

మొదటి నుంచీ చెప్పుకుంటున్నదే… ఖలిస్థానీ శక్తులకు అడ్డాగా మారిపోయింది కెనడా… అక్కడి సిక్కు ఎంపీల మద్దతు లేనిదే ట్రూడో ప్రభుత్వానికి మనుగడ లేకపోవడంతో, తను మెతక వైఖరి తీసుకోవడంతోపాటు ఏకంగా ఇండియాతో రిలేషన్స్ తెంచుకోవడానికీ సిద్ధపడుతున్నాడు…

దీంతో ఖలిస్థానీ శక్తులకు ఆడింది ఆట అన్నట్టుగా మారింది… బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా… ఈ మూడూ ఆ శక్తులకు అడ్డాలు… కెనడా అయితే అది మరో ఖలిస్థాన్ అయిపోయింది… గతంలో హిందూ గుళ్ల మీద పొలిటికల్, బెదిరింపు రాతలకు దిగిన మూకలు ఈసారి కెనడాలో ఏకంగా ఓ గుడికి వచ్చిన హిందువులపై దాడికి దిగారు…

కెనడా ధోరణికి అమెరికా మద్దతు… గతంలో కూడా చూశాం కదా, ఢిల్లీ వీథుల్లో స్వైరవిహారం… ఆప్ మద్దతుతో చెలరేగిన తీరు… మోడీ ప్రభుత్వం చేష్టలు దక్కింది… నెలల తరబడీ ఢిల్లీని నిర్బంధించారు… అంతెందుకు..? సాక్షాత్తూ మోడీయే పంజాబ్ రైతుల ఆందోళనలతో క్షమాపణలు చెప్పి మరీ వ్యవసాయ మార్కెటింగ్ చట్టాల్ని వెనక్కి తీసుకున్నాడు…

Ads

తను పంజాబ్ వెళ్తే ఓ సన్నని ఇరుకైన రోడ్డుపై ఓ ట్రాక్టర్ అడ్డుపెట్టి ఏకంగా ప్రధాని కాన్వాయ్‌నే ఆపేసి, ఆందోళనకర- ఉద్రిక్త పరిస్థితిని క్రియేట్ చేశారు… తాజా కెనడా గుడిపై దాడి సంఘటనను ట్రూడో పేరుకు పైపైకి ఖండిస్తున్నా సరే, తను చేసేదేమీ లేదు, కుర్చీ కాపాడుకోవడం కోసం కిమ్మనకుండా ఉండిపోతాడు…

అసలే ఈమధ్య కాలంలో కెనడా, ఇండియా నడుమ దౌత్య సంబంధాల్లో క్షీణత చోటుచేసుకుంటోంది… ఈ తాజా సంఘటన పరిస్థితిని మరింత దిగజారుస్తుంది… మోడీ ప్రభుత్వం ఘనమైన ప్రపంచ విజయాలు అని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా సరే, ఖలిస్థానీ శక్తుల అదుపులో పూర్తిగా ఫెయిల్యూర్ అనే ముద్రే కనిపిస్తోంది…

ఖలిస్థాన్ శక్తులకు పాకిస్థాన్ మద్దతు… పాకిస్థాన్‌కు చైనా మద్దతు… మరోవైపు బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాల్లో ఆ శక్తులు బలపడుతున్నాయి… పంజాబ్‌లో గతంలో ఖలిస్థానీ ఉగ్రవాదం ఎన్ని విపరిణామాలకు కారణమైందో అందరికీ తెలిసిందే… దేశరాజధానే వాళ్ల గుప్పిట్లో ఉంది… ఆప్ వంటి పార్టీల మద్దతు సరేసరి…

మన సాయంతో ఏర్పడిన బంగ్లాదేశ్ ఇప్పుడు చెలరేగిపోతోంది… అక్కడ హిందువులపై దాడులు… ఎక్కడేం జరిగినా సరే, హిందూ మతాన్ని టార్గెట్ చేసుకుంటున్నా సరే… ఈ దేశంలో సోకాల్డ్ సెక్యులర్ రాజకీయ శక్తులు మాత్రం కిమ్మనవు… ఆ పార్టీలు ఏమిటో తెలుసు కదా…

గతంలో కాంగ్రెస్ వైఫల్యాలు చూశాం, ఇప్పుడు మోడీ అంతకు భిన్నంగా ఏమీ లేడు… ఇదీ ఆ మూడు దేశాలతోపాటు పంజాబ్‌లోనూ హిందూ సమాజంలో అలజడిని రేకెత్తిస్తోంది… ఇదుగో ఇదీ కెనడాలోని బ్రిటిష్ కొలంబియా, సర్రేలో హిందూ భక్తులపై దాడి తాలూకు వీడియో…

https://x.com/gauravcsawant/status/1853149196188069919?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1853149196188069919%7Ctwgr%5E0ee85f13b04e8b3b262467507471c1e31b93101e%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.mathrubhumi.com%2Fnews%2Fworld%2Fkhalistani-attack-on-hindu-temple-in-canada-1.10047360

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వారసత్వమంటే బీజేపీకి పడదట… కానీ టీ-స్టేట్ కమిటీలో ఆరుగురు వాళ్లే..!!
  • కేసీయార్ స్కామ్స్ చూసీచూడనట్లు వదిలేయాలా… ఎందుకు..?!
  • నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఈ పచ్చి భారత వ్యతిరేకి పేరు వాపస్…
  • బరేలీ మార్కెట్‌లో పడిపోయిన ‘చెవికమ్మ’ దొరికింది… ఇదుగో ఇదే…
  • అప్పట్లో మహాబాహుబలి… ఆరుగురు ఎంపీలు… ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే…
  • పెద్ద దొరవారి ధరణి..! నిఖిల జగమూ నివ్వెరపోయే భారీ భూస్కాం..!!
  • 2 రోజుల్లో నలుగురు ప్రధానులు ఔట్… ఈసారి గ్రహణ బాధితుడు ఎవరు..?
  • శుభమాని ఇల్లు కొనాలంటే… ఈ బ్లూప్రింట్లు తగలేసే గోల ఏమిట్రా…
  • ఓరాకిల్ కాదు, మిరాకిల్..! ఒకే రోజులో 7.3 లక్షల కోట్లు పెరిగిన సంపద..!
  • నటన తెలియనివాళ్ల నుంచీ నటన పిండుకోవడం ఎలాగంటే..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions