ఎమర్జెన్సీ… కంగనా రనౌత్ ఇందిరాగాంధీగా నటించిన పొలిటికల్ బయోగ్రాఫికల్ సినిమా ఎందుకు విడుదల కావడం లేదు..? ఇండస్ట్రీలో ఈ చర్చ కూడా నడుస్తోంది… ఆమె బీజేపీ ఎంపీ కావడమే ఓ కారణం కావచ్చు…
కొన్నేళ్లుగా ఆమె సినిమాలు భీకరమైన ఫ్లాపులు… ఈ ఎమర్జెన్సీ మీద ఆమెకు చాలా ఆశలున్నాయి… ఈలోపు ఎంపీ అయిపోయింది… మొదటి నుంచీ తను బీజేపీకి మద్దతుదారు… ఇప్పుడు ఆ పార్టీ నుంచే ఎంపీగా గెలిచింది…
పార్టీ ఎంపీగా తనకు కొన్ని పరిమితులున్నాయి… పార్టీ లైన్ దాటి సున్నితమైన విషయాలపై రాజకీయ విమర్శలు చేయడం పార్టీ హైకమాండ్‌కు నచ్చదు… అందుకే ఢిల్లీలో అప్పటి రైతుల ధర్నాలు, వ్యవసాయ చట్టాలకు సంబంధించి ఏవో కామెంట్స్ చేస్తే పార్టీ మందలించింది…
Ads
ఖలిస్తానీ శక్తులు, వాటికి మద్దతుగా ఉన్న కెనడా ప్రభుత్వంతో బీజేపీ ప్రభుత్వానికి తలనొప్పి ఉంది… ఇరు దేశాల సంబంధాలే దెబ్బతింటున్నాయి… ఈ స్థితిలో ఆమె సినిమా రిలీజ్ అయితే మరింత తలనొప్పి అని బీజేపీ భావిస్తున్నట్టుంది…
ఆల్రెడీ ఎమర్జెన్సీ సినిమాలో తమ మతాన్ని నెగెటివ్ కోణంలో ప్రొజెక్ట్ చేశారని పంజాబ్ పార్టీలు, సిక్కు మతపెద్దలు అభ్యంతరం చెబుతున్నారు… కొన్నాళ్లు సెన్సార్ గాకుండా ఆగిపోయింది… ఎట్టకేలకు సీబీఎఫ్‌సీ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిందని కంగనా చెప్పింది… ఐనా సరే, రిలీజు కావడం లేదు… ఎందుకు..?
నిజానికి ఎమర్జెన్సీ పరిస్థితులు వేరు… స్వర్ణదేవాలయంపై సైనిక బలగాల దాడి వేరు… దాని ప్రభావం ఇందిరా గాంధీ హత్యకు దారి తీసి ఉండవచ్చు గాక… ఆ తరువాత ఢిల్లీలో సిక్కులపై కాంగ్రెస్ కేడర్ దాడులు… ఇదంతా వేరు… ఐతే కంగనా తన సినిమాలో ఏం ప్రొజెక్ట్ చేసిందో తెలియదు… పెద్ద వివాదాస్పద అంశాలు లేవు కాబట్టే సీబీఎఫ్‌సీ క్లియరెన్స్ ఇచ్చినట్టుంది…
ఐనా సరే, సినిమా రిలీజ్ కావడం లేదు… ఆ సినిమాలో నిజంగానే సిక్కు సమాజం తీవ్రంగా అభ్యంతరపెట్టే అంశాలున్నాయా..? తమకు ఇది రాజకీయంగా ఇబ్బందికరం అవుతుందని బీజేపీ భావిస్తోందా..? తను బీజేపీ ఎంపీ కాబట్టి సినిమాలో అంశాల్ని పార్టీకి రుద్ది విమర్శలు చేయడానికి నాన్ బీజేపీ పార్టీలు రెడీగా ఉంటాయి…
తను బీజేపీ ఎంపీ కాకపోయి ఉంటే… కేంద్ర ప్రభుత్వం ఈ సినిమాను పెద్దగా పట్టించుకునేది కాదు… సో, ఆమె బీజేపీ ఎంపీ కావడమే సినిమా రిలీజుకు ఓ అడ్డంకిగా మారినట్టుంది…
కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు … రాబోెయే పంజాబ్ ఎన్నికల్లో నష్టం జరుగుతుందనే భావనతో కేంద్ర ప్రభుత్వం రిలీజుకు అడ్డం పడుతోందని రాసుకొచ్చాయి… కానీ హర్యానా ఎన్నికలు అయిపోయాయి, పంజాబ్ ఎన్నికలు ఇప్పట్లో లేవు… మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలపై సిక్కుల ప్రభావం బలమైంది కూడా కాదు…
కెనడాతో ఇండియా ఎదుర్కొంటున్న దౌత్యసంబంధాల నేపథ్యంలో సినిమా రిలీజ్ ఆగిపోయిందని మరికొన్ని సంస్థలు రాసుకొచ్చాయి… అదీ పెద్ద బలమైన అడ్డంకిగా కనిపించడం లేదు… ఐనా సినిమా ఎందుకు రిలీజ్ కావడం లేదు…
ఆమె కారణాలేమీ చెప్పడం లేదు… ఆర్థికపరమైన వివాదాలు కూడా ఏమీలేవు… సో, రిలీజుకు ఏ కారణాలు అడ్డుపడుతున్నాయనేది ఓ మిస్టరీగా మారింది సగటు ప్రేక్షకుడికి… చూడబోతే కంగనా సినిమా కథలో ఎమర్జెన్సీ నాటి సిట్యుయేషన్ దాటి ఇంకా ముందుకు పోయినట్టుంది… ఇందిర హత్యానంతరం ఢిల్లీ అల్లర్లను గనుక ప్రొజెక్ట్ చేసి ఉంటే కాంగ్రెస్ కూడా కార్నర్ అయి ఉండేదేమో… మొత్తానికి సినిమా కథాంశాలు బీజేపీ హైకమాండ్‌కు నచ్చడం లేదు అని అర్థం చేసుకోవాలా..?! కంగనా కన్విన్స్ చేయలేకపోతోందని భావించాలా..?!
Share this Article