.
బార్క్ రేటింగ్స్ చూస్తుంటే… ఓచోట చూపు ఆగిపోయింది… మామూలుగా ఏదైనా పార్టీకో, ఎవరైనా నాయకుడికో మైకులా వ్యవహరించే చానెళ్లను ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడరు…
కానీ పక్కా చంద్రబాబు మౌత్ పీస్‌గా భావించబడే ఏబీఎన్ చానెల్ ఈసారి మూడో స్థానానికి చేరుకోవడం విశేషం అనిపించింది… వింత అనలేం గానీ, కాస్త అనూహ్యమే… ఎందుకంటే, సేమ్ తనలాంటి టీడీపీ చానెల్ టీవీ5ను తొక్కేసి మరీ మూడో స్థానానికి చేరుకుంది…
Ads
అఫ్‌కోర్స్, టీవీ5 తన పేరులో ఉన్న నంబరుకు న్యాయం చేస్తూ అయిదో ప్లేసులో కూర్చుంది… (చూశావా నాయుడు సాబ్, మా సాంబశివరావును పంపించావు కదా, వెంటనే ఎంత అన్యాయం జరిగిపోయిందో, ఎంత నష్టం వాటిల్లిందో అనేవాళ్లూ ఉంటారండోయ్…)
మీరు లిస్టు పరిశీలిస్తే వైసీపీ మౌత్ పీస్ సాక్షి మరీ ఏడో ప్లేసులోకి, మరో టీడీపీ మైక్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఎనిమిదో ప్లేసులోకి… కేసీయార్ మైక్ టీన్యూస్ తొమ్మిదో ప్లేసులోకి కుదురుకున్నాయి… ఇవి వైసీపీ చానెల్సే అని ఢంకా బజాయించి టీడీపీ కూటమి ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్ల ద్వారా ప్రసారాలే బంద్ పెట్టించాలని ప్రయత్నిస్తున్న టీవీ9, ఎన్టీవీ ఈరోజుకూ ఫస్ట్, సెకండ్ ప్లేసుల్లో ఉన్నాయి… కూటమి ఆంక్షల పప్పులు ఉడకడం లేదని అర్థం…
చెప్పడం మరిచిపోయా… ఎవరు తొక్కాలనుకున్నా సరే, అదే ఎన్టీవీకి సంబంధించిన భక్తి టీవీ ఏకంగా దేశంలోనే నంబర్ వన్ భక్తి చానెల్‌గా రేటింగ్స్ సంపాదించింది… గుడ్…
ఇవి సరే గానీ… వినోద చానెళ్ల పరిస్థితి ఏమిటీ అంటారా..? దిక్కుమాలిన కంటెంట్లతో జీతెలుగు సీరియళ్లు పోటీలో వెనకబడిపోయాయి… అర్జెంటుగా ఆ యాజమాన్యం తమ క్రియేటివ్ టీమ్స్ పనితీరును సమీక్షించుకోవాలి… అసలు టాప్ 30 జాబితాలో ఒక్కటంటే ఒక్క జీతెలుగు సీరియల్ లేదు…
ఫాఫం, కంటెంటును యమలోకం దాకా తీసుకుపోయి, ఈమధ్య తెగ విసిగిస్తున్న త్రినయని సీరియల్ ఆ చానెల్ సీరియళ్లలోనే నాలుగో ప్లేసుకు పడిపోయింది… మేఘసందేశం, నిండు నూరేళ్ల సావాసం, పడమటి సంధ్యారాగం సీరియళ్లు త్రినయనిని తొక్కేశాయి…
అన్నట్టు… పాత కార్తీకదీపం సీరియల్ రేటింగుల్లో ఎంత వైభవం అనుభవించిందో తెలుసు కదా… కానీ తలతిక్క ప్రయోగాలతో దాన్ని చేజేతులా చెడగొట్టిన ఆ దర్శకుడు ఎవరో గానీ… ఆ కథకు సంబంధం లేకుండా… ఆ బ్రాండ్‌ను, ఆ హీరోహీరోయిన్లను వాడుకుని మరో కార్తీకదీపం తీసుకొచ్చాడు గానీ ఇన్నాళ్లూ పెద్దగా వెలగలేదు…
కానీ ఈ వారం కార్తీకమాసం అని కాబోలు… కార్తీకదీపం సీరియల్ అగ్రస్థానానికి వచ్చేసింది… జనం ఆదరిస్తున్నారు… ఇన్నాళ్లూ వెలిగిపోయిన బ్రహ్మముడి సీరియల్‌ను రెండో స్థానంలోకి నెట్టేసింది… మూడో ప్లేసు చిన్ని… ఎస్, స్టార్ మా టీవీ రీచ్ ఎక్కువ… వాళ్లకు చాలా వేషాలు తెలుసు… ఐనాసరే, కనీస పోటీ ఇవ్వాలనే సోయిని కూడా జీతెలుగు కోల్పోయింది… ఫాఫం…
మరి ఈటీవీ..? దానికి ప్రైమ్ టైమ్ న్యూసే దిక్కు ఈరోజుకూ టీఆర్పీల కోసం… శ్రీదేవి డ్రామా కంపెనీ, ఫ్యామిలీ స్టార్స్, ఢీ కాస్త నయం… జబర్దస్త్ సోదిలో లేకుండా దిగజారిపోయింది… ఐరన్ లెగ్ శివాజీ అనుకోవచ్చా అధ్యక్షా..!! అవునూ… బిగ్‌బాస్ రేటింగ్స్ ఏమిటీ అంటారా..? వద్దులెండి… ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నదే కదా… ఈసారి సీజన్ కూడా ఫ్లాప్ అని..!!
Share this Article