సుధీర్ వర్మ, చందు మొండేటి, నిఖిల్ దోస్తులు… కొన్నేళ్ల క్రితం వరకూ కలిసి పొట్టు పొట్టు తిరిగేవాళ్లు… ఏవో కార్తికేయ, స్వామి రారా వంటి సినిమాలూ క్లిక్… అయితే.. ?
అదే సుధీర్ వర్మ అదే నిఖిల్ మళ్లీ మళ్లీ అదే కాంబినేషన్‌తో సినిమాలు తీస్తే..? సారీ, అది పదే పదే వర్కవుట్ కావాలనేమీ లేదు… సరిగ్గా కాలేదు కూడా… అదే ప్రస్తుతం రిలీజైన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా కథ కూడా…
టైటిల్‌లో చెప్పినట్టే… అది అప్పుడెప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసుకున్న సినిమా… ఇప్పుడు రిలీజైంది… నడుమ ఏవో అవాంతరాలు… అప్పట్లో సంతకం చేశాడు కదా… సినిమా కంప్లీట్ చేశాడు నిఖిల్…
Ads
అప్పట్లో తను జస్ట్, ఓ యాక్టర్… కార్తికేయ హిట్ తరువాత పాపులర్ హీరో అయిపోయాడు… కానీ ప్రతిదీ కార్తికేయ కాదు కదా… గతంలో అగ్రిమెంట్లు చేసుకున్న ప్రతిదీ కార్తికేయ కాదు కదా… అదే సుధీర్ వర్మ… సరే, నిఖిల్ డేట్లున్నాయి కదా, మన ఫ్రెండే కదాని చకచకా సినిమా చుట్టేశాడు…
అసలు ఏం చూసి ఈ స్క్రిప్ట్ ఒప్పుకున్నాడు నిఖిల్…? భలే వారే, అప్పట్లో సినిమా చాన్స్ దొరకడమే ఎక్కువ కదా అంటారా…? నిజమే… సినిమా చూస్తుంటే అదే అనిపిస్తుంది… అసలు ఏ కాలంలో స్టార్ట్ చేశారు ఇది, ఎందుకు హడావుడిగా చుట్టేశారు..? ఏమీ సరిగ్గా అర్థం కాదు…
ఆమధ్య ఏదో సినిమా… హీరోకు, నిర్మాతకూ, దర్శకుడికీ నడుమ విభేదాలు… షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది… సదరు నిర్మాతకు తెలుగు ప్రేక్షకుల అభిరుచి, జ్ఞానం మీద భలే నమ్మకం… పిచ్చి గాడిదలు ఏం రిలీజ్ చేసినా చూస్తారులే అని ధీమా… రిలీజ్ చేశాడు…
బహుశా ఈ నిఖిల్ సినిమా కూడా అదే బాపతు కావచ్చు… కథా రచయిత నోటికొచ్చినట్టు తెలుగు టీవీ సీరియల్‌కు రాసినట్టు రాసేశాడు… ఇద్దరు హీరోయిన్లు… చాన్సులు దొరికితే ఎక్కువ అనుకునే బాపతు… మధ్యలో ఒకరిద్దరు కమెడియన్లు కూడా పెట్టారు…
అంతా కలిపి కలగాపులగం, ఓ గందరగోళం… దర్శకుడు ఏం తీశాడో, హీరో ఏం చేశాడో, నిర్మాత ఎక్కడ పడుకున్నాడో తెలియదు గానీ… ఓ నత్తి బ్రెయిన్ బాపతు సినిమా రిలీజైంది… ప్రేక్షకులూ బహుపరాక్…
మీకూ మానసిక ఆరోగ్యం ముఖ్యం… చెత్తా సినిమా ప్రమోటర్లు, రివ్యూయర్లు, ఇంటర్వ్యూయర్లు ఏమైనా రాసుకోనీ… మీరు సాహసం చేయకండి… ప్లీజ్… దూరంగా ఉండండి… తీసేవాడికి చూసేవాడు అలుసు అని… ఈ మాట అనడానికి పెద్ద సందేహించడం లేదు… థియేటర్లకే కాదు, ఓటీటీలో వచ్చినా దూరంగా ఉండండి… ఫాఫం నిఖిల్… జాలిపడటమే తప్ప మనమూ చేయదగిందేమీ లేదు… తన నటనా స్థాయే అంతంతమాత్రం… పైగా ఈ దిక్కుమాలిన సినిమాలు…. పోనీలే, నిఖిల్… మంచి రోజులు రాకుండా పోవు..!!
Share this Article