.
ప్రపంచ రాజకీయాలు..! 2024 నవంబర్ 7…
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక!
రిగ్గింగ్ జరగవచ్చు అనే అనుమానాలతో మొదలైన అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు ట్రంప్ మీద హత్యా ప్రయత్నం వరకూ వెళ్లి చివరికి హమ్మయ్య అనేట్లుగా ముగిసాయి!
Ads
డోనాల్డ్ ట్రంప్ ఒక పిచ్చోడు! మళ్ళీ అమెరికాని డోనాల్డ్ ట్రంప్ అనే పిచ్చోడు, చెత్త వెధవ చేతిలో పెడతారా? డెమోల ప్రచారం ఇలానే సాగింది!
డోనాల్డ్ ట్రంప్ తనని చెత్త వెధవ అని డెమోలు తిట్టగానే వెంటనే ఒక పారిశుద్ధ్య కార్మికుడుగా మారి చెత్త తీసుకుళ్ళే ( Dump Truck ) వాహనం డ్రైవ్ చేసి అమెరికన్ల మనసు దోచుకున్నాడు! అక్టోబర్ 30 న జరిగిన ఈ సంఘటన మీద చాలామంది ఎన్నికల విశ్లేషకులు ఎలక్షన్ స్టంట్ అని ఎద్దేవా చేశారు కానీ అది కీలకమైన మలుపు అని ఊహించలేక పోయారు!
నిజం కూడా అదే!
ఒక అమెరికా మాజీ అధ్యక్షుడు అయి వుండి ప్రస్తుత అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేస్తూ, ఒక పారిశుద్ధ్య కార్మికుడిగా డంప్ ట్రక్ డ్రైవ్ చేయడం అమెరికన్లు చెత్త వెధవని ఎన్నుకోరు అని సింబాలిక్ గా చెప్పాడు!
డోనాల్డ్ ట్రంప్ మీద హత్యా ప్రయత్నం అనేది ఎన్నికల వ్యూహం లో ఒక భాగం అని ప్రత్యర్థులు ఆరోపించినా ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని అసమర్థులు కాదు అమెరికన్లు!
********
డోనాల్డ్ ట్రంప్ విజయం ఎలా సాధ్యం అయింది? చాలా కారణాలు ఉన్నాయి.
ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఎదుర్కోవడంలో రిపబ్లికన్స్ సఫలం అయ్యారు. జార్జ్ సోరోస్ ఫండింగ్ చేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేస్తే, ఈసారి సోషల్ మీడియా మాత్రం జార్జ్ సోరోస్ ని ధీటుగా ఎదుర్కున్నది అని చెప్పవచ్చు!
ముఖ్యంగా Podcast అనే డిజిటల్ మాధ్యమం అమెరికా అధ్యక్ష ఎన్నికలని తీవ్రంగా ప్రభావితం చేసింది ఈసారి!
స్థానిక రాజకీయ నాయకులని కూర్చోబెట్టి చర్చలు జరపడం వలన ఎవరి ఆలోచలనలు ఎలా ఉన్నాయో బహిర్గతం అయ్యాయి!
Well…! కొంత మంది డెమోలు అయితే తమకి అమెరికా పట్ల ఏమాత్రం అవగాహన లేదని, కేవలం డెమోక్రాట్ పార్టీలో ఉంటూ బయటికి పెద్ద ఫోజు కొడుతున్నామని తమ చర్చల ద్వారా వాళ్ళంత వాళ్ళే బయట పెట్టుకున్నారు!
అలా అని డెమోలలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేరని చెప్పడం నా ఉద్దేశం కాదు!
No Drama! No Bias!
మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చేసరికి చర్చలో పాల్గొనడానికి వచ్చిన తమకి ఇష్టమైన వ్యక్తికీ తాము ఏ అంశాల మీద చర్చ పెట్టబోతున్నామో ముందే చెప్పి సదరు వ్యక్తిని సిద్ధం చేసి ప్రత్యర్థిని చులకన చేయడం మన దేశంలోని టీవీ చర్చలలో చూస్తున్నాం కదా! ఈసారి అమెరికన్ సోషల్ మీడియాలో చాలా ఖచ్చితమైన చర్చలు జరిగాయి ఎలాంటి మొగ్గు ఎవరి వైపు చూపకుండా!
ఇది పనిచేసింది!
********
నరేంద్ర మోడీ ఫ్యాక్టర్!
ఇది ఎలాంటి అతిశయోక్తి కాదు!
గణాంకాలు నిరూపిస్తున్నాయి!
ఈసారి పని చేసే అధ్యక్షుడు కావాలా? లేక ప్రాక్సీ శక్తులు వెనక వుండి పాలన చేసే అధ్యక్షురాలు కావాలా?
ఈ నినాదం పనిచేసింది!
జో బిడెన్ Vs నరేంద్ర మోడీ.
మాజీ అధ్యక్షుడు జో బిడెన్ పని తీరు ఎలా ఉందో చూద్దాం…..
జో బిడెన్ తన నాలుగేళ్ల పదవీ కాలంలో తీసుకున్న శెలవులు అక్షరాల 532 రోజులు!
ఇది ఒక అమెరికన్ ఉద్యోగి తన 48 ఏళ్ళ సర్వీసులో తీసుకునే శెలవులతో సమానం!
ఈ ప్రచారం పనిచేసింది!
మరి నరేంద్ర మోడీ..?
భారత ప్రధాని నరేంద్ర మోడీ తన పదవీ కాలంలో అంటే 2014 నుండి ఇప్పటి వరకూ ఒక్క రోజు కూడా శెలవు తీసుకోలేదు. ఇది RTI ద్వారా బయటికి వచ్చిన సమాచారం!
టీ బ్రేక్ కోసం కేటాయించే 15 నిముషాలు మాత్రమే మోడీకి కాస్త విశ్రాంతి తీసుకునే వెసులుబాటు ఉంటుంది!
మోడీ రోజుకి 4 లేదా 5 గంటలు మాత్రమే నిద్రకి కేటాయిస్తారు!
ఈ రికార్డ్ అనేది అమెరికన్ల ని ఆశ్చర్యంలో ముంచెత్తింది!
అఫ్కోర్స్! లెఫ్ట్, లిబరల్, జార్జ్ సోరోస్, డీప్ స్టేట్ అనేవి అమెరికాని నడిపిస్తున్నాయి అని మెజారిటి అమెరికన్లు గుర్తించారు. జో బిడెన్ అయినా, కమలా హ్యారీస్ అయినా పేరుకే అధ్యక్షులుగా ఉంటారు కానీ ప్రభుత్వాన్ని నడిపించేది వేరు అని గ్రహించారు!
గల్ఫ్ దేశాలు అమెరికాకి దూరం అవడం కేవలం కీలుబొమ్మ జో బిడెన్ వల్లనే అని గ్రహించారు అమెరికన్ ఓటర్లు!
పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అనేవి అమెరికన్ ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి!
BRICS ఎన్నడూ లేనంతగా బలపడడం అనేది మరో కారణం!
నిజానికి BRICS సమావేశం గత అక్టోబర్ లో రష్యాలో జరగడం అదే సమయంలో అమెరికాలో ఎన్నికల ప్రచారం జోరులో ఉండడం అమెరికన్లని ఆలోచనలో పడేసింది!
అమెరికన్ THINK TANK అనేది BRICS ని చాలా సీరియస్ గా తీసుకుంది!
అమెరికన్లు తమ డాలర్ ప్రాబల్యం కోల్పోవడం అనేది ఇష్టపడరు! BRICS నూతన అంతర్జాతీయ కరెన్సీని ప్రకటించింది గత నెలలోనే! ఇది డాలర్ ఆధిపత్యాన్ని ప్రశ్నించే చర్య!
సౌదీ ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ని డాలర్ ( PETRO DOLLAR ) తో కొనడం అనే ఒప్పందాన్ని కొనసాగించడం ( RENEWAL ) చేయలేదు అంటే ఆయిల్ ని కొనడానికి డాలర్ మాత్రమే అవసరం లేదు.
డోనాల్డ్ ట్రంప్ విజయానికి దోహదం చేసిన వాటిలో కొన్నింటినే స్పృశించడం జరిగింది!
క్లుప్తంగా…..
భారత్ లో కాంగ్రెస్ కి, బంగ్లాదేశ్ లో మత శక్తులకి, పాకిస్థాన్ లో సైన్యానికి, ఉక్రెయిన్ లో జెలెన్స్కీ కి, ఇరాన్ లో ఖోమేనికి, చైనాలో జింగ్ పింగ్ కి రాబోయే నాలుగు సంవత్సరాలు గడ్డు రోజులు అని చెప్పవచ్చు!
ఆసియాలో చైనా జోక్యం తగ్గించడానికి ట్రంప్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. మరీ ముఖ్యంగా చైనా నుండి లక్షా యాభై వేల ఉద్యోగాలు లాక్కొని వాటిని అమెరికన్స్ కి కట్టబెట్టే ప్లాన్ ఇప్పటికే సిద్ధం చేసినట్లుగా వార్త! అది ఏ రూపంలో ఎలా సాధ్యమో కొద్ది నెలల్లోనే తెలిసిపోతుంది!
తైవాన్ సమస్యకి ఒక రూపం రాబోతున్నది. TSMC ( Taiwan Semiconductor Manufacturing Company )ని తైవాన్ నుండి అమెరికాకి తరలించి ఇక మీరూ మీరూ ( తైవాన్ – చైనా ) చూసుకోండి అనవచ్చు.
బహుశా అమెరికన్ల ఉద్యోగాలు అమెరికన్లకే అన్న ట్రంప్ ఎన్నికల వాగ్దానం TSMC ని దృష్టిలో పెట్టుకునే చేసి ఉండవచ్చు! నిజానికి ట్రంప్ 2019లో కనుక మళ్ళీ గెలిచినట్లయితే ఈ పాటికి TSMC అమెరికాలో ఉండేదే!
TSMC చైనాకి కూడా సెమీ కండక్టర్ ఉత్పత్తులని సరఫరా చేస్తుంది. తద్వారా చైనా మీద ఒత్తిడి పెరుగుతుంది!
కోటి మందికి పైగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులని వెనక్కి పంపిస్తాను అని ట్రంప్ వారం క్రితం కీలక ప్రకటన చేశాడు. ఇదే కనుక అమలు జరిగితే భారత్ కి మిశ్రమ ఫలితాలు ఉంటాయి! అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిలో……
1.మెక్సికో
2.ఎల్ శాల్వడార్
3. భారత్, హోండురాస్, గ్వాటేమాల దేశాలు వరుస క్రమంలో ఉన్నాయి.
******
అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి ఎన్నికయిన డోనాల్డ్ ట్రంప్ తన ఆధిపత్యం నిలుపుకోవడానికి ప్రయత్నిస్తాడు అనేది నిజం!
భారత ప్రధాని మోడీని గ్లోబల్ లీడర్ గా అభివర్ణిస్తున్నాయి ప్రపంచ దేశాలు. ట్రంప్ భారత ప్రధాని నుండి గ్లోబల్ లీడర్ అనే కిరీటాన్ని లాక్కో వడానికే ప్రయత్నిస్తాడు!
అంచేత ఈ సారి భారత్ కి మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు! అంటే దీనర్ధం మంచి, చెడు రెండూ ఉంటాయి!
Contd…. Part 2 …… (పొట్లూరి పార్థసారథి)
Share this Article