.
గ్రూపు పరీక్షల కోసం, ప్రత్యేకించి యూపీఎస్సీ అభ్యర్థులు ప్రధానంగా చూసే సోషల్ వీడియోల్లో ఓ మహిళ కనిపిస్తూ ఉంటుంది… ఆమె ఇంటర్వ్యూయర్‌గా మాక్ ఇంటర్వ్యూల్లో ప్రధానంగా కనిపిస్తుంది…
అంతేకాదు, ఆమె ప్రసంగాలు ఉంటాయి… పోటీ పరీక్షల అభ్యర్థులకు ఆమె సూచనలు కూడా పాపులర్… ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు, విద్యార్థులతోపాటు సాధారణ ప్రజలకు కూడా ఆమె మాక్ ఇంటర్వ్యూలు ఆసక్తికరంగా ఉంటాయి… ఒక్క ముక్కలో చెప్పాలంటే అవి యూపీఎస్సీకి కేబీసీ…
Ads
ఫోటో చూస్తే సరిగ్గా గుర్తొస్తుంది… ఈమే ఆమె… పేరు డాక్టర్ తనూ జైన్… వయస్సు 35… అసలు ఎవరీమె అనే ప్రశ్న తలెత్తుతుంది ఆమె వీడియోలు చూస్తుంటే… నిజంగా ఇంటర్వ్యూ బోర్డు మెంబరేమో అనిపించేలా ఉంటాయి ఆమె మాక్ ఇంటర్వ్యూలు చేసే పద్ధతి…
ఆమెది ఢిల్లీ… సదర్ ఏరియాలో ఓ మధ్యతరగతి కుటుంబం… అక్కడే స్కూలింగ్… తరువాత మీరట్‌లో బీడీఎస్ చేసింది… కొన్నాళ్లు ప్రాక్టీస్ తరువాత యూపీఎస్సీ మీద కన్నుపడింది… మొదటి ప్రయత్నంలో జస్ట్, రెండు నెలలు చదువుకుంది… మెయిన్స్ క్లియర్ చేసింది, కానీ ఇంటర్వ్యూలో పోయింది…
తరువాత మరో ప్రయత్నం 2014… సీరియస్‌గానే చదివింది… మళ్లీ సేమ్ రిజల్ట్… మూడో ప్రయత్నం 2015… సాధించింది… కానీ ర్యాంకు 648… మొదట్లో సంస్కృతం తన సబ్జెక్టు… తరువాత ఫిలాసఫీకి మార్చుకుంది… ఆమె ర్యాంకుకు ఫోకల్ పోస్టింగులేమీ రాలేదు… ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆఫీసు, డీఆర్డీవో తదితర సంస్థల్లో ఏడేళ్లు పనిచేసింది…
భర్త వాత్సల్య పండిట్… తను కూడా ఐఏఎస్ ఆఫీసర్… తనూ జైన్ తరచూ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్లలో మోటివేషనల్ క్లాసెస్ తీసుకునేది… తరువాత ఆమెలో ఓ మథనం బయల్దేరి, దాన్ని వృత్తిగా, ప్రవృత్తిగా చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది… ఐఏఎస్ కేడర్ వదులుకోవడం అంటే విశేషమే… ఏటా లక్షల మంది మెదళ్లు చించుకుని ప్రయత్నించే సివిల్ సర్వీసు అది…
ఐఏఎస్‌కు రాజీనామా చేసి, కోచింగు సెంటర్లలో క్లాసులు, స్పీచెస్ కంటిన్యూ చేసేది… సోషల్ మీడియాలో కూడా వీడియోలు చేయసాగింది… అటూఇటూ తిరగడం దేనికి అనుకుని తనే తథాస్తు ఐసీఎస్ అని సొంత కోచింగ్ సంస్థ స్టార్ట్ చేసింది తనే… ఢిల్లీలోని టాప్ సివిల్స్ కోచింగ్ సెంటర్లలో ఒకటి ఇప్పుడు అది…
సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్… చాలామంది ఫాలో అవుతుంటారు ఆమె ఖాతాలను… ఇన్‌స్టాలో 8 లక్షలు, ట్విట్టర్‌లో 1.85 లక్షలు, యూట్యూబ్‌లో లక్ష మంది ఫాలోయర్స్… ఇదీ ఐఏఎస్ వదిలేసి ఫుల్ టైమ్ సివిల్స్ టీచర్‌గా మారిన శ్రీమతి తనూ జైన్ స్టోరీ… డెంటిస్ట్, ఐఏఎస్, సివిల్స్ మెంటార్… తరువాత ఏమిటి అని అడిగితే నవ్వి కాలం చెబుతుంది అంటుందామె…
ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి ఎక్కువ ఆమెకు… పోయెట్, రైటర్… ఇద్దరు ఐఏఎస్ కదా, బాగానే వెనకేసుకుని ఉంటారు కదా అంటారా..? ఆమె నెట్‌వర్త్ దాదాపు 70 లక్షలు… అంతే… ఆమె డబ్బు మనిషి కాదు..!!
Share this Article