.
వోకే… గతంలో చంద్రబాబు ఓసారి, జగన్ ఓసారి ఇచ్చిన అవకాశాల్ని తిరస్కరించిన ప్రవచనకర్త చాగంటి ఈసారి చంద్రబాబు ఆఫర్ చేసిన సలహాదారు పాత్రను అంగీకరించాడు…
సరే, డబ్బు కోసం కాకపోవచ్చు… తను దానికి అతీతుడు, నిరాడంబరుడు… కానీ తన ప్రవచనాల్ని ఇష్టపడే ఏ ఒక్కరూ తను అధికారి పోస్టులోకి చేరి, ఆస్థాన విద్వాంసుడు అయ్యే దృశ్యాన్ని కోరుకోలేదు, అందుకే చంద్రబాబు ఇచ్చిన పదవినీ ఇష్టపడలేదు…
Ads
ఏమో… ప్రపంచంలో ఎవరైనా సరే కాంత దాసులు, క్యాష్ దాసులు, కీర్తి దాసులు …. అఫ్‌కోర్స్, ఆయన నియమబద్ధుడు..,. కానీ ఎందుకో టెంప్టయ్యాడు… కారణం తెలియదు… అందరి ఊహలకూ భిన్నంగా చంద్రబాబు ఇచ్చిన పోస్టును శిరసావహించాడు… (తనను అభిమానించే చాలామంది తటస్థులు హాశ్చర్యపోయారు…)
సరే, ఆయన మీద నెగెటివ్ వ్యాఖ్యలు అవసరం లేదు, తన ఇష్టం… తన ప్రవచనాలకు భిన్నమైన స్పూర్తిని కనబరిస్తే అది తనిష్టం… చంద్రబాబు ఎవరినైనా సరే తన క్యాంపులోకి లాగేయగలడు… అది కాదు స్టోరీ…
మొన్న ఏదో ప్రముఖ వైసీపీ సైటులో ఓ వార్త కనబడింది… అదీ ఆశ్చర్యపరిచింది… (ఇంకా చంద్రబాబు దృష్టి రెండు ఫేమస్ సైట్ల మీద పడనట్టుంది… చాన్నాళ్లుగా తనకు హ్రస్వదృష్టి… ఎవడినీ వదిలిపెట్టను అంటాడు, పెద్ద పావులనే వదిలేస్తుంటాడు… సారు గారు భలే చతురుడు…)
ఆ వార్త సారాంశం ఏమిటంటే..? గరికపాటిని కాదని చాగంటిని ఎంచుకోవడానికి ఓ కారణం ఉందీ, గతంలో చిరంజీవి విషయంలో వివాదంపాలైన గరికపాటిని సలహాదారుడిని చేస్తే పవన్ కల్యాణ్‌కు కోపం వస్తుందనే భయంతో చంద్రబాబు గరికపాటి బదులు చాగంటిని ఎంపిక చేశాడు అని…
లాజిక్ పైపైన చూస్తే బాగానే అనిపిస్తుంది… కానీ …. 1) చాగంటిని గతంలోనే చంద్రబాబు సలహాదారు పాత్రకు ఎంపిక చేశాడు, కానీ ఆయనే తిరస్కరించాడు… గరికపాటి అసలు సీన్‌లోకే రాలేదు… 2) ఒకవేళ నిజంగానే చంద్రబాబు గరికపాటిని ఎంపిక చేయాలనుకుంటే చాగంటి వద్దనేవాడు కాదు, ఆఫ్టరాల్ ఈ పదవి విషయంలో పవన్ కల్యాణ్ కస్సుమనేవాడూ కాదు… ఇవన్నీ చాలా చిన్న విషయాలు… పవర్ స్టార్ కదా, తన ప్రయారిటీలు చాలా పే-ద్ద ఎత్తున ఉంటాయి…
ఎస్, గరికపాటి విషయంలో మెగా క్యాంపు ఆగ్రహంగా ఉన్న మాట నిజమే… తను పెద్ద ఇగోయిస్టు అనేదీ నిజమే… గత ఏడాది బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ ఫంక్షన్‌లో వివాదం… అక్కడ గరికపాటిని తప్పుపట్టడానికి ఏమీలేదు…
నిజానికి చాలా అంశాల్లో గరికపాటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవేర్‌నెస్ క్రియేట్ చేస్తుంటాడు… చాగంటి వెరీ ఫండమెంటలిస్టు… గరికపాటి లిబరల్… లాజికల్… ఐనాసరే, ఎప్పటిలాగే మెగా శిబిరాానికి ఏ ఇష్యూ వచ్చినా నాగబాబు వచ్చేస్తుంటాడు కదా తెర మీదకు పిచ్చి వాదనలతో, శుష్క పదాలతో, తిక్క సమర్థనలతో…
గరికపాటినీ ఆడుకున్నాడు… ఆయన విజ్ఞుడు, నాగబాబు మార్క్ జ్ఞానానికి నవ్వుకుని వదిలేశాడు… చిరంజీవి క్యాంపు కావాలనే ఇలాంటి ఇష్యూల్లో నాగబాబును ముందుకు తోసి వాళ్లనూ వీళ్లనూ తిట్టిస్తుంది కదా… రాజకీయ పరిణతి అనేది లేశమాత్రం కనిపించని శిబిరం అది… చిరంజీవికి అదంటే ప్రేమ…
సో, గరికపాటిని ఎందుకు సెలక్ట్ చేయలేదు, పరిగణనలోకి తీసుకోలేదు అనేది ఓ అబ్సర్డ్ ఇష్యూ… చంద్రబాబుతో గరికపాటికి ఎప్పుడూ సరైన బంధం లేదు… చాగంటితో ఉంది తప్ప… సో, తననే ఎంచుకున్నాడు, గతంలో తిరస్కరించాడు కాబట్టి ఈసారి ముందే చెప్పి, కన్విన్స్ చేసి, పోస్టు కట్టబెట్టాడు.. ఐనా ధర్మవ్యాప్తికీ, నైతిక ప్రమాణాల ప్రచారానికీ ఆ ఇద్దరే కనిపించడం ఏమిటి..?
ఫాఫం చాగంటి కూడా… నమ్మాడు… నైతిక ప్రమాణాలను చెప్పవచ్చు కదాని అంగీకరించాడట… తత్వం లేటుగా బోధపడుతుంది… కఠినంగా అనిపించినా సరే… చాగంటికన్నా మూఢ విశ్వాసాలను ఖండించడంలో గరికపాటి చాలా చాలా బెటర్… మరి చాగంటే ఎందుకు చంద్రబాబు ప్రియ గురువు అయ్యాడు..?
సమాధానానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు… చంద్రబాబు ఎంపికలన్నీ అలాంటివే… చివరకు టీటీడీ చైర్మన్ విషయంలో కూడా… అఫ్ కోర్స్, తను బయటికి బాగా నీతులు చెబుతాడు… ఆ నీతిచంద్రికకే మరోపేరు చంద్రబాబు..!!
Share this Article