.
చంద్రబాబు అలా తోస్తే ఇలా కూలిపోతాడు మోడీ… మోడీతోపాటు షా… చంద్రబాబుతోపాటు నితిశ్ కూడా అంతే… మరి అలాంటప్పుడు మోడీకన్నా చంద్రబాబే పవర్‌ఫుల్ కదా… తరువాత ప్లేసు నితిశ్‌దే కదా…
మరి ఇండియాటుడే సర్వేలో మోడీ ఫస్ట్ ప్లేసులో రావడం ఏమిటి..? మోడీకన్నా చంద్రబాబే బలవంతుడు కదా… ఇండియాటుడే సర్వేల ప్రామాణికత, శాస్త్రీయత ఏమిటో గానీ… ఏవీఎంల్లాగే ఇదీ మేనేజ్ చేశారంటారా..? ఈ డౌట్ వచ్చింది ఓ మిత్రుడికి…
Ads
సరే, దానికి జవాబు కష్టం గానీ… ఆంధ్రజ్యోతి ఆనందోత్సాహాలతో మా బాబు బంగారుకొండ అన్నట్టుగా ఓ పెద్ద స్టోరీ రాసుకుని మురిసిపోయింది… టాప్ టెన్‌లో మొదటి నలుగురూ మోడీ, భగవత్, షా, రాహుల్ ఉన్నారు, తరువాత ఉన్నది బాబు, ఆ నలుగురు సీఎంలు కాదు కదా… సో, పవర్ ఫుల్ సీఎం అని రాసేసుకుంది…
బాబు తరువాత నితిశ్ అట… (మోడీ కాళ్లు మొక్కటానికి ఎక్కడో నితిశ్ విశ్వప్రయత్నం చేశాడని ఓ వార్త కూడా చదివినట్టు గుర్తు… అది వేరే కథ… కాళ్లు మొక్కేదీ తెలియదు, కాళ్లు పట్టుకుని లాగేసేదీ తెలియదు… అత్యంత చంచల చక్రవర్తి… అఫ్ కోర్స్, బాబూ అంతే కదా… ఎప్పుడు యూటర్న్ తీసుకుని రాళ్లేస్తాడో తెలియదు… ఎన్నికలకు ముందు మోడీ అపాయింట్‌మెంట్, దర్శనం కోసమే నానా తిప్పలూ పడ్డాడు… ఇప్పుడు ఏకంగా మళ్లీ ఢిల్లీ చక్రాలు తిప్పుతున్నాడు…)
జగన్ క్యాంప్ మొదట్లో వైఎస్ హత్యకు అంబానీయే కారకుడని నిందించింది… కానీ తనే అంబానీ క్యాంపులో చేరి, అంబానీ చెప్పిన వ్యక్తికి ఎంపీ సీటు కూడా ఇచ్చాడు… కానీ తను అంబానీ… జగన్ హాయంలో 50 వేల కోట్లు పెడుతాను అన్న పవర్ ప్లాంట్ల విలువ పెంచేసి, బాబు రాగానే 65 వేల కోట్లు అంటున్నాడు… తెలివైన వ్యాపారి కదా… పైగా అంబానీకి, ఈనాడుకూ, బాబుకూ నడుమ బలంగా అల్లుకున్న బంధాలు కదా మరి…)
సరే, కూలదోసే శక్తిమంతులు కాబట్టి ఐదు, ఆరో స్థానాల్లో నిలిచారు అనుకుందాం… మరి యోగి ఏడో స్థానం ఏమిటో… బాబు, నితిశ్‌ల్లాగా ప్రాంతీయ నేతే కదా… పైగా వీరికి కూలదోసే సత్తా ఉంది కనీసం, తనకు అదీ లేదు… జాతీయ రాజకీయాలను ప్రభావితం కూడా చేయలేడు…
నిజానికి భగవత్‌కు కూడా అంత శక్తి లేదు… రాహుల్ వోకే, ప్రతిపక్ష నేత… స్టాలిన్, మమత కూడా అంత బలమైన నేతలు కారు ఇప్పుడు… అంటే వాళ్లూ జస్ట్, ప్రాంతీయ శక్తులే… అఖిలేశ్‌కు ఆ సీన్ కూడా లేదు… మరి ఈ సర్వే రిజల్ట్స్ ఏమిటి, ఇలా ఉన్నాయి అంటారా..?
వాళ్ల సర్వే వాళ్ల ఇష్టం… మీకూ అవకాశం ఉంటే మీరూ ఒకటి ప్రచురించండి… టాప్ టెన్‌లో వరుసగా ట్రంప్, పుతిన్, కిమ్, జిన్‌పింగ్ పేర్లు రాసి… ఐదో స్థానంలో చంద్రబాబు పేరు రాయండి… అప్పుడు కూడా ప్రపంచంలోకెల్లా పవర్ ఫుల్ సీఎం చంద్రబాబు అని హెడింగ్ పెట్టి వార్త కూడా రాసుకొండి… తప్పు కాదు, అసత్య దోషమూ ఉండదు… ఎందుకంటే ఫస్ట్ నలుగురు సీఎంలు కారు కదా..!!
Share this Article