.
“గాడిద పాలు కొనుక్కుంటాం…అంతర్జాతీయంగా గాడిద పాలకు విపరీతమైన డిమాండు” అంటూ ఒక్కో గాడిదను లక్షన్నరకు పైగా అమ్మి… రెండు మూడు నెలలు అన్నట్లుగానే గాడిద పాలు కొని… తరువాత అదృశ్యమయ్యింది డాంకీ ప్యాలెస్ సంస్థ.
దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సంస్థ మోసానికి గురైనవారు వేలల్లో ఉన్నారు. ఇప్పటికి ఇది 110 కోట్ల కుంభకోణమని తేలింది. సాధారణంగా 15 వేల నుండి అత్యధికంగా 40 వేల వరకు ధర పలికే గాడిదలను స్థానిక మార్కెట్లోనే కొని… లక్షన్నర నుండి రెండు లక్షల వరకు అక్కడే అమ్మిన ఈ డాంకీ ప్యాలెస్ మార్కెటింగ్ మెలకువలో గాడిదలైనవారెవరో గాడిదలు చెప్పలేకపోవచ్చు కానీ… గాడిదలకు తెలుసు!
Ads
# మొత్తం డాంకీ స్కామ్ లో పెట్టుబడి ఎంత? లాభమెంత?
# ఇన్ని జంతువులుండగా వీరు గాడిదలనే ఎంచుకోవడానికి గల కారణాలేమిటి?
# సమాజంలో ఎవరినైనా గాడిదలను చేయవచ్చని వీరు అనతికాలంలోనే ఎలా పసిగట్టగలిగారు?
# ఇంట్లో, పెరట్లో కట్టిన డాంకీ ప్యాలెస్ అత్యుత్తమ గాడిదలను ఇప్పుడేమి చేయాలి?
# గాడిద పాలతో ఏయే పదార్థాలు చేసుకోవాలి?
# ఇంత ఇన్నోవేటివ్ ఐడియా చిన్న స్టార్టప్ అవుతుందా? భారీ పరిశ్రమ అవుతుందా?
# దీన్ని ఫిన్ టెక్ కంపెనీ అనాలా? లైవ్ స్టాక్ బిజినెస్ అనాలా?
1. Adaptations of successful strategies from industry.
2. Importing strategies from other industries.
3. Combining strategies from multiple different industries.
4. Strategies created from scratch.
- అని సకల ఇండస్ట్రీ బిజినెస్ స్ట్రాటజీలు ఈ నాలుగు కేటగిరీల్లోనే ఉంటాయని సంప్రదాయ ఎంబిఏ పాఠాల్లో చెబుతారు.
ఈ డాంకీ బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అనలిటిక్స్ ను చూసిన తరువాత ఇది ఏ స్ట్రాటజీ కిందికి వస్తుందో! లేక అయిదో స్ట్రాటజిగా కొత్తగా చేరిస్తే ఎలా ఉంటుందో! స్టాన్ఫోర్డ్ లు, హార్వర్డ్ లు, ఐఐఎంలు, ఐఎస్‌బిలు అర్జెంటుగా ఆలోచించకపోతే నష్టపోయేది ఆ కాలేజీలే… గాడిదలు కాదు!
గాడిదల్లా కళ్ళకు గంతలు కట్టుకుని నాలుగ్గోడల మధ్య క్లాసు రూముల్లో కూర్చుని ఏమి చదువుతారు?
కొంచెం ఇలా బయటికి వచ్చి కళ్ళు తెరిచి విశాల గార్దభ ప్రపంచంలో చదువుకోండి! అడ్డ గాడిదలు కూడా లెక్కలేనన్ని జీవనవ్యాపార విజయరహస్య పాఠాలు చెబుతాయి!
ఇట్స్ ఎ ఫుల్ ఆఫ్ ఫూల్స్ ప్యారడైజ్!
ఇట్స్ ఎ ప్రామిసింగ్ “డాంకీ ప్యారడైజ్” బిజినెస్!!
నేర్చుకుంటే ప్రతిదీ పాఠమే!
నేర్చుకోకుంటే ప్రతిదీ గుణపాఠమే!!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article