ఫాఫం హైపర్ ఆది… ఆ కామెంట్ చేయడానికి ఒకటికి పదిసార్లు బాధపడాలి మనం… ఎందుకంటే..? మంచి స్పాంటేనిటీ, పంచులు, ఎనర్జీ, టైమింగు ఉన్న కమెడియన్ తను… తెలుగు టీవీ ప్రోగ్రాములకు సంబంధించి కామెడీ టైమింగు అద్భుతంగా ఉన్న టాప్ ఫైవ్‌లో సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్, ఆటో రాంప్రసాద్, గెటప్ సీనులతోపాటు హైపర్ ఆది ఉంటాడు… అలాంటి వాడిని ఫాఫం అని జాలిపడుతున్నాం అంటే… రీజనింగు ఉండాలి కదా… ఉంది, ఉంటుంది… ఈటీవీ వాడు ఓ ప్రొమో నడిపిస్తున్నాడు… అందులో…
… చూశారుగా, హైపర్ ఆది స్కిట్… మెడల్లో ఎవరివో బోర్డులు తగిలించుకున్నారు… తను స్వయంగా నవదీప్ ఫోటో వేసుకున్నాడు… శేఖర్ మాస్టర్, సంగీత, సుధీర్, వర్షిణి, రష్మి కేరక్టర్లు అన్నమాట… ఆమధ్య ఈటీవీలో దీపావళికో దసరాకో అక్కా-ఎవరో అతగాడు అని ఓ స్పెషల్ వేశారు కదా… దానికి స్పూఫ్ అన్నమాట ఈ స్కిట్… అసలు ఆ ఒరిజినల్ ప్రోగ్రామే ఫ్లాప్… దానికి మళ్లీ స్పూఫులు… అవునూ, మంచి టాలెంట్ ఉన్న హైపర్ ఆది కూడా చివరకు… ఈ పిచ్చి స్కిట్లకు జోలికి దిగజారిపోయాడు ఎందుకు..?
ఎవడు లాగ్ చేస్తాడు, ఎవడు టీం లీడర్ అయ్యాడు, ఎవడు ఈమధ్య అరెస్టయ్యాడు, ఎవడు ఎవరిని ఏడిపించాడు, ఎవడికి డైలాగ్ పలకడం రాదు, ఎవడికి పేమెంట్ ప్రాబ్లమ్స్, ఎవడు టీంలీడర్కు వెన్నుపోటు పొడిచాడు……. ఇవేనా ఒక కామెడీ స్కిట్ అంశాలు..? మంచి కంటెంటుతో డిఫరెంటు స్కిట్ ఆలోచించి, సక్సెస్‌ఫుల్‌గా చేయగల సత్తా ఉన్న ఆది కూడా ఎందుకిలా మారిపోయాడు..?
Ads
నేను ఆ ప్రోగ్రామ్‌లో లేనందుకు హేపీగా ఉన్నా, లేకపోతే ఎవడో ఒకడు వస్తాడు, ఫోటో వేలాడేసుకుంటాడు అని రోజా చిరాకు పడ్డది… (ఆరోజున పాత సినిమానటి సంగీత సెంట్రిక్‌గా ప్రోగ్రామ్ నడించింది లెండి… అదో వైపరీత్యం)… కానీ ఇలాంటివి అలవాటు చేసింది ఎవరు..? ఎంకరేజ్ చేసింది ఎవరు..? రోజా పాత్ర లేదా అందులో..? ఇప్పుడు ఈ నేలబారు కామెడీ స్కిట్ చూసి చిరాకు పడటం దేనికి..? పంచ్ డైలాగులు ముందే చెప్పడం, కమెడియన్లను వెక్కిరించడం… ఇదా కామెడీ షో అంటే..? పైగా ఏదైనా స్పెషల్ ప్రోగ్రాం చేయాల్సి వస్తే చాలు ఆ శేఖర్ మాస్టర్‌తో డాన్సులు… ఈ హోదాలో, ఈ వయస్సులో అవి అవసరమా రోజక్కా…
చమ్మక్ చంద్ర తదితరులు నాగబాబు షోకి వెళ్లిపోయాక, జబర్దస్త్‌లోకి ఈమధ్య నాసిరకం సరుకును తెచ్చి నింపారు… కొన్ని స్కిట్లయితే నవ్వు తెప్పించకపోగా… తల్నొప్పి తెప్పిస్తున్నాయి… అసలే అది బూతులు షో అని ప్రసిద్ధి… దీనికి కాపీ ‘బొమ్మ అదిరింది’… అదే దిక్కుమాలిన షోగా మారిపోయిందీ అనుకుంటే ఇప్పుడిక జబర్దస్త్‌ను కూడా ఇలా దెబ్బతీస్తున్నారు… మంచి ఫైర్, కామెడీ ఉండే చమ్మక్ చంద్ర అక్కడ జీతెలుగులో వెలవెలపోతున్నాడు… సుడిగాలి సుధీర్, హైపర్ ఆది వంటి వాళ్లు ఇక్కడ తెల్లమొహాలు వేస్తూ… ఇదుగో ఈ మెడలో ఫోటోల కామెడీ చేసుకుంటూ, ఏదో కథ నడిపించేస్తున్నారు… అందుకే అనాల్సి వచ్చింది… ఫాఫం హైపర్ ఆది… నువ్వు కూడా… ఆ పాత పంచులేవీ..? ఆ కామెడీ మెరుపులేవీ..? ఆ ఫన్ తళుకులేవీ..? ఏమైంది ఆదీ..? పోనీ, స్టార్ మాటీవీలో ఇలాంటిదే ఓ షో ప్లాన్ చేద్దాం, ఆ సుధీర్‌ను కూడా తీసుకుని వస్తావేటి..?!
Share this Article