.
బ్రిక్స్ పేమెంట్ – ట్రంప్ ముందున్న ఛాలెంజ్! Part 4
బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ విజయవంతం అవ్వాలి అంటే భారత్ సహకారం అవసరం ఉంటుంది!
Ads
కానీ……
ముగ్గురు వ్యక్తుల నిర్ణయం మీద ఆధారపడి ఉంది!
ప్రధాని మోడీ, EAM జై శంకర్ , NSA అజిత్ ధోవల్ …
బ్రిక్స్ పేమెంట్ విషయంలో అజిత్ ధోవల్, జై శంకర్ లకు పలు అనుమానాలు ఉన్నాయి!
వీళ్ళద్దరి అభిప్రాయం ఏమిటో తెలుసుకుని మోడీ ఆమోదం తెలుపుతారు.
ఈ ముగ్గురూ కాకుండా RBI గవర్నర్ శక్తి కాంత్ దాస్ కూడా తన అభిప్రాయం ఏమిటో చెప్పేసారు.
BRICS PAY సానుకూలతలు.
EAM జై శంకర్ అభిప్రాయం
1.అసలు బ్రిక్స్ కరెన్సీ అవసరం లేదు. అందరికంటే ముందు మనదేశం డిజిటల్ పేమెంట్ అంటే UPI ని ప్రవేశపెట్టి విజయవంతంగా నిర్వహిస్తున్నాము.
2. బ్రిక్స్ పేమెంట్ చాలు. బ్రిక్స్ ఫిజికల్ కరెన్సీ వల్ల ఎక్కువ లాభపడేది చైనా మాత్రమే. ఇప్పటికే NDB, WORLD BANK, ADB ( Asia Development Bank ) లలో చైనా ఆధిపత్యమే ఎక్కువ.
3.బ్రిక్స్ పేమెంట్ వల్ల బ్రిక్స్ దేశాలలోకెల్లా ఎక్కువ లాభపడేది భారత్ మాత్రమే. నాటో, అమెరికా, ఆఫ్రికన్ దేశాలతో పాటు నాన్ బ్రిక్స్ దేశాలతో భారత్ కి ఎలాంటి శత్రుత్వం లేదు. ఈ విషయంలో ఎక్కువ లాభపడేది మనమే.
5.బ్రిక్స్ పేమెంట్ విషయంలో RBI కూడా సానుకూలంగా ఉంది. ముఖ్యంగా రష్యా నుండి క్రూడ్, ఇతర మినరల్స్ కొనే విషయంలో బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ బాగా ఉపయోగపడుతుంది.
6.ఈజిప్ట్, సౌదీ అరేబియాలతో బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ వల్ల లాభాలు తప్పితే నష్టం ఏమీ ఉండదు. ముఖ్యంగా సౌదీ నుండి కొనుగోలు చేసే క్రూడ్ కి డాలర్లతో పని ఉండదు.
7.ఇక చైనా దగ్గర యువాన్లు కొనే పరిస్థితి ఉండబోదు. యువాన్లు కొనడం మొదలు పెడితే దానికి డిమాండ్ పెరిగి చైనా మరింత బలపడే అవకాశం ఉంది.
8.ఇరాన్ దగ్గర క్రూడ్ కొని చైనా యువాన్ లతో చెల్లింపులు చేసే పని తప్పుతుంది.
9.ఇరాన్ లోని ఛాబహార్ పోర్టు కోసం భారత్ ఇప్పటికే 120 మిలియన్ల డాలర్లు ఖర్చుపెట్టింది. మరో 250 మిలియన్ డాలర్లు ఆఫ్ఘానిస్తాన్ తో పాటు మధ్య ఆసియా, యురేసియా దేశాలతో కలుపుతూ రోడ్ మార్గం వేయడానికి క్రెడిట్ రూపంలో చెల్లింపులు చేయాలని ప్లాన్. ఇది పూర్తయితే భారత్ మరో $200 బిలియన్ విలువ చేసే వ్యాపారం చేయగలుతుంది కాబట్టి బ్రిక్స్ పేమెంట్ అందరికంటే మనకే లాభం. డాలర్లతో పని ఉండదు.
10. బ్రిక్స్ సభ్య దేశాలలో కూడా ఒకరంటే ఒకరికి పడని దేశాలు ఉన్నాయి. ఇరాన్ కి ఈజిప్ట్, UAE లంటే పడదు. కానీ సమస్యని పరిష్కరించే అవకాశం ఉందని జై శంకర్ అన్నారు. బహుశా జై శంకర్ ఈ పని చేసే అవకాశం ఉంది.
11.ఈజిప్ట్ కి ఇథియోపియాకి పడదు. జైశంకర్ ఈ సమస్యని పరిష్కరించవచ్చు.
12.వియత్నాం బ్రిక్స్ లో చేర్చుకోవడం అనేది మంచి పనే. పూర్తిగా అమెరికా వైపు ఉండే వియత్నాం బ్రిక్స్ లో చేరడం మీద ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ వియత్నాంకి చైనాకి మనలాగే సరిహద్దు సమస్యలు ఉన్నాయి.
*******
అననుకూలతలు.
బ్రిక్స్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లే ముందే EAM జై శంకర్ , NSA అజిత్ దోవల్ , RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ పైన పేర్కొన్న నివేదిక ఇచ్చారు కానీ ఒకే ఒక్క అంశం మీద అభ్యంతరం చెప్పారు అది…..
13. బ్రిక్స్ పేమెంట్ విషయంలో జరిగే లావాదేవీలు అన్ని కూడా చైనాలో ఉన్న షాన్ఘయ్ నగరంలో ఉన్న న్యూ డెవలప్మెంట్ బాంక్ సర్వర్లలో స్టోర్ అవుతాయి. ఇది చైనా డేటా చౌర్యానికి పాల్పడడానికి అవకాశం ఉంటుంది. NDB హెడ్ క్వార్టర్ చైనాలో ఉండడం ప్రమాదకరం!
అఫ్కోర్స్! ఒక దేశానికి మరో దేశానికి మధ్యలో జరిగే లావాదేవీలు బ్లాక్ చైన్ టెక్నాలజీని ఆధారం చేసుకుని జరుగుతాయి. ఇది సురక్షితమే! కానీ చైనాకి ఏదైనా సాధ్యమే! మరో అప్డేట్ తో మళ్ళీ వస్తాను…….. (పొట్లూరి పార్థసారథి)
Share this Article