.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కొన్ని నిర్ణయాలను ప్రకటించింది… కొన్ని సరైనవే, మరికొన్ని చేస్తారోలేదో చూడాల్సినవి, ఇంకొన్ని అనవసరం.
శ్రీవాణి ట్రస్టును రద్దు చేశారు… పదివేల టికెట్ల సొమ్మును ఇకపై నేరుగా టీటీడీ అకౌంట్‌కే జమయ్యేలా చర్యలు తీసుకుంటారు… ట్రస్టుకు విరాళాలు ఎంతయినా తీసుకోవచ్చు… కానీ దర్శనం కోసం మరీ 10 వేల ధర పెట్టి, ఆ సొమ్మును ఓ ట్రస్టుకు మళ్లించడం మీద విమర్శలున్నాయి… ఈ నిర్ణయం వోకే…
Ads
టీటీడీలో పనిచేసే అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చేయాలని నిర్ణయించింది… వోకే, ఎన్నాళ్లుగానో ఈ ఆరోపణ ఉన్నదే… అసలు ఈ నియామకాలకు బాధ్యులను గుర్తించి, ప్రజలకు తెలియచెప్పే నిర్ణయం తీసుకుంటే బాగుండేది… ఐతే ఈ నిర్ణయం ప్రకటించాల్సింది పాలకమండలి కాదు… ప్రభుత్వం… చంద్రబాబు దీనిపై ఏమేరకు కట్టుబడి ఉంటాడో వేచి చూడాలి…
కొండపై ఎవరూ రాజకీయాలు మాట్లాడకూడదనేది మరో నిర్ణయం… గుడ్… కానీ అసలు మీడియా కెమెరాలను ఎందుకు అనుమతించాలి అక్కడ..? భక్తజనానికి ఏం చెప్పాలన్నా టీటీడీయే ఫీడ్ మీడియా సంస్థలకు పంపిస్తే సరి… ఎస్వీబీసీ చానెల్ కూడా రద్దు చేస్తే ఓ పనైపోయేది… అనవసరంగా భక్తుల సొమ్మును వృథా చేయడం తప్ప ఆ చానెల్ ఎవరూ చూడరు, క్వాలిటీ ఉండదు…
పర్యాటక శాఖకు ఇచ్చే 4 వేల టికెట్లను రద్దు చేస్తారట… తప్పుడు నిర్ణయం ఇది… ఎక్కడెక్కడి నుంచో దూరప్రాంతాల నుంచి ఏ వీఐపీ సిఫారసులు, ఇతరత్రా ఏ టికెట్ కొనుగోళ్లు లేకుండా నేరుగా దర్శనం చేయించేది పర్యాటక శాఖ… అది రాష్ట్రంలో పర్యాటక ఆదాయానికి కూడా ఆధారం… దాన్ని రద్దు చేయడం కరెక్టు కాదు…
3, 4 గంటల్లో ధర్మదర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటామనేది మరో నిర్ణయం… దాదాపు అసాధ్యం… చాలామంది దర్శనానికి పట్టే కాలాన్ని తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేశారు… కానీ సక్సెస్ కాలేదు… కంపార్ట్‌మెంట్లలో గంటల తరబడీ ఉండాల్సి వస్తోంది… ఐతే సంకల్పం మాత్రం ఆహ్వానించదగిందే…
తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను మూడు నెలల్లో క్లియర్ చేయాలని టీటీడీ నిర్ణయించింది… గుడ్… స్వచ్ఛ తిరుమలను ఓ ఉద్యమంలాగా, భగవత్ కార్యంగా నిర్వహిస్తే తప్ప ఇలాంటివి పూర్తిగా అమల్లోకి రావు… చేయాలనే ఆశిద్దాం…
శ్రీనివాససేతు పేరుని గరుడ వారధిగా మార్పు చేస్తారట… కారణం ఎందుకో తెలియదు… శ్రీనివాసుడి సొమ్మే కదా… అలిపిరిలో దేవలోక్‌కు కేటాయించిన 20 ఎకరాల భూమిని టీటీడీకి అప్పగించే విధంగా ప్రభుత్వానికి లేఖ రాస్తారు… ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు… మంచిదే…
స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించేలా నిర్ణయం కూడా మంచిదే… స్వామి వారికి చెందిన నగదును ప్రైవేట్ బ్యాంకు డిపాజిట్ల నుంచి ప్రభుత్వ బ్యాంకుల్లో జమ చేస్తారు… గుడ్, అలాగే భక్తుల సొమ్మును దైవకార్యాలకు తప్ప ఇంక దేనికీ వినియోగించకుండా నిర్ణయం తీసుకుంటే బాగుండేది…
అన్నదానంలో నూతనంగా మరో ఐటమ్‌ని భక్తులకు వడ్డించాలని నిర్ణయం… స్వాగతించాల్సిన నిర్ణయం… దర్శనం కోసం వచ్చే భక్తులను ముష్టివాళ్లలా గాకుండా అతిథుల్లా గౌరవం చూపించడం టీటీడీ కర్తవ్యం… అన్నింటికీ మించి శారదా పీఠానికి ఇచ్చిన భూమి రద్దు… బిల్డింగ్ స్వాధీన నిర్ణయం… అభినందనీయం… కొండపై ఉన్న ప్రతి గెస్ట్ హౌజ్ మీద టీటీడీకే పూర్తి హక్కులు ఉండేలా నిర్ణయం తీసుకోవాల్సింది…
ప్రత్యేకంగా స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలుకు ఓ కమిటీ వేస్తారట… అవసరం లేదు, ఇప్పుడున్న విధానాల్నే కట్టుదిట్టం చేసి, కల్తీ పరీక్షలకు అర్జెంటుగా అత్యాధునిక పరీక్షాకేంద్రం నిర్మాణం అవసరం… నెయ్యికే కాదు, ప్రసాదాల తయారీకి కొనుగోలు చేసే ప్రతి దినుసునూ పరీక్షించాలి… లడ్డూ ప్రాభవం, నాణ్యత పెరిగేలా దిట్టం మీద ఎప్పటికప్పుడు పరిశీలన ఎంత అవసరమో… ఎక్కడబడితేఅక్కడ లడ్డూ దొరక్కుండా చేయడం అత్యవసరం..!!
Share this Article