.
నిజంగానే ఓ మిస్టరీ… రేవంత్ ప్రభుత్వానికి సరైన ఆలోచనలు తట్టడం లేదా..? సరైన న్యాయసలహాలు దొరకడం లేదా..? లేక తనే ఉద్దేశపూర్వకంగా కొంత లిబరల్ ధోరణితో వెళ్తున్నాడా..? తెలియదు…
ఫార్ములా- ఈ రేసుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఆధారాలు సేకరించింది… కేటీయార్ తన చర్యలో తప్పు లేదు, జీహెచ్ఎంసీ నిర్ణయం చాలు అంటున్నాడు… నిధులైతే విడుదలయ్యాయి, ఖర్చయిపోయాయి… నడి నగరంలో ఆ రేస్ ట్రాఫిక్‌కు బోలెడు అంతరాయాలు, ఇక్కట్లు ఎట్సెట్రా… ఏదో బ్రహ్మపదార్థంలాగా ఏదో 700 కోట్ల ఫాయిదా వచ్చింది అంటాడు కేటీయార్…
Ads
కానీ తనకూ తెలుసు… ఇటు లగచర్ల లేదా అటు ఫార్ములా నిధుల మీద ప్రభుత్వం తనను అడ్డంగా బుక్ చేయబోతోందని…! ఐనాసరే ఏం పీక్కుంటావో పీక్కో అని రేవంత్‌ను సవాల్ చేశాడు… రేవంత్ అదేదో యాంటీ కరప్షన్ చట్టానికి సంబంధించి 17 ఏ, బీ సెక్షన్ల ప్రకారం… గవర్నర్ అనుమతి కావాలీ అంటాడు…
ఎందుకంటే..? కేటీయార్ ఒక మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వపరంగా తీసుకున్న నిర్ణయం కాబట్టి…! గవర్నర్‌కు ఫైల్ వెళ్లింది… తను ఎటూ తేల్చడం లేదు… గవర్నర్ అటార్జీ జనరల్ అభిప్రాయం అడిగాడని ఒక వాదన… కాదు, కేటీయార్ తను అరెస్టు గాకుండా ఢిల్లీ వెళ్లి బీజేపీ వాళ్లను ప్రాధేయపడ్డాడు, వాళ్లు చెప్పడంతోనే గవర్నర్ ఆగిపోయాడు, గవర్నర్ కూడా ఢిల్లీ వెళ్లిన కారణం ఇదే అని కాంగ్రెస్ సందేహం…
లోలోపల బీఆర్ఎస్, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయనేది రేవంత్ డౌటనుమానం… కానీ సదరు 17 ఏ, బీ సెక్షన్లున్నా సరే, ఒకవేళ ఏదైనా కోర్టు గనుక విచారణ, దర్యాప్తులకు ఆదేశిస్తే ఆ సెక్షన్, గవర్నర్ ఆమోదం అక్కర్లేదుట… ఆవైపు రేవంత్ సర్కారు ఆలోచించలేదు… లగచర్ల ఇష్యూ మీద కూడా వేచిచూసే ధోరణిలో ఉంది… అసలే డిఫెన్సులో ఉన్నాం, కేటీయార్ జోలికి వెళ్తే ఇష్యూ ఇంకా ఫ్లేరప్ అవుతుందని అనుకుంటున్నదేమో ప్రభుత్వం…
ఏమో, కేటీయార్ మీద సానుభూతి వస్తుందనే భయమో… ఇక కేసీయారే రంగంలోకి దిగుతాడనే భావనో… తెలియదు, ఐనా కాంగ్రెసే పదే పదే డిమాండ్ చేస్తోంది కదా కేసీయార్ బరిలోకి రావాలని..! కర్నాటకలో లోకాయుక్త ఉంది… ఏకంగా ముఖ్యమంత్రినే బోనెక్కించింది… మనకు అదేమీ లేదు…
ఈలోపు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఏమంటాడు అంటే..? అసలు గవర్నర్ అనుమతి దేనికి..? తను సీఎం కాదు, మంత్రి కాదు, జస్ట్, ఒక ఎమ్మెల్యే మాత్రమే… వెంటనే అరెస్టు చేయాల్సిందేనట… లగచర్ల అల్లర్లు కూడా కేటీయార్ ప్రేరేపించినవే అంటున్నాడు… మరి అదే నిజమైతే గవర్నర్ ఎందుకు ఆ ఫైల్ తన దగ్గరే అట్టిపెట్టుకున్నట్టు అర్వింద్ భయ్…?
ఇక్కడ మీరేమో గవర్నర్ అనుమతి అక్కర్లేదు అంటారు… ఢిల్లీయేమో గ్రీన్‌సిగ్నల్ ఇవ్వదు… అవునూ… ఒకవేళ బీజేపీ ప్రభుత్వం కూలిపోయి ఒక రాష్ట్రంలో వేరే ప్రభుత్వం వచ్చిందీ అనుకుందాం… ఆ కొత్త ప్రభుత్వం పాత బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలను తవ్వడానికి నిర్ణయించినా… గవర్నర్ అంగీకరించడు… ఎందుకంటే, ఢిల్లీ అనుమతించదు.,. మరెలా..?! ఈ సెక్షన్‌కు అర్థముందా అసలు..?!
Share this Article