.
ఒక ఆసక్తికర సన్నివేశం బిగ్‌బాస్ హౌజులో కనిపించింది… ఆ సీన్‌లో టేస్టీ తేజ ఎడ్డిమొహం వేయాల్సి వచ్చింది… కన్నడ బ్యాచ్ ఇన్నివారాలుగా ఎందుకు ఆటలో నిలదొక్కుకుని సత్తా చూపిస్తున్నదో ఇది మరోసారి నిరూపించింది…
వాళ్లు ఒకరికొకరు సహకరించుకుంటారు… దాన్ని తట్టుకోవడం మిగతా కంటెస్టెంట్లకు కష్టమవుతోంది… నిన్నో మొన్నో… టేస్టీ తేజ నిద్దురపోతున్నాడు… నిజానికి పోవద్దు… కుక్క అరుపులు మోగాయి… అవినాష్, ప్రేరణ పట్టేసుకున్నారు…
Ads
అబ్బే, నేను బిగ్‌బాస్‌కు చెప్పి ప్రాంక్ చేస్తున్నాను అని ఏదో కవర్ చేయబోయాడు తేజ… ఈలోపు చర్చ టర్న్ తీసుకుంది… తేజ గనుక బట్టలిప్పి పదిసార్లు స్విమ్మింగ్ పూల్‌లో దూకుతూ పైకి వస్తూ మునగాలి… అలా చేస్తే యష్మి తనకు ముద్దు ఇవ్వాలి…
గత సీజన్ శోభాశెట్టి అనుకున్నాడేమో… అఫ్‌కోర్స్, ఆమె కూడా ఆడుకుంది తేజతో… యష్మి పరమ నొటోరియస్ కదా… ఐనా వోకే అంది… తేజ అలాగే చేశాడు… కళ్లు మూసుకో అన్నదామె… వెనక నుంచి తేజను కౌగలించుకుని నిలబడి ఉన్న నిఖిల్ తేజ బుగ్గ మీద ముద్దు పెట్టాడు… తను కళ్లు తెరిచేసరికి ఎదురుగా యష్మి మొహం…
దాంతో యష్మియే ముద్దు పెట్టింది అనుకుని… గ్రౌండ్ అంతా గెంతులేస్తూ, అందరితో చేతులు కలుపుతూ… నా పొలంలో మొలకలొచ్చాయ్ అని కేకలకు దిగాడు… నీయంకమ్మా, మీసపు మొలకలతో ముద్దు పెట్టుకున్నా తెలియదు నీకు అని రోహిణి వెక్కిరించింది… అందరూ నవ్వేశారు… తేజ ఎడ్డిమొహం వేశాడు…
నిజానికి యష్మి, నిఖిల్ నడుమ తీవ్రంగా దూరం పెరిగినట్టు ఓ సీన్ నడుస్తోంది హౌజులో… ఐనాసరే, ఇలాంటి సందర్భాల్లో వాళ్లకు సేమ్ ఫ్రీక్వెన్సీతో కదులుతారు… ఒకరికొకరు అలా సహకరించుకుంటారు… ఎదుటివాళ్లను పిచ్చోళ్లను చేస్తారు…
బిగ్‌బాస్ ఏమనుకున్నాడో ఏమో గానీ కన్నడ బ్యాచ్‌ను బ్రేక్ చేయాలని అనుకున్నాడో… లేక యష్మికి, నిఖిల్‌కూ నడుమ పొగబెట్టి… రేటింగ్స్ ఆలోచన చేశాడో తెలియదు… అదీ ఈసారి మెంటల్ కేసే కదా… ఆల్రెడీ ఎవిక్టయిపోయిన బ్యాచ్‌ను తీసుకొచ్చి కన్నడ బ్యాచ్‌ను టార్గెట్ చేయించాడు… పక్కా స్క్రిప్టెడ్…
నా పెద్ద కొడుకు అని వయ్యారాలు పోయే సోనియా సహా దాదాపు అందరూ నిఖిల్‌ను పొగుడుతూనే నామినేట్ చేశారు… అదో చిత్రం… బిగ్‌బాస్ చివరకు క్రాక్, సారీ కిరాక్ సీతతో యష్మికి నిఖిల్‌కు మధ్య మంటపెట్టే ఓ ఆరోపణ చేయించాడు…
యష్మీ, నువ్వు నిఖిల్ ట్రాపులో పడకు, నిన్ను వాడుకుంటున్నాడు తన ఆటకు అని చెప్పించాడు… ఆమె ఓతరహా పిచ్చిది కదా… అవును, నిజమే అని తలూపింది కానీ ఖండించలేదు… తను నిఖిల్‌కు ఉపయోగపడుతుంది అని సీత చెప్పినా సరే ఆమె బుర్రకెక్కలేదు… అదే అడిగాడు నిఖిల్… ఈమె దగ్గర జవాబు లేదు…
నిఖిల్ ఓ దశలో అందరూ టార్గెట్ చేస్తుండేసరికి ఒక్కసారిగా డౌన్ అయిపోయాడు… ఇక చాలు, నాకు వోట్లేయకండి అని అప్పీల్ చేసుకున్నాడు… యాక్టివ్‌గా ఉండేవాడు డీలాపడి, బెడ్ దిగకుండా శూన్యంలోకి చూస్తున్నాడు… యష్మిని ట్రాప్ చేసి, వాడుకుంటున్నాడు అనే ఆరోపణ తనను డిస్టర్బ్ చేసింది…
నబీల్ వచ్చి, ఎవరో ఏదో ఆరోపించగానే జనం నమ్ముతారా..? నీ ఆట నువ్వు ఆడాలి గానీ ఇలా ముడుచుకుని బాధపడుతూ కూర్చుంటే ఎలా అని హితవు చెప్పాక నిఖిల్ తేరుకుని… సారీ, నాకు వోట్లేసి మద్దతివ్వండి అని మళ్లీ అప్పీల్ చేసుకున్నాడు… మళ్లీ యాక్టివ్ అయిపోయాడు… ప్చ్, బిగ్‌బాస్ నిజంగా నిఖిల్ మీద ఈ సింపతీ పెంచాలనుకున్నాడా..? ఏమో… ఈసారి బిగ్‌బాస్ సీజన్ సెట్ ఎర్రగడ్డలో వేసినట్టే ఉంది..!!
Share this Article