.
మానస వారణాసి..! మనమ్మాయే… మన హైదరాబాదీ… ఇక్కడే చదువుకుంది… అనేక అందాల పోటీల్లో తెలంగాణను రిప్రజెంట్ చేసింది… అందగత్తె… తన తొలి సినిమా పేరు దేవకీ నందన వాసుదేవ…
అటు మీనాక్షి చౌదరి, ఇటు మానస వారణాసి… అందాల పోటీల్లో వెలిగిన ఇద్దరూ ఇప్పుడు తెలుగు తెర అట్రాక్షన్స్… ఎటొచ్చీ మానసకు ఈ సినిమాలో మంచి పాత్రే దక్కింది గానీ, సినిమా ప్రజెంటేషన్ బాగాలేక ఫస్ట్ చాన్సే ఫాఫం నిరాశ తప్పలేదు…
Ads
ఇప్పుడు ట్రెండ్ ఏమిటి..? ఏదైనా పురాణ కథ స్పూర్తితో ఓ సినిమా కథ రాసుకోవాలి… దాన్ని ప్రేక్షకుడికి కొత్తగా ప్రజెంట్ చేయాలి… నీతులు చెబుతామా..? ప్రవచనాలు చెబుతామా..? గ్రాఫిక్స్‌తో ధూంధాం చేస్తామా..? ఇదే సినిమా విజయాన్ని నిర్దేశించేది…
హనుమాన్, కల్కి, కార్తికేయ వంటి సినిమాలన్నీ ఇవే కదా… అన్నట్టు ఈ సినిమాకు కథ అందించింది కూడా సదరు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మే… హీరో మన మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్… సినిమా అంటే ప్యాషన్ తనకు…
అపారమైన ధనం, సాధనసంపత్తి, రాజకీయ నేపథ్యం, వ్యాపార కుటుంబం… అవన్నీ వదిలి ఈ ఫేమ్ కోసం తన తాపత్రయం… తప్పులేదు, కానీ తనకు ఈ రంగం సూట్ కాదేమో అనిపిస్తుంది… ఈ సినిమా చూశాక కూడా అదే అనిపిస్తుంది…
ఏదో కష్టపడటం లేదని కాదు… సరిపోవడం లేదు..! మహేశ్ బాబు మేనల్లుడు అని పదే పదే చెప్పుకోలేం కదా, గల్లా అశోక్ అని చెప్పుకునేలా కెరీర్ ఉండాలి… ఫస్ట్ సినిమా హీరో ఏదో మమ అనిపించింది… ఇదైనా బలంగా ఉండేలా చూసుకోవాలి… లేదు… కుదరలేదు…
కథ వరకూ వోకే… ఓ కంసుడు (పాత్ర పేరు కూడా కంసరాజు) ఓ అఘోరా చెప్పాడని బావను ఖతం చేస్తాడు… చెల్లెకు (దేవయాని) పుట్టబోయే సంతానంతో ప్రాణగండం… హీరో పాత్ర పేరు కూడా కృష్ణ… అదే గల్లా అశోక్ చేసిన పాత్ర… ఆ కంసదేవకిల కథను పోలే కథను ఇప్పటి ట్రెండ్‌కు తగినట్టు రాసి ఇచ్చాడు హనుమాన్ దర్శకుడు…
దాన్ని అంతే వైవిధ్యభరితంగా ప్రజెంట్ చేయడంలో తడపాట్లున్నయ్… అసలు కథలోనే చిన్న ప్రేమ కథ… నాలుగు యాక్షన్ సీన్లు… ప్చ్, ఫలానా సీన్ భలే వచ్చిందే అని ఎక్కడా అనిపించదు… వెరసి మంచి స్టోరీ లైన్ తీసుకోబడినా సరే, చివరకు ఓ సాదాసీదా చిత్రం తయారైంది… గల్లా అశోక్ గల్లా ఎగరేసి ఇదీ నా సినిమా అని చెప్పుకోగల మరో సినిమా కోసం ట్రై చేయాల్సిందే… లేదంటే జై అమరరాజా బ్యాటరీస్… జైజై పాలిటిక్స్…!!
Share this Article