.
అంతేగా అంతేగా అంటూ ఎఫ్2 సినిమాలో భార్యావీర విధేయుడిగా కనిపించిన ప్రదీప్ గుర్తున్నాడు కదా… ఎయిటీస్‌లో టీవీ సీరియళ్ల నిర్మాత తను… చేసిన సినిమాలు తక్కువే గానీ గుర్తుండిపోయాడు ముద్దమందారం వంటి సినిమాలతో…
టీవీ నటుడు, నిర్మాత, మోటివేషనల్ వీడియోస్… ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాడూ అంటే… ఓ వీడియో కనిపించింది తన ఇంటర్వ్యేూ… అందులో సీనియర్ యాంకర్, హోస్ట్ సుమ గురించిన ప్రస్తావన ఉంది… ఆమె కెరీర్ ఆరంభ దినాల గురించిన ప్రస్తావన ఉంది…
Ads
‘‘అప్పట్లో పెళ్లిచూపులు సీరియల్ చేస్తున్నాం… ఓరోజు పొద్దునే అమ్మ చెప్పింది, ఎవరో నీకోసం ముందు గదిలో ఎదురుచూస్తున్నారు… ఆఫీసు మాది ఇంట్లోనే ఉండేది నారాయణగూడలో… డాన్స్ అదీ నేర్చుకుందట, తండ్రి కుట్టి రైల్వే ఎంప్లాయి అని మా కోడైరెక్టర్ ఉమామహేశ్వరరావు చెప్పాడు, తనే తీసుకొచ్చాడు… చూస్తే పదిహేను పదహారేళ్ల అమ్మాయి… టెన్త్ అయిపోయినట్టుంది అప్పుడే… సరేనని ఓ చిన్న పాత్ర ఇచ్చాను…
బాగా చేసింది… తరువాత అదే సీరియల్‌లో సెకండ్ హీరోయిన్ పాత్ర ఇచ్చాం… తరువాత అన్నీ మంచి శకునములే సీరియల్‌లో హీరోయిన్ పాత్ర… అక్కడి నుంచి అలా అలా ఎదిగిపోయింది… యండమూరి ప్రార్థన, నాగేశ్వరరావుతో మట్టిమనిషి, మల్లాది మందానికి కూడా నేనే తీశాను… అన్నింట్లో చేసింది ఆమె… అప్పట్లో సన్నగా, పెద్ద కళ్లతో ఉండేది…
అమలాపురంలో జెమిని టీవీ కోసం మందాకిని సీరియల్ చేస్తున్నప్పుడు ఆ పాత్ర ఆమే కావాలని అడిగాను… ఔట్ డోర్ షూటింగ్… ఆమె కొడుకు రోషన్ అప్పట్లో మూడు నెలల బేబీ… ఆమె కాస్త సందేహించింది… కానీ నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని హామీ ఇచ్చాను… ప్రత్యేకంగా ఓ కారు పెట్టి, జాగ్రత్తగా చూసుకున్నాం… షాట్ షాట్‌కూ నడుమ పిల్లాడికి ఫీడ్ చేసి వచ్చేది… వర్క్ పట్ల డెడికేషన్ ఉండేది బాగా… త్వరగా నేర్చుకునేది…
ఝాన్సీ, సునీత, సనా, ఉదయభాను, అనితా చౌదరి వీళ్లంతా సేమ్ ఏజ్ గ్రూప్… నాకన్నా చిన్నవాళ్లు వాళ్లందరూ… పిల్లల కోసం ఎక్కువ టైమ్ కేటాయించవచ్చునని యాంకరింగ్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసింది… ఫస్ట్ నుంచీ మేం స్టేజీ మీద ఎలా చేశామో చూసేది కదా… ఫన్ తెలుసు… నేర్చేసుకుంది వేగంగా… (ఆమె మెట్టిన కనకాల కుటుంబం కూడా ఆమె సినిమాల్లో కొనసాగడాన్ని ఎంకరేజ్ చేయలేదు)…
(nox tv courtesy)
Share this Article