.
నాకు గుర్తున్నంతవరకు ఈసారి సీజన్‌లో హౌజులోకి తొలి ఎంట్రీ ఆమే అనుకుంటా… యష్మి గౌడ..!
కన్నడ బ్యాచ్‌లో పార్ట్… కన్నడిగ… తెలుగు సీరియల్స్ నటి… ప్రతిసారీ నామినేట్ అయ్యేది… ప్రతిసారీ సేవ్ అయ్యేది… ఇన్నిరోజులూ సేవ్ చేసిన ప్రేక్షకులు చివరకు ఇప్పుడు బయటికి పంపించేశారు…
Ads
మొదటి నుంచీ ఆమె మీద నెగెటివిటీని స్ప్రెడ్ చేశారు ఆమె మీద… హౌజ్ మేట్స్, మీడియా కూడా… ప్రేరణ, నిఖిల్, పృథ్వి, యష్మిల మీద కన్నడ బ్యాచ్ ముద్ర వేసి… గ్రూప్ గేమ్ పేరిట అందరి మీదా ముద్రలు వేసినా సరే… ఎప్పుడూ ఫ్లిప్పవుతూ యష్మి మిగతా వాళ్లకన్నా ఎక్కువ నెగెటివిటీని మూటగట్టుకుంది…
కానీ… ఏమాటకామాట… గత సీజన్‌లో కూడా మరో తెలుగు సీరియల్ నటి శోభాశెట్టి మీద కూడా ఇలాగే బాగా నెగెటివిటీ స్ప్రెడ్ అయ్యింది… కానీ అలాంటివాళ్లే బిగ్‌బాస్ షో మీద కాస్తో కూస్తో ఆసక్తిని క్రియేట్ చేయగలరు… వీళ్లు సేఫ్ గేమ్ ప్లే చేయరు… వివాదాలొచ్చినా సరే తమ ఆటను తమ స్ట్రాటజీలతో ప్లే చేస్తారు…
ఇప్పుడు యష్మి లేకపోతే ఇక వివాదాలెలా..? షో ఇంకాస్త నీరసపడిపోతుంది గ్యారంటీగా… ఆమెలో ఫైర్ ఉంది… వివాదాలొచ్చినా సరే నిలబడి ఫైట్ చేయగలదు… నిఖిల్‌తో యవ్వారానికి ట్రై చేసిందనే ఓ విమర్శ ఉంది… బట్, అదంతా బిగ్‌బాస్ ఆడించే ఆట… ఆమె తన పాత్ర పోషించింది అంతే…
చివరకు బిగ్‌బాస్ టీమ్ కావాలనే ఎవిక్టెడ్ వాళ్లను మళ్లీ పిలిచి మొత్తం కన్నడ బ్యాచ్‌ను నామినేషన్లలోకి వచ్చేలా ప్లాన్ చేశాడు ఈసారి… ఎలాగూ నబీల్ టాప్ కాబట్టి బయటికి వెళ్లడు… మిగతా నలుగురిలో ఎవరో ఒకరు వెళ్లకతప్పదు… అది యష్మి కావడం ఆమె దురదృష్టం…
అఫ్‌కోర్స్, 12 నెలలపాటు హౌజులో ప్రతిసారీ నామినేషన్లలో ఉంటూ నిలబడటం ఆమె కోణంలో ఓ విజయమే… నో రిగ్రెట్స్… హౌజు నుంచి వెళ్లేటప్పుడు కూడా ఏ బాధా లేకుండా నవ్వుతూ వెళ్లిపోయింది… దటీజ్ యష్మి… గుడ్…!!
Share this Article