.
ఛీ… ఈ అక్షరం వాడటానికి ఏమీ సందేహించడం లేదు… అది ఈటీవీ పాడుతా తీయగా రెట్రో సాంగ్స్ ఎడిషన్ స్పెషల్ షో గురించి…
ఎప్పటి నుంచో అనుకుంటున్నదే… సినిమా సాంగ్స్ కాస్తా అన్ని టీవీ చానెళ్లలోనూ… చివరకు ఆహా ఓటీటీలోనూ… పక్కా ఓ ఎంటర్‌టెయిన్‌మెంట్ పర్‌ఫామెన్స్ షోలుగా మారిపోయాయని…
Ads
గతంలో చూశాం కదా అనంత శ్రీరాం పిచ్చి గెంతులు కూడా… సింగర్స్ పాడుతుంటే డాన్సర్లు చుట్టూ చేరి గెంతులు వేయడం… లైట్ల డిస్కోలు… రకరకాల డ్రెస్సులు… హంగామా… అట్టహాసం…
శృతులు, లయలు, సంగతులు మన్నూమశానం జాన్తా నై… సింగర్స్‌కు కూడా వేషాలు వేసి పాడించడం… అసలు అవి సంగీత పోటీలా..? పర్‌ఫామెన్స్ పోటీలా..? గతంలో జీతెలుగులో అయితే రకరకాల కుళ్లు జోకులు కూడా… ప్రదీప్ అయితే మరీ ఈటీవీ ఢీ షో, జబర్దస్త్ షోలాగా మార్చేశాడు దాన్ని… గతంలో… ఇప్పటి షో కాదు…
ఇవన్నీ చూస్తుంటే ఈటీవీ పాడుతా తీయగా మాత్రమే బెటర్ అనిపించింది మొన్నటి దాకా… ఎస్పీ బాలు కాలం నాటి పాడుతా తీయగా షో కాకపోయినా సరే, తన కొడుకు చరణ్ ఎంతోకొంత పద్ధతిగానే ఆ షో రన్ చేస్తున్నట్టు అనిపించింది… తను కూడా సరదాగా తండ్రిలాగే ఎంతోకొంత షో రక్తికట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు అనిపించేది…
కానీ అలా సంతృప్తిపడితే అవి తెలుగు చానెళ్లు ఎందుకు అవుతాయి..? అదీ అలాగే తయారైంది… తాజా ప్రోమో ఒకటి చూస్తుంటే ఆశ్చర్యం, అసహ్యం ఒకేసారి కలిగాయి… అది రెట్రో సాంగ్స్ స్పెషల్ అట…
అంటే… కంటెస్టెంట్లకు ఆ పాత పాటలకు తగిన వేషాలు… అవీ సరే… పర్లేదు అనుకోవచ్చు… చివరకు జడ్జిలు సునీత, చంద్రబోస్, విజయప్రకాష్ కూడా… చరణ్ కూడా అలాగే వేషాలు వేసుకొచ్చారు…
సునీత చీర వయ్యారాలు… విజయప్రకాష్ ఎన్టీయార్ మార్క్ డాన్సులు, కాపీ కొడుతున్నట్టుగా చంద్రబోస్ గెంతులు… అసలు ఏమిటిదంతా..?
జడ్జిమెంట్లు చెప్పడం మాత్రమే కాదు… జడ్జిలు కూడా షోను రక్తి కట్టించడానికి వేషాలు వేయాలా..? అది అసలు సంగీత కార్యక్రమమా..? లేక ఏదో బిగ్‌బాస్ తరహా ప్రోగ్రామా..? సెట్టింగులు కూడా ఎక్సట్రా వేసి, గ్రూపు డాన్సర్లతో గెంతులు వేయించలేకపోయారా..?
జీతెలుగు, స్టార్‌మా, ఆహా ఓటీటీ వేరు… కానీ ఈటీవీ కూడా తన పాడుతా తీయగా అనే పద్ధతైన కార్యక్రమాన్ని అలా మార్చేయడమే బాధాకరం… ఎందుకంటే… బాలు కాలం నుంచీ దానికో స్టాండర్డ్ ఉంది… దాన్ని కూడా గంగలో కలిపేయడమే ఆశ్చర్యం…
ఒక జబర్దస్త్, ఒక శ్రీదేవి డ్రామా కంపెనీ, ఒక ఢీ, ఒక సుమ అడ్డా… ఇదీ అలాగేనా..? అదేనా నిర్వాహకులు చెప్పదలుచుకుంది..? ఎస్పీ చరణ్ భాయ్… పునరాలోచించాలి..!!
Share this Article