.
రాజకీయ పార్టీలు- బడా కార్పొరేట్ కంపెనీల నడుమ ఆర్థిక బంధాలు ఎప్పుడూ చర్చనీయాంశాలే…
.
Ads
గతం వేరు… పెద్ద కంపెనీలు పార్టీలకు విరాళాలిచ్చేవి, తమ వ్యాపారాల్ని తమ తోవన తాము కొనసాగించుకునేవి… అన్ని పార్టీలూ తమ ఖర్చులకు కంపెనీల విరాళాల మీదే ఆధారపడేవి…
వర్తమానం వేరు… పెద్ద కంపెనీలు అధికారంలో ఉన్న పార్టీల దన్నుతో మరింత పెద్దవి అవుతున్నాయి… వేగంగా విస్తరిస్తున్నాయి… వాళ్ల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు రూపొందుతున్నాయి…
ఆదానీకి, బీజేపీకి నడుమ దోస్తీ అందరికీ తెలిసిందే… అత్యంత వేగంగా ఆదానీ గ్రూపు విస్తరించడానికి బీజేపీ ప్రభుత్వమే కారణమనే విశ్లేషణలూ తెలిసినవే… అమెరికాలో కేసు అనే వార్తలు ఈ చర్చలను మరింత పెంచేశాయి…
చాలావాటికి ఆధారాలుండవు… నిజానిజాలేమిటో బయటపడవు… కానీ పొలిటికల్, బిజినెస్ సర్కిళ్లలో ప్రచారాలు మాత్రం సాగుతూ ఉంటాయి… బ్లూంబర్గ్ పదే పదే ఆదానీ మీద నెగెటివ్ ప్రచారానికి దిగడం వెనుక తనను దాటేసి పోతున్నాడన్న అంబానీ కోపం ఉందంటారు కొందరు… కానీ బీజేపీ, మోడీషాలకు ఆదానీ దగ్గర అని తెలిసీ అంబానీ అలా ఎందుకు చేస్తాడనే ప్రశ్నలూ మరోవైపు… బీజేపీతో ప్రస్తుతం ఎవరూ గోక్కోవడానికి సాహసించే సిట్యుయేషన్ ఉందా..?
అంతెందుకు..? మన తెలుగు మేఘా ఇంజనీరింగ్ పార్టనర్స్ కృష్ణారెడ్డి, పిచ్చిరెడ్డి విడిపోయాక… క్రమేపీ మేఘా బోర్డులోకి అమిత్ షా మనుషులు ప్రవేశించారని ప్రచారం… ఐతే ఒకవేళ అందులో అమిత్ షా పెత్తనం పెరిగిపోవడమే నిజమైతే బీఆర్ఎస్ మేఘా మీద ఎందుకు ఉరుముతున్నదనేదీ ప్రశ్నే… ప్రస్తుతం బీజేపీ సహకారం కావాలి బీఆర్ఎస్‌కు…
ఫార్ములా రేస్ స్కామ్ మీద విచారణకు నెలరోజులైనా గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదు కదా… ఆదానీ బీజేపీకి ఇష్టుడు… బీజేపీ ఆర్థిక పరిపుష్టికి ఆదానీ కూడా కారణమే… అందుకని కాంగ్రెస్, ఇండి కూటమికి గుర్రు… అందుకని ఆదానీని టార్గెట్ చేస్తున్నారని టాక్… ఈ కోణంలోనే తెలంగాణ ప్రభుత్వం 100 కోట్ల ఆదానీ విరాళాన్ని వాపస్ చేసినట్టు సమాచారం…
బీజేపీ ఆదానీ కాబట్టే… చంద్రబాబు ఆదానీ మీద తీవ్ర ఆరోపణలు చేయడం లేదు… కాకపోతే ఆదానీతో కుదిరిన సెకీ విద్యుత్తు ఒప్పందాల మీద జగన్‌ను టార్గెట్ చేస్తున్నారు… ఎలాగూ ఆదానీ మీద కాంగ్రెస్ అధికారికంగా విరుచుకుపడుతోంది కాబట్టి ఏపీ కాంగ్రెస్ షర్మిల కూడా ముందుకొచ్చి ఆదానీ, జగన్ అవినీతి బంధం మీద విచారణ జరగాలంటూ డిమాండ్ చేస్తుంది…
ఆమధ్య ఎన్నికల బాండ్ల వివరాలు బయటపడ్డాయి కదా… అతి పెద్ద లబ్దిదారు బీజేపీ… దాన్ని సమీపించే స్థితి ఏ పార్టీకీ లేదు… వర్తమాన రాజకీయ ఎత్తుగడలు, అధికార కైవస వ్యూహాలకు భారీగా ధనం కావాలి… ధనం కావాలంటే కంపెనీల సపోర్ట్ కావాలి… కంపెనీల సపోర్ట్ కావాలంటే అడిగినవి చేసిపెట్టాలి… అవి చేసి పెట్టాలంటే అధికారం కావాలి… ఇదొక కొత్త వలయం…
ఈ వలయంలోనే ‘సొంత మీడియా’ అనే ఆలోచన వచ్చిచేరింది… అది పెట్టుబడులకు వేదికతోపాటు సొంత రాజకీయ ప్రచారాలకు ఆలంబన… ప్రత్యర్థులపై విషం చిమ్మడానికీ అవసరం… కార్పొరేట్, మీడియా, పొలిటికల్ వలయాలు రాబోయే రోజుల్లో ఇంకా మన రాజకీయ- అధికార వ్యవస్థల్ని ఎటువైపు తీసుకుపోతాయో..! ఏమో… పెద్ద కంపెనీల వ్యవస్థల్లోకి అధికార పార్టీల ప్రతినిధులు చేరి, వార్షిక ఆదాయంలో నిర్ణీతశాతం పార్టీకి ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ చేసే రోజులూ వస్తాయేమో..!!
Share this Article