.
Act of Jo Biden!
జనవరి 20 లోపు ఎంత చేయవచ్చో అంత చేసేయాలని ఆత్రంతో ఉన్నారు జో బిడెన్ అధికారులు!
ఎటూ జనవరి 20 తరువాత చేయడానికి ఏమీ ఉండదు అని తెలిసీ చెస్తున్నారు అంటే తెగించారు అన్నమాట!
Ads
జో బిడేన్, జార్జ్ సోరోస్ 80 పైబడిన వయసులో ఉన్నారు కాబట్టి కేసులు, విచారణ అయిపోయేసరికి బతికి ఉండరు! అందుకే చేయగిలిగినంత చేస్తున్నారు భయం లేకుండా!
అది బంగ్లాదేశ్ రాజధాని ఢాకా… బంగ్లాదేశ్ యూనివర్శిటీ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ ( BUET) క్యాంపస్… గేటు ముందు భారత జాతీయ పతాకాన్ని పెట్టారు!
విద్యార్థులు మన జాతీయ పతాకాన్ని తొక్కుకుంటూ లోపలికి వెళ్లాలని అక్కడ పెట్టారు! So! ఉద్దేశ్యం చాలా స్పష్టంగా తెలిసిపోతున్నది!
వీలున్నంత వరకు బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేకతను పెంచుకుంటూ వెళ్ళడమే! అలా అని బంగ్లాదేశ్ ప్రజలు అందరూ భారత వ్యతిరేకం కాదు! కేవలం 5% మంది మత మౌఢ్యంలో కొట్టుకుంటున్న వాళ్ళే ఇలా చేస్తూ చేతులారా వాళ్ళ దేశాన్ని రాతి యుగంలోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు! వీళ్ళకి ప్రస్తుత ప్రభుత్వం మద్దతు పలుకుతున్నది!
ఎంతవరకు వెళతారు? అకారణంగా ఇస్కాన్ బంగ్లాదేశ్ శాఖ ప్రతినిధి చిన్మయ కృష్ణ దాస్ ప్రభును అరెస్టు చేశారు! పెట్టిన కేసు దేశద్రోహం!
చిన్మయ కృష్ణ దాస్ ప్రభు హిందువుల హక్కుల కోసం పోరాడుతున్నారు కనుక అది దేశద్రోహం! చిన్మయ కృష్ణ దాస్ ప్రభును అరెస్ట్ చేయగానే భారత విదేశాంగ శాఖ నిరసన వ్యక్తం చేస్తే, దానికి బదులుగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక నోట్ పంపించింది భారత్ కి .
ఆ నోట్ సారాంశం ఏమిటంటే….. బంగ్లాదేశ్ సర్వసత్తాక దేశం! మా చట్టాలు మాకు ఉన్నాయి, వాటి ప్రకారం చర్యలు తీసుకునే హక్కు మాకు ఉన్నది!
**************
ఐపీఎల్ వేలంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లను బహిష్కరించారు ! ఇక మిగిలింది ఎగుమతులను ఆపివేయడమే!
ఉత్తరప్రదేశ్ లో అధునాతన టెక్స్టెయిల్ పార్క్ నిర్మిస్తున్నారు యోగి! పనులు శరవేగంగా జరుగుతున్నాయి!
మొత్తం బంగ్లాదేశ్ ఎంత చేయగలుగుతుందో దానికి రెట్టింపు రెడీమేడ్ దుస్తులు కుట్టగలిగే సామర్థ్యంతో నిర్మిస్తున్నారు! మరో రెండు నెలల్లో ప్రారంభం అవుతుంది! ముందస్తుగా ఆర్డర్స్ తీసుకోవడం మొదలు పెట్టారు!
విచిత్రం ఏమిటంటే బంగ్లాదేశ్ textile ట్రేడర్స్ మాకు కూడా వాటా ఇవ్వమని అడుగుతున్నారు! షేక్ హసీనా తిరిగి ప్రధాన మంత్రి అయినా కూడా బంగ్లాదేశ్ కోలుకోవడం కష్టం!
జస్ట్! మరో పాకిస్ధాన్ అవుతుంది! విద్యుత్, ఇంధనం ధరలు ఆకాశాన్ని తాకే రోజు త్వరలో రాబోతున్నది! వినాశనాన్ని కోరి తెచ్చుకున్నారు! బంగ్లాలో హిందువుల మీద జరుగుతున్న అణిచివేతని ప్రశ్నిస్తున్నది పవన్ కళ్యాణ్ ఒక్కడే! …
కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఎలాగూ స్పందించరు… అవి యాంటీ హిందూ… పోనీ, స్టాలిన్, అఖిలేష్, మమత, కేసీయార్, ఠాక్రే, తేజస్వి యాదవ్ ఎట్సెట్రా ఎవరైనా స్పందించారా..? ఆ దేశం మన జాతీయ పతాకాన్ని తొక్కుతూ మనకు ఏదో మెసేజ్ ఇస్తోంది… ……. పొట్లూరి పార్థసారథి
Share this Article