.
రైతుపండుగ పేరిట పత్రికల్లో కనిపించిన సర్కారీ యాడ్స్ ఆశ్చర్యాన్ని కలిగించాయి… కేసీయార్ ప్రభుత్వానికి రేవంత్‌రెడ్డి సర్కారుకూ పెద్ద తేడా లేమీ లేదు ఈ విషయంలో అనిపించింది…
కొన్ని డిజిటల్ పేపర్లకు కూడా యాడ్స్ ఇచ్చారు… అసలు ఈ యాడ్స్ ఇచ్చే విధానంలో ఏముందో, ఏలినవారికి ఏమర్థవుతున్నదో దేవుడికే తెలియాలి.,. డిజిటల్ పేపర్లను కూడా ప్రభుత్వం పత్రికలుగా గుర్తిస్తున్నదని అధికారికంగానే చెప్పినట్టేనా..? ఈమేరకు రూల్స్ ఏమైనా మార్చబడ్డాయా..?
Ads
జగన్ పిరియడ్‌లో ఏపీలో పత్రికల బాపతు వెబ్‌సైట్లకు కూడా యాడ్స్ ఇచ్చే ఓ పాలసీ తీసుకొచ్చారు… సరే, వాటిల్లో లోపాలు, అక్రమాలు మన్నూమశానం కథ వేరు… జగన్ పిరియడ్‌లో సాక్షికి ఇచ్చిన యాడ్స్ విలువను లెక్కించి, అక్రమాల్ని నిర్ధారించి బుక్ చేయాలని మొదట్లో ఉబలాటపడ్డారు, చివరకు వదిలేశారు…
తెలంగాణలో నమస్తే తెలంగాణకు ఇచ్చిన యాడ్స్ విషయంలోనూ తప్పులు నిర్ధారించి, ఏదో చేయాలని తహతహలాడారు గానీ… వదిలేశారు… విచిత్రంగా… నమస్తే తెలంగాణను మించి కేసీయార్ సొంత పత్రికగానో, సంతోష్ పత్రికగానో ముద్రపడిన మనతెలంగాణకు సర్కారీ యాడ్స్ మళ్లీ స్టార్ట్ చేశారు… మొన్నటిదాకా ఎందుకు ఆపేశారు..? ఇప్పుడెలా ప్రారంభించారు..? ఇవ్వకూడదని కాదు… ఓ పత్రిక నిలబడితే సంతోషమే… కానీ అసలు పాలసీ ఏమిటని..?
అలాంటప్పుడు నమస్తే తెలంగాణకు ఎందుకు యాడ్స్ ఆపాలి..? కేసీయార్ పత్రిక ఐనంతమాత్రన అనర్హత కాకూడదు కదా…! రేవంత్‌రెడ్డికి ఇష్టుడు దేవులపల్లి అమర్ సంపాదకుడిగా రాగానే పత్రిక పాత రాజకీయ వైఖరి ‘బారా ఖూన్ మాఫీ’ అన్నట్టేనా..? అమర్‌ను సంపాదకుడిగా తీసుకురావడం వల్ల పత్రిక ఖుషీ… అమర్ సక్సెస్… మొన్నామధ్య ఓ ఫుల్ పేజీ ఇంటర్వ్యూ కూడా వర్కవుట్ అయినట్టుంది…
నిజానికి సర్క్యులేషన్ నిర్ధారణకు ఓ కొలమానంగా పరిగణించే ఏబీసీ ఉంది… కానీ అందులో సాక్షి, ఈనాడు, జ్యోతి మాత్రమే ఉన్నాయి… ఇంకెవరూ లేరు… సీఏ సర్టిఫికెట్ ఇచ్చేసి, అడ్డగోలు సర్క్యులేషన్ చూపించేస్తే దాన్ని ఐఅండ్‌పీఆర్ ప్రామాణికంగా తీసుకోవాలా..? అసలు టీవీల పాపులారిటీ ఖరారుకు అనుసరిస్తున్న విధానం ఏమిటి..? ఇదో చిక్కు ప్రశ్న… అబ్బే, ఇవన్నీ దేనికి..? పత్రిక మనవాళ్లదా..? ప్రత్యర్థులదా..? ఇదొక్కటే లెక్క అంటారా..?
పొలిటికల్‌గా ఈ ఆలోచన కరెక్టే కావచ్చుగాక… కానీ ప్రజాధనం కదా ఖర్చుపెట్టేది… దానికి ఓ పాలసీ, ఓ హేతుబద్ధత, సరైన ప్రామాణికాలు అవసరమని పాపం ప్రజలు కూడా ఆశిస్తుంటారు కదా… అస్మదీయులకే యాడ్స్, తస్మదీయులకు నోప్స్ అనేదే విధానం కాకూడదు కదా…
నమస్తే తెలంగాణ సీఎంకు పడని కేసీయార్ పత్రిక కాబట్టి యాడ్స్ ఇవ్వడం లేదు, వోకే అనుకుందాం కాసేపు… మరి సీఎంకు పడని జగన్ పత్రిక కదా సాక్షి..? మరి దానికి యాడ్స్ ఇవ్వడానికి ఏది ప్రాతిపదిక..? స్థూలంగా సర్కారీ యాడ్స్‌కు ఓ రీతిరివాజు లేనట్టేనా..?!
Share this Article