.
నిజానికి నాకు నచ్చిన టీవీ ఇంటర్వ్యూయర్ తను… ఈ సోకాల్డ్ పిల్ల బిత్తిరి ఇంటర్వ్యూయర్లు లేని నాటి రోజుల్లో పెద్ద పెద్ద కేరక్టర్లనే తన ఇంటర్వ్యూలతో హడలగొట్టిన జర్నలిస్టు తను… పేరు కరణ్ థాపర్…
ఒక కంచె ఐలయ్య, ఒక రామచంద్రగుహ, ఒక యోగేంద్ర యాదవ్ ఎట్సెట్రా… ఇలాంటి వ్యాసకర్తల వ్యాసాలు బయాస్డ్‌గా ఉంటాయి… సరే, వాళ్ల వ్యాసాలు వాళ్ల ఇష్టం… అవి పబ్లిష్ చేసుకునే మీడియా సంస్థల ఇష్టం… కానీ..?
Ads
ఒక కరణ్ థాపర్, ఒక రజత్ శర్మ షోలు భారతీయ టీవీ న్యూస్ చరిత్రలో విశేష అధ్యాయాలు… అర్నబ్ గోస్వామి వంటి పక్కా ఫండమెంటలిస్టుల కాలం వచ్చాక క్రమేపీ… మిగతావాళ్లు కాలగతిలో కొట్టుకుపోవడం ఆరంభమైంది…
తెలుగు న్యూస్ చానెళ్ల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది… టీవీ5 సాంబశివరావు, మహాన్యూస్ వంశీ దగ్గర నుంచి… సారీ, సరే, వాళ్లను వదిలేస్తే… సాక్షి పత్రికకు ఏ వైరస్ పట్టుకుందో అర్థం కాదు… ఫాఫం, పదేళ్ల నుంచీ ఎడిట్ పేజీని ఎవరూ పట్టించుకునేవారు, పరీక్షించేవారు, పర్యవేక్షించేవారు లేకపోయినా సరే బాగానే నడిచింది…
అదీ అచ్చం కరణ్ థాపర్‌లాగే మెంటల్ సిట్యుయేషన్‌నే అనుభవిస్తున్నట్టుంది… మొన్నామధ్య ఇంటర్వ్యూల్లో గెస్టుల ఏకధాటి జవాబులను అడ్డుకోవడం ఎలా అని పాఠాలు నేర్పించాడు… దానికి ఏం ప్రజోపయోగం ఉందో, ఏం ప్రాధాన్యం ఉందో తనకే తెలియాలి…
ఇంతకుముందు చెప్పుకున్నట్టున్నాం… జయలలిత ఈ జర్నలిస్టు ఇంటర్వ్యూను మధ్యలో ముగించేసి మైక్ విసిరేసి వెళ్లిపోయింది… గెస్టు అహం, మెంటాలిటీ తెలిసి ప్రశ్నలు అడిగి, నవ్వుతూనే జవాబులు రాబట్టడం ఓ కళ… అది ఓ రజత్ శర్మకు తెలుసు… అది అర్నబ్ గోస్వామికి తెలియదు, ఈ కరణ్ థాపర్‌కు అస్సలు తెలియదు…
ఈరోజు మరీ నాసిరకం వ్యాసం… సాక్షి ఎడిట్ పేజీకి భలే దొరుకుతారు ఇలాంటోళ్లు… నిజానికి ఈ పొలిటికల్ సిట్యుయేషన్‌లో తనకు కావల్సిందేమిటి..? తను ప్రజెంట్ చేస్తున్నదేమిటి..? సర్లెండి, జగన్ పేపర్, జగన్ ఇష్టం… ఫాఫం…
కరణ్ థాపర్ లండన్ అండర్ గ్రౌండ్ మెట్రో రైలులో ప్రయాణిస్తుంటే… తనకు సొరంగం నుంచి వచ్చే రైలు ట్యూబ్ నుంచి వచ్చే పేస్ట్‌లా కనిపిస్తుందట… తను ఓసారి ప్రయాణం చేస్తుంటే ఎవరో ఓ అపరిచితుడు తన లగేజీ మోసి, తనకు సాయం చేశాడట… ఇప్పుడు ఢిల్లీల్లో అండర్ గ్రౌండ్ అనేసరికి అదే గుర్తుకొస్తున్నదట…
సార్, ఎవరికి కావాలి సార్, మీ లగేజీ ప్రయాసలు, ఎవరో ఓ అపరిచితుడి సాయం… దానికున్న ప్రాధాన్యం ఏమిటి…? భలే దొరుకుతారు రామచంద్ర గుహలు, యోగేంద్ర యాదవ్‌లు, ఈ కరణ్ థాపర్‌లు, ఈ కంచె ఐలయ్యలు..!!
Share this Article