.
హహహ… నేను ముందు నుంచే చెబుతున్నా… ఈసారి బిగ్‌బాస్ హౌజ్ అంటేనే ఓ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అని…
నో నో , నువ్వు తప్పు… కంటెస్టెంట్లు మెంటల్ గాళ్లు కాదు… అసలు బిగ్‌బాస్ టీమే పెద్ద మెంటల్ గ్రూప్ అని… పదే పదే నిరూపితం అవుతూనే ఉంది…
Ads
ఈరోజు టాస్క్ పర్‌ఫెక్ట్ ఉదాహరణ… మణికంఠ, పృథ్వి తదితరులు వెళ్లిపోవడం కాదు… అసలు కేసు బిగ్‌బాస్ కదా… పక్కాగా బిగ్‌బాస్ ఎవరు డీల్ చేస్తున్నారో వాళ్ల చిప్స్ టోటల్లీ కరప్టెడ్…
నిలబెట్టు పడగొట్టు అని ఓ టాస్క్… ఎందుకయ్యా అంటే..? ఆడియెన్స్ ఉద్దేశించి వోట్ అప్పీల్ చేసుకోవడానికి అట… ఇవన్నీ వేస్ట్, అడిగితే వోట్లు వేయరు, ఆట చూసి వోట్లేస్తారు,.. సరే, ఏవో టాస్కులు… పర్లేదు, చూడ్డానికి ఇంట్రస్టింగ్ అనుకుందాం…
ఏవో చిన్న, పెద్ద చిన్న కర్ర బాక్సులు తీసుకొచ్చి వరుసగా నిలబెట్టి, ఎవరి ఫోటో అయితే చివరి వరకూ పడిపోదో వాడు విజేత అట… అత్యంత చెత్తా టాస్క్… మరీ జబర్దస్త్ భాషలో చెప్పాలంటే బిగ్‌బాస్ చిప్ దొబ్బింది అని అర్థం…
ఫర్ ఎగ్జాంపుల్… అవినాష్ అందరికన్నా ముందు ప్లాట్‌ఫామ్ మీద వరుసగా వాటిని నిలబెట్టి కాస్కేడింగ్ ఎఫెక్ట్‌తో ఓ ఫోటో పడేశాడు… అంటే తనే కదా విజేత… కాదట… గౌతమ్‌కు ఆడటం చేతకాలేదు, అసలు చివరి వరకూ ఆడలేదు… ఆ ఫోటో పడకుండా ఆగిపోయింది… అంటే ఆ ఫోటో వ్యక్తి విజేతా..? తనకు వోట్ అప్పీల్ వస్తుందా..?
పరమ దరిద్రమైన ఆట… ప్లానింగ్… ఒక పెద్దది, ఒక చిన్నది అని ఓ రూల్… కానీ నలుగురు ఫౌల్ గేమ్ ఆడారు… సంచాలక్ రోహిణికి ఏమీ అర్థం కాలేదు… బాబ్బాబూ, మళ్లీ పెట్టండి, నాదే తప్పు అని బిగ్‌బాస్‌ను బతిమిలాడటం… దాదాపు రెండు మూడు గంటలపాటు కంటెస్టెంట్లలో ఎవడికైనా ఆ గేమ్ అర్థమైతే ఒట్టు…
జుత్తు పీక్కున్నారు… అంగీలు చింపుకున్నారు… చివరకు బిగ్‌బాస్ కూడా ఓ ఖాళీ బుర్రతో మిగిలిపోయాడు… అదీ హైలైట్… అంతిమంగా విష్ణుప్రియ విజేత అట… ఆమె ఫోటో కాదు కదా, మిగిలిపోయింది…? ఈ మాట అంటే బిగ్‌బాస్ అనే మెంటల్ కేసుకు నచ్చదు… అసలు నేను విజేతనా అని ఆమే ఆశ్చర్యపోయింది,..
నబీల్ ఈమధ్య అదుపు తప్పాడు కదా… మళ్లీ ఇందులో కూడా అదే వితండవాదం… ప్రేరణతో అదే వాదం… బాగా విసిగిస్తున్నాడు…
అసలు ఎవడికైనా సమజై చస్తే కదా ఆ గేమ్… ఆట ముగిశాక కూడా అదే చర్చ… ఎవడికీ క్లారిటీ లేదు,., ముందే అనుకున్నాం కదా… ఈటీవీ భాషలో ‘చిప్స్ దొబ్స్’…
ఏమాటకామాట నిన్న తుమ్మ సంజయ్ అనే చెఫ్ వచ్చాడు కదా,… నాన్ సినిమా, నాన్ టీవీ సెలబ్రిటీ… ఈరోజు ఆయనెవరో మ్యూజిషియన్, సింగర్ వచ్చాడు… (బ్యాండ్ జామర్స్ అట)… పెద్దగా తెలియదు నాకైతే… కానీ భిన్నమైన సెలబ్రిటీలను తీసుకురావడం వరకూ వోకే…
కానీ జనం మెచ్చుతున్నారా,..? నో… ఇది ఎప్పుడో ఎత్తిపోయిన కేసు… ఇక ఎన్ని వేషాలు వేసినా షో లేవదు… గత వారం టీఆర్పీల్లో ఒకరోజు ఈ షోకు మరీ 3 రేటింగ్స్‌లోపు… ఇంకేముంది..? ఫినాలే వస్తోంది… వెరసి గత సీజన్‌లాగే ఈసారీ ఈ షో ఫ్లాప్… అదీ రియాలిటీ..!!
.
గమనించారా…. నిఖిల్, గౌతమ్, నబీల్ డౌన్ అవుతుంటే… ప్రేరణ, రోహిణి, విష్ణుప్రియ పికప్ అవుతున్నారు టాస్కుల్లో…
Share this Article