.
బిగ్‌బాస్ షో… జస్ట్, ఓ రియాలిటీ షో మాత్రమే కాదు… అదొక దందా… నెగెటివ్ టోన్‌లో కాదు, అవును, అదొక వ్యాపారం…
హౌజులోకి వెళ్లేముందే రకరకాల ఒప్పందాలు, ఆంక్షలు… కంటెస్టెంట్లు సొంతంగా పీఆర్ ఏజెన్సీలను పెట్టుకుని క్యాంపెయిన్ రన్ చేస్తుంటారు… మిస్డ్ కాల్స్, వోట్లు వేయించాలి… చేతనైతే ఆర్టిఫిషియల్ వోటింగు కూడా…
Ads
బిగ్‌బాస్ టీమ్‌కు కూడా ఓ స్ట్రాటజీ ఉంటుంది… ఎవరిని ఎన్ని వారాలు ఉంచాలి… ఎవరు షోకు ప్లస్ అవుతున్నారు… ఎవరిని ఎలా పోట్రే చేయాలి… ఎవరిని ఎప్పుడు పంపించేయాలి… ఇవన్నీ ఒకెత్తు… బట్, ఫైనల్‌గా ఒక కంటెస్టెంట్ సక్సెస్ అనేది తన వ్యక్తిగత ఆట స్ట్రాటజీ మీదే ఆధారం…
ఎలా ఆడితే ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది… ఎలా ఆడితే జనం వోట్లేస్తారు… ఎవరిని ఇష్టపడతారు… గ్రూపుగా ఆడాలా… సోలోగా ఆడాలా… గ్రూపు అయితే కులం గ్రూపా మతం గ్రూపా భాష గ్రూపా ప్రాంతం గ్రూపా… రకరకాలు…
ఇవన్నింటికితోడు లక్ కలిసిరావాలి… ఈ హౌజుకు సంబంధించి అవినాష్ ఎంటర్‌టెయినర్ అనేది నిజమే… కానీ బిగ్‌బాస్ చెప్పినట్టు సుడిగాడు… లక్ బాగా కలిసొచ్చింది తనకు… అదే రోహిణి తనకు దీటుగా ఎంటర్‌టెయిన్ చేయగలిగింది…
అంతేకాదు, హుందాగా ఉంది హౌజులో… అవసరమున్నచోట్ల కసిగానే ఆడింది టాస్కుల్లో… కానీ ఫినాలేకు అడుగు దూరంలో బయటికి వచ్చేసింది… నిజమే, ఆమె నామినేషన్లలో లేకపోవడంతో ఆమె పీఆర్ ఏజెన్సీకి పెద్దగా పనే లేకుండా పోయింది… (ఆమె ఏర్పాటు చేసుకుని ఉంటే..?) ఓ ఫ్యాన్ బేస్ ఏర్పాటు కాలేదు…
మరి విష్ణుప్రియ..? ఈమెదొక కథ… స్టార్ కంటెండర్ ఆమె మొదట్లో… కానీ ఆమె మాటలు, చేష్టలు పెద్దగా ప్రేక్షకులకు నచ్చలేదు… ముందస్తు ఒప్పందాల పుణ్యం కావచ్చు ఇక్కడిదాకా లాక్కొచ్చారు… నత్తి బ్రెయిన్ అని తనే చెప్పుకున్నట్టు… వింత మాటలు, ఆ పృథ్వితో లవ్వు ఆమెను నెగెటివిటీలోకి పడేశాయి…
ఆ లవ్వు యవ్వారం అంతా బిగ్‌బాస్ టీం స్క్రీప్ట్ ప్రకారమే నడిచే ఓ నటన… ఐనాసరే, అంతలా ఆ పాత్రలో జీవించొద్దు… అక్కడ తేడా కొట్టినట్టుంది… పెద్దగా టాస్కులు, చాలెంజుల్లోనూ ఆసక్తి ఉండేది కాదు… ఫలితంగా ఫైనలిస్టు, వీలైతే విన్నర్ అనే స్థాయిలో ప్రచారం జరిగిన ఆమె చివరకు రోహిణితోపాటు ఫినాలేకు అడుగు దూరంలో చతికిలపడిపోయింది…
ఇంతా చేస్తే ఏమొస్తుంది..? డబ్బు వస్తుంది… వారానికి ఇంత అని పే చేస్తుంది బిగ్‌బాస్… టీవీ, ఫిలిమ్ సర్కిళ్లలో గుర్తింపు వస్తుంది… పాపులారిటీ వస్తుంది… సినిమాల్లో పెద్దగా పట్టించుకోరు గానీ టీవీ ప్రోగ్రాముల్లో పని దొరుకుతుంది బాగానే… కాకపోతే…
ఈ పాపులారిటీ జస్ట్, ఒక వాపు… బలుపు కాదు… దాన్ని బలుపుగా భ్రమపడి, సంపాదించిన సొమ్ముకు మరికొన్ని అప్పులు చేసి తామే సినిమాలు చేసి నిండా మునిగినవాళ్లూ ఉన్నారు… ఏవేవో సినిమా అవకాశాలు తన్నుకొస్తాయని భ్రమపడి, భంగపడినవాళ్లూ ఉన్నారు…
శ్రీముఖి, గీతామాధురి వంటి వాళ్లకు ఈ పాపులారిటీ జస్ట్, ఓ చిన్న విషయం… యాంకర్‌గా ఈమె, సింగర్‌గా ఆమె తమ సొంత మెరిట్‌తోనే రాణిస్తున్నారు… రోహిణికీ అంతే… ఆమె కమెడియన్‌గా ఆల్రెడీ మంచి పేరు సంపాదించుకుంది… అదే ఆమెకు తిండిపెట్టాలి తప్ప బిగ్‌బాస్‌తో ఆమెకు పెద్దగా అదనపు అడ్వాంటేజ్ ఏమీ ఉండదు… సో, బిగ్‌బాస్ వోట్లు, పాపులారిటీ, హంగామా తలకెక్కొద్దు… ఎక్కితే పల్లవి ప్రశాంత్‌లు అవుతారు… అదీ ఈ కథన నీతి..!!
ఈరోజుకున్న సిట్యుయేషన్‌ను బట్టి… నిఖిల్, గౌతమ్ విన్నర్ రేసులో బలమైన పోటీదారులు… కానీ గౌతమ్‌ను టార్గెట్ చేస్తున్నట్టుగా నాగార్జున మాటలున్నాయి… తనను బాగా నెగెటివ్‌గా పోట్రే చేశాడు… దానికి గౌతమ్ అర్హుడే… సో, విన్నర్ ఎవరనేది నాగార్జున హింట్స్ ఇస్తున్నట్టే అర్థం చేసుకోవాలి..!
Share this Article