.
పాన్ ఇండియా సినిమా అంటే..? ఏముంది..? మాంచి మార్కెట్ ఉండి, దండిగా వసూళ్లు వచ్చే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలతోపాటు హిందీలో కూడా రిలీజ్ చేయడం… ఏముంది..? ఆయా భాషల్లోకి డబ్ చేయడమే కదా…
తమిళ హీరోలను మన స్ట్రెయిట్ హీరోలుగా ఆదరిస్తాం కదా… మలయాళ మమ్ముట్టి, దుల్కర్, మోహన్ లాల్‌ను కూడా… కన్నడ యశ్, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి ఎట్సెట్రా కూడా మన హీరోలే అయిపోయారు కొన్నాళ్లుగా… ఆ సినిమాలన్నీ మన తెలుగులో స్ట్రెయిట్ సినిమాల్లాగా బాగానే ఆడుతుంటాయి…
Ads
ఎటొచ్చీ మన వాళ్ల సినిమాల్నే తమిళం, మలయాళం, కన్నడంలో పెద్దగా ఎవరూ దేకరు… హిందీలో చాలా నయం… మన హీరోల సినిమాలు గత ఏడెనిమిదేళ్లుగా హిందీలో దుమ్మురేపుతున్నాయి… ప్రభాస్ అయితే ఏకంగా బాలీవుడ్ హీరోలకే బెదురు పుట్టిస్తున్నాడు…
పుష్పతో జెండా పాతిన అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్‌తో మరింత బలపడ్డాడు నార్తరన్ మార్కెట్‌లో… అవును, ఈ పుష్ప సీక్వెల్ వసూళ్ల తీరు చూస్తే ఈ ధోరణి బాగా అర్థమవుతుంది… తను మల్లు అర్జున్‌గా మలయాళంలో ప్రసిద్ధుడు… బన్నీకి అక్కడ మంచి మార్కెట్ ఉంది… ఐనాసరే పుష్ప2 ఎందుకో నడవడం లేదు పెద్దగా…
ఇప్పటివరకు 600 కోట్ల వసూళ్లలో మలయాళం వాటా 10 కోట్లే… ఫహాద్ పాత్రను మరీ జోకర్‌గా మార్చేయడం కేరళ మార్కెట్‌లో ఎదురుతన్నినట్టుంది… కన్నడ వసూళ్లు మరీ ఘోరం… 600 కోట్లలో మూడున్నర కోట్లు… బహుశా బెంగుళూరు, మన సరిహద్దు ప్రాంతాల థియేటర్లలో మనవాళ్లే చూసి ఉంటారు… తమిళంలోనే కాస్త నయం 31 కోట్లు…
అదే హిందీ చూసుకుంటే దుమ్మురేపుతోంది… తెలుగులో సహజంగానే ఎక్కువ వసూళ్లు ఉంటాయి కదా… తెలుగులో 198 కోట్ల వసూళ్లు కనిపిస్తుంటే, అదే హిందీలో 285 కోట్లు… (ఓవర్సీస్ 135 కోట్లు)… ఇప్పటికే హిందీ హీరోలు, బాలీవుడ్ క్రిటిక్స్, ఇండస్ట్రీ మన హీరోల మీద ఏడుస్తున్నారు… వాళ్ల సినిమాలు ఢమాల్ అంటుంటే మనవాళ్ల సినిమాలు బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి కదా…
సినిమా ఫుల్ రన్‌లో పుష్ప2 ఆరేడు వందల కోట్ల వసూళ్లను కేవలం హిందీలోనే సాధిస్తుందని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది… ఇది ఖచ్చితంగా తెలుగు సినిమా దేశవ్యాప్త మార్కెట్‌కు పెద్ద బూస్టప్… పాన్ ఇండియా మార్కెట్ విషయంలో తెలుగు సినిమా బాహుబలి దగ్గర నుంచీ స్థిరంగా పురోగమిస్తుండగా… తమిళం, కన్నడం, మలయాళం సినిమాలు వెనకబడిపోయాయి…
ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్‌లో కూడా హిందీలో డబ్ చేయబడిన ఇతర సౌత్ సినిమాలకన్నా తెలుగు సినిమాలే ఎక్కువ వ్యూస్ సాధిస్తున్నట్టు చెబుతున్నారు… వైస్ వర్సా… తమిళనాడు, కేరళ, కర్నాటకలోకన్నా హిందీ స్ట్రెయిట్ సినిమాలు తెలుగులో, ప్రత్యేకించి హైదరాబాద్ వంటి పొటెన్సీ మార్కెట్‌లో బాగానే ఆడతాయి…
ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే… మన సినిమాల్ని ఇతర సౌత్ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు (కొన్ని మినహాయింపులు)… మనం మాత్రం అందరివీ చూస్తాం, ఆదరిస్తాం… అదీ సంగతి…
చివరగా… పుష్ప ఫస్ట్ పార్ట్‌కు హిందీలో మంచి వసూళ్లు వచ్చినా తెలుగులో, ప్రత్యేకించి ఏపీలో బ్రేక్ ఈవెన్ రాలేదు… పుష్ప2 కూడా నైజాం, సీడెడ్ తప్ప మిగతా చోట్ల బ్రేక్ ఈవెన్ వస్తుందనేదీ డౌటే… అడ్డగోలు రేట్లకు అమ్మడం వల్ల ఫలితం… రెండోరోజు దారుణంగా వసూళ్లు పడిపోవడమే నిదర్శనం… ఈ శని, ఆదివారాలు దాటాక ఇక చూడాలి ఫలితం..? అడ్డగోలు సినిమా టికెట్ రేట్లు కూడా సినిమాకు నెగెటివే… అందుకే పలుచోట్ల తగ్గించారు…!!
Share this Article