.
మంచు కుటుంబంలో మంటలు… ఇప్పుడు వార్తాసాధనాలకు బాగా పనిపెట్టాయి… పోటాపోటీగా తండ్రీకొడుకులు మోహన్‌బాబు, మనోజ్ పోలీసు కేసులు పెట్టుకోవడం… అనేక మంది బౌన్సర్లు… హాస్పిటల్‌లో మనోజ్ చికిత్స, గాయాలు…
ముంబైలో ఉంటున్న మంచు లక్ష్మి వచ్చేసింది హుటాహుటిన… దుబాయ్ నుంచి విష్ణు వచ్చాడు… ఇంటి నుంచి మనోజ్‌ను, ఆయన భార్య మౌనికారెడ్డిని మోహన్‌బాబు బయటికి బలవంతంగా పంపించేశాడట… ఉద్రిక్తత… మొత్తానికి ఆ కుటుంబం బజారుకెక్కింది…
Ads
ఈ గొడవలకు సరైన కారణాలేమిటో గానీ, అందరూ ఏదేదో రాసేస్తున్నారు… బయటికి చెబుతున్నట్టు మోహన్‌బాబు యూనివర్శిటీ, డబ్బు, ఆస్తుల వ్యవహారాలు గాకుండా… విష్ణు, మనోజ్ భార్యలకు పొసగడం లేదనీ, అందుకే విష్ణు దుబాయ్ వెళ్లి అక్కడే ఉంటున్నాడని ఓ ప్రచారం…
విష్ణు, మనోజ్ ఒకే తల్లికి పుట్టిన పిల్లలు కారు… సవతి సోదరులు… మోహన్‌బాబుకు విద్యాదేవికి పుట్టిన పిల్లలు విష్ణు, లక్ష్మి… కాగా రెండో భార్య నిర్మలాదేవికి పుట్టిన కొడుకు మనోజ్… విష్ణు వైఎస్ కుటుంబానికి చెందిన వెరోనికారెడ్డిని పెళ్లి చేసుకున్నాడు… నలుగురు పిల్లలు… మనోజ్ భూమా నాగిరెడ్డి బిడ్డ మౌనికారెడ్డిని పెళ్లిచేసుకున్నాడు…
న్యూయార్క్ ఫిలిమ్ అకాడమీలో మనోజ్ యాక్టింగు కోర్సు, మౌనిక బ్రాడ్‌కాస్ట్ జర్నలిజం కోర్సు చదువుతున్నప్పుడు ఇద్దరికీ పరిచయం, తరువాత ప్రణయం… ఆమెకు అప్పటికే బెంగుళూరుకు చెందిన మరొకతనితో పెళ్లయింది, ఓ కొడుకు, తరువాత విడిపోయారు… మనోజ్‌కు కూడా అప్పటికే పెళ్లయి, విడిపోయారు కూడా… ఆ ఇద్దరూ డైవొర్సీలు పెళ్లిచేసుకున్నారు… అదీ వాళ్ల కథ…
ఈమధ్య మోహన్‌బాబు యూనివర్శిటీకి సంబంధించిన వివాదంలో తద్వారా కుటుంబ తగాదాల్లో తరచూ వినయ్ పేరు వినిపిస్తోంది… ఆయన ఎవరో కాదు, ఆ యూనివర్శిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ మహేశ్వరి… ఆ కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో ప్రస్తుతం వినయ్ మహేశ్వరి ఎంత చెబితే అంత… యూనివర్శిటీలో తనది ఓ కీలకమైన సొంత టీమ్ కూడా…
దైనిక్ భాస్కర్ సర్క్యులేషన్‌ను టాప్‌కు తీసుకుపోయిన క్రెడిట్ తనది… దేశంలోకెల్లా లార్జెస్ట్ సర్క్యులేటెడ్, వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డెయిలీ… తరువాత సాక్షి భారతీరెడ్డి ఆకర్షణీయమైన ప్యాకేజీ ఇచ్చి సాక్షిలోకి తీసుకొచ్చింది…
సాక్షిలో చేస్తున్నా సరే, అవసరమైతే పలు సంస్థలకు సమాంతరంగా కన్సల్టెంటుగా చేశాడని పేరు… పని రాక్షసుడు… ప్రతిభావంతుడు… భారతీరెడ్డి ద్వారానే మోహన్‌బాబు కుటుంబానికి పరిచయం అయ్యాడు… వాళ్ల యూనివర్శిటీ పగ్గాలు తీసుకున్నాడు… యూనివర్శిటీయే గాకుండా మూవీస్, ఇతర ఆర్థిక వ్యవహారాలూ తనే చూస్తుంటాడట… రకరకాల దేశాలు తిరుగుతూ ఉంటాడు… మోస్ట్ బిజీయెస్ట్ పర్సన్…
మరి యూనివర్శిటీ వ్యవహారాలకు సంబంధించి విష్ణుకు, మనోజ్‌కు నడుమ ఎక్కడ చిచ్చు రగిలిందో తెలియదు… చివరకు భౌతిక దాడుల ఆరోపణల దాకా వెళ్లిపోయింది వ్యవహారం… నిజమే, ఇదంతా కుటుంబ వ్యవహారం కదా అంటారా..? ముగ్గురు హీరోలు, ఒక హీరోయిన్ ఉన్న కుటుంబం… సో, ఏ చిన్న గొడవ తలెత్తినా అది ప్రస్తుత మీడియాకు వార్తే కదా… అందుకే ఇంత హడావుడి..!!
Share this Article