Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చైనా టౌన్ కథతో డాన్… దాని తెలుగు రీమేక్ ఈ యుగంధర్…

December 12, 2024 by M S R

.

యన్టీఆర్ – కె యస్ ఆర్ దాస్ కాంబినేషన్లో వచ్చిన మరో హిట్ సినిమా 1979 లో వచ్చిన ఈ యుగంధర్ సినిమా . 1978 లో వచ్చిన బ్లాక్ బస్టర్ డాన్ సినిమాకు రీమేక్ 1979 లో వచ్చిన మన యుగంధర్ సినిమా . హిందీలో అమితాబ్ , జీనత్ అమన్ హీరోయిన్లుగా నటించారు .

హిందీ డాన్ సినిమా కూడా 1969 లో వచ్చిన చైనా టౌన్ అనే సినిమా కధ ఆధారంగా తీయబడింది . చైనా టౌన్ సినిమాకు రీమేకే NTR నటించిన భలే తమ్ముడు సినిమా . యుగంధర్ & డాన్ సినిమాల కధాంశంతోనే 2009 లో ప్రభాస్ , అనుష్క , కృష్ణంరాజులు నటించిన బిల్లా సినిమా వచ్చింది .

Ads

యుగంధర్ సినిమాకు మరో విశేషం ఉంది . ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఏకైక ఎన్టీయార్ సినిమా . వేటూరి , సి నారాయణరెడ్డి , ఆత్రేయలు వ్రాయగా బాలసుబ్రమణ్యం , యస్ జానకిలు పాడిన పాటలు అన్నీ సూపర్ హిట్టయ్యాయి . ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవటానికి పాటలే ప్రధాన కారణం .

ముఖ్యంగా సి నారాయణరెడ్డి వ్రాసిన ఓరబ్బా ఏసుకున్నా కిళ్ళీ పాట వీర మాసు . మరో పాట నా కోసమే మీరొచ్చారు మీ కోసమే నేనొచ్చాను ఇంతకు నేనూ ఎవరో తెలుసా నా పేరే యుగంధర్ పాట యన్టీఆర్ అభిమానుల్ని థియేటర్లలో కూడా డాన్స్ వేయించింది . ఈ పాటను కూడా నారాయణరెడ్డి గారే వ్రాసారు . రెండు పాటల్లోనూ NTR ముప్పై ఏళ్ళ కుర్రోడి లాగానే డాన్సులు వేసారు .

జయమాలిని మీద చిత్రీకరించబడిన నా పరువం నీ కోసం పాట చాలా బాగుంటుంది . జయసుధ మీద చిత్రీకరించబడిన ఆత్రేయ గారి దా దా దా దా దాగేదా పాట కూడా హుషారుగా ఉంటుంది . యన్టీఆర్ మీద చిత్రీకరించబడిన వేటూరి వ్రాసిన జంతర్ మంతర్ నగరం పాట కూడా బాగా హిట్టయింది . మొత్తం మీద పాటలన్నీ వీర హిట్టే .

యన్టీఆర్ సెకండ్ ఇన్నింగ్సులో వచ్చిన ఏంగ్రీ యంగ్ హీరో , రివెంజ్ సినిమాలన్నీ కనక వర్షం కురిపించాయి . యన్టీఆర్ అభిమానుల్ని ఉర్రూతలూగించాయి . వాటిల్లో ఒకటి ఈ యుగంధర్ సినిమా . NTR , జయసుధ , లీల , ప్రభాకరరెడ్డి , సత్యనారాయణ , జగ్గయ్య , త్యాగరాజు , ప్రసాద్ బాబు , జయమాలిని ప్రభృతులు నటించారు .

21 సెంటర్లలో యాభై రోజులు ఆడింది . అందులో మా నరసరావుపేట సంధ్యా పేరడైజ్ కూడా ఉంది . గుంటూరు , విశాఖపట్నం , విజయవాడలలో వంద రోజులు ఆడింది . ఈ సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడని యన్టీఆర్ అభిమానులు చూడవచ్చు . Good entertainer and a musical hit .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు  …. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )


డాన్ సినిమా తరువాత అదే కథతో, కాస్త మార్పులతో దాదాపు అన్ని భాషల్లోనూ అనేక సినిమాలు… దానికి సీక్వెల్స్ కూడా… డాన్ సినిమాది ఇండియన్ స్క్రీన్ మీద ఓ చరిత్ర… డాన్‌గా అమితాబ్‌ను చూసిన తెలుగు ప్రేక్షకులకు ఈ యుగంధరుడు అంతగా నచ్చకపోవచ్చు గానీ… ఎన్టీయార్ అభిమానులకు వోకే… అందుకే పైసా వసూల్ సినిమా…


 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భేష్ నూకరాజు- వర్ష… ఆ స్కిట్‌తో కంటతడి పెట్టించారు…
  • ఎవరి సినిమాల్ని వాళ్లే చూసుకుంటున్నారు… ఒకటీఅరా మినహా…
  • రాఖీ- రక్తబంధం పట్ల తిరస్కృతి…! కేటీయార్, కేసీయార్‌‌కు బాగా మైనస్..!!
  • ఒరేయ్ మణీ… పెన్నులో శాయి ఐపాయె, నాలుగు చుక్కలు పోయరా…
  • మాస్ మసాలా దట్టించి వదిలారు… దెబ్బకు బాలయ్య సూపర్ బ్లాక్ బస్టర్…
  • ఏదో ప్రైవేటు సినిమా దందాకు… ప్రజలకెందుకు అవస్థలు నాయకా..?!
  • చంద్రబాబు పీ-4 అబ్రకదబ్ర పథకం బట్టలిప్పేసిన ఆంధ్రజ్యోతి…!!
  • మాతృ భాషపై తమిళుల తాదాత్మ్యం ముందు మనం నిలువలేము
  • ఛేంజ్… ఛేంజ్… ప్రపంచం మారిపోతోంది… పట్టలేనంత వేగంగా…
  • మేల్ సావిత్రి..! అప్పటి హీరోయిన్ల కలల ప్రేమికుడు… చివరకు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions