.
మగాడిగా పుట్టినందుకు…… (- శృంగవరపు రచన)
మగాడిగా పుట్టినందుకు…..
నోర్ముసుకుని ఉద్యోగం చేయాలి….
పాషన్ లు గీషన్ లు ఎన్ని ఉన్నా…
చివరకి స్థిర ఆదాయం ఉండాల్సిందే….
ఉంటే కుటుంబానికే ఖర్చు పెట్టాలి….
Ads
మంచివాడైన భర్తగా
కేసులు, గీసులు పెడితే తలవంచాలి….
ఇది ‘మంచివాడైన మగవాడి జీవితంలో’ ఒక భాగం….
దేన్ని లెక్క చేయని వాళ్ళకి సమస్యే లేదు…
కానీ కొంత సెన్సిబుల్ గా ఉండేవాళ్లకి exploiting partner వస్తే మాత్రం నరకమే…
Atul subhash…. బహుశా కేసులు, గీసులు ఏమున్నా లెక్క చేయను అనుకున్నా…. ఇంకా మనోవర్తి ఇచ్చే ఊసే లేదు… ఏదైనా కానీ… ఇలా అనుకునే వాడే అయితే కథ వేరేలా ఉండేది… బహుశా అప్పుడు అందరూ అతని భార్యనే సమర్థించేవారేమో!
కానీ ఒక్కసారి ఆలోచించండి…
డబ్బు… సంపాదించడం ఒక కాన్ఫిడెన్స్, ఒక పవర్ కూడా…
కానీ అది మన సంపాదనతో పక్క వారికి వచ్చి, మనకేమో భయాలు, అభద్రతలు, క్షోభలు ఉంటే….
నెలకు 40,000 మెయింటెనన్స్ ఇస్తున్నా ఇంకా లక్షల్లో కావాలనడం… తొమ్మిది కేసులు పెట్టడం…. బహుశా ‘మర్యాదస్తుల’ భయమే అనుకుంటా… ఎంతైనా demand చేయడానికి కారణం!
“It is better for me to end my life as the money I’m making is only making my enemies stronger. This cycle keeps continuing’ అని సుభాష్ తన సూసైడ్ నోట్ లో రాశాడు!!
పాపం న్యాయం కోసం ఎక్కడికి వెళ్తాడు! అతని తల్లిదండ్రుల ఇంటిని కూడా ఆమెకే ఇవ్వమంటే ఏం చేస్తాడు?
ఇంతోటి దానికే చనిపోయాడా అనుకోవచ్చు….
Frankly speaking, జీవితంలో ఫ్రెష్ స్టార్ట్ కి అవకాశమే లేకుండా చేస్తే…. ఆ జీవితం మనం ఊహించలేము!
Of course, అతను దీనిపై fight చేసి ఉండొచ్చు…
కానీ ఒక మాములు మనిషిని 9 కేసులు ఎంత భయపెడతాయి….! సంపాదించి ప్రతీకారం తీర్చుకునే వ్యక్తికి ఇవ్వాల్సి రావడం…. ఇవి అంత ఈజీ కాదు!
మగ పుట్టుక పుట్టినందుకు….
వారు గంభీరంగానే ఉండాలి… అలానే బాధలను దాచుకోవాలి… ఎవరికీ చెప్పుకోకూడదు…
కొన్నిసార్లు లెక్క చేయని మొండితనమే మేలు, మంచితనం కంటే కూడా!
మంచి మగాళ్ళు.. మీకు జోహార్లు!!!
#rachanasrungavarapu #AtulSubhash #JusticeForAtul
Share this Article