.
కొన్ని హఠాత్తుగా తెర మీదకు వస్తాయి… లేదా తీసుకొస్తారు… డైవర్షన్ కోసం… కొన్ని అనుకోకుండా వచ్చేసి మిగతా అంశాలను తెర వెనక్కి నెట్టేస్తాయి…
నేను చాకలి ఐలమ్మను అని భీషణంగా ప్రకటించిన తెలుగుదేశం గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గుర్తుంది కదా… భలే సామాజిక చైతన్యం ఉందని చాలామంది ప్రశంసించారు, ముచ్చట కూడా అభినందించింది… ఆమె పుట్టింటి కులం, మెట్టింటి కులం ప్రాధాన్యాంశాలు కావు ఇక్కడ… కానీ… ఓ వీడియో ఎన్టీవీ ప్రసారం చేసింది… అదీ వార్తాంశం…
Ads
ఎవరో ఇస్కాన్ వాళ్లు రోడ్ల మీద భగవద్గీత పుస్తకాలు అమ్ముతున్నారట… ఈమెకు బాగా కోపం వచ్చేసింది… ఎవరి అనుమతి తీసుకుని అమ్ముతున్నాురు… అని నిలదీసిందట… ఇలా చేస్తే బాగుండదు సుమీ అని హెచ్చరించిందట…
ఆమెకు ఎందుకు కోపమొచ్చింది..? అనేకానేక ఇష్యూస్ ఉన్నాయి కదా, ఇదే ఎందుకు ఆమెకు కోపం తెప్పించింది?.. ఏమో తెలియదు గానీ… ఆ వార్త చూస్తుంటే హఠాత్తుగా ఎందుకోగానీ ఇస్కాన్ సెంటర్లపై బంగ్లాదేశ్ పోలీసులు అరాచకం గుర్తొచ్చింది…
కొందరిని అరెస్టు చేశారు, కేసులు పెట్టారు… సెంటర్లు మూసేస్తున్నారు… హిందూయిజంపై దారుణమైన దాడి జరుగుతోంది బంగ్లాదేశ్‌లో…! మరి ఆంధ్రప్రదేశ్ కూడా అంతేనా..? అదేమైనా మతవిద్వేషమా..? ఈమెకు ఎందుకు కోపమొచ్చినట్టు..?
అసలే జాతీయ సనాతన ధర్మపరిరక్షక పవన కల్యాణుడు పాలిస్తున్న నేల మీద… విశ్వమత సహనుడు చంద్రబాబు పాలిస్తున్న నేల మీద… ఈమె చర్యకు అర్థమేమిటి…? పైగా హిందూ పరిరక్షక బీజేపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి…
ఈ చర్యపై ఒక్కడూ మాట్లాడలేదు… ఈలోపు అల్లు అర్జున్ అరెస్టు గట్రా వార్తల్లోకొచ్చి ఈమె ఇస్కాన్ వ్యతిరేక చర్య పెద్దగా వార్తల్లోకి రాలేదు… బన్నీ అరెస్టు లేకుండా ఉంటే ఎంతో కొంత ఈమె హిందూ వ్యతిరేక చర్య కాస్త వార్తల్లోకి వచ్చి ఉండేదేమో…
గల్లా అలియాస్ చాకలి ఐలమ్మ ఇస్కాన్ వ్యతిరేక ధోరణికి కారణాలేమిటో తెలిస్తే బాగుండు… జనానికి చెబితే బాగుండు… ఎన్టీవీలో వార్త వచ్చాక ఏదో కవరింగు పోస్టు కనిపించింది… అబ్చే, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఏదైనా స్టాల్ పెట్టి అమ్ముకొండి అనేదే ఆమె భావన అట…
సర్, చంద్రబాబు సార్ గారూ… మీరు బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని దయతో లీడ్ చేస్తున్నారు… సనాతన ధర్మరక్షకుడు పవన్ కల్యాణుడు మీ అధికార భాగస్వామి… ఇదేమీ జగన్ ప్రభుత్వం కాదు… మరి మీ ఎమ్మెల్యే ధోరణికి అర్థమేమిటి మాస్టారూ… మీకేమైనా అర్థమైందా..? లేక మేమింతే అంటారా..?!
Share this Article