Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వేటగాడు, ఈ ఆటగాడి దెబ్బకు ఆ ఇద్దరి జోడీ సెట్టయిపోయింది…

December 14, 2024 by M S R

.

వేటగాడు తర్వాత ఆటగాడు . వేటగాడుతో ఆరంభమైన యన్టీఆర్- శ్రీదేవి జోడి ఈ ఆటగాడు సినిమాతో పాకాన పడింది . జోడీ సెట్టయిపోయింది . ఈ సినిమా తర్వాత మరో తొమ్మిది , పది సినిమాల్లో జత కట్టారు . యన్టీఆర్ సింగర్ కం గిటారిస్ట్ . చాలా ఎనర్జిటిక్ గా , జోష్ గా నటించారు . ఏకో నారాయణా పాటలో శ్రీదేవి , జయమాలినిలతో పోటాపోటీగా డాన్స్ చేసారు . ఈ సినిమాలో యన్టీఆర్ కాస్ట్యూమ్స్ చాలా అందంగా ఉంటాయి .

సాధారణంగా రివెంజ్ సినిమాల్లో రివెంజ్ హీరోదిగా ఉంటుంది . ఈ సినిమాలో రివెంజ్ హీరోయినిది . మధ్యలో కామన్ రివెంజ్ అవుతుంది . రకరకాల మారువేషాలతో కామన్ శత్రువులను తుదముట్టించడంతో సినిమా ముగుస్తుంది .

Ads

సత్యానంద్ డైలాగులు బాగుంటాయి . తాతినేని రామారావు దర్శకుడు . ప్రత్యేకంగా మెచ్చుకోవలసింది నృత్య దర్శకుడు హీరాలాల్ని . డాన్సులను అన్నింటినీ బాగా కంపోజ్ చేసారు . యన్టీఆర్ చేత బాగా డాన్సించారు .
ఇంక ఘట్టిగా మెచ్చుకోవలసింది పాటలన్నీ వ్రాసిన వేటూరి వారిని , సంగీత దర్శకుడు చక్రవర్తిని .

గుద్దుతా నీయవ్వ గుద్దుతా అనే లిరిక్ కూడా ఉంది . యన్టీఆర్ , శ్రీదేవిలు మారువేషాల్లో పాడుతారు . డాన్స్ కూడా ఘట్టిగానే వేస్తారు . జిల్ జిల్ జిలేబి పాటతో క్లబ్ డాన్సులో యన్టీఆర్ , శ్రీదేవిలు డాన్స్ అదరకొడతారు .
ఏకో నారాయణా ఏలుకోరా మోహనా పాట కూడా యన్టీఆర్ , శ్రీదేవి , జయమాలిని అదరకొడతారు . మరో రెండు పాటలు చిలకమ్మ గూటిలో చోటుందిరో , చీమ కుట్టిందా చిమచిమలాడిందా లలో కూడా ఇద్దరూ దడదడలాడించేస్తారు . ఆరో పాట నీ చూపు సుడిగాలిరా కూడా బాగుంటుంది . డాన్సరుగా నటించిన నటి పేరు లీల అనుకుంటాను .

1980 ఏప్రిల్ 24 న రిలీజయిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయింది . యన్టీఆర్ మూవీ లెవెల్లో సక్సెస్ కాలేదు . (నిజానికి యావరేజీ అనే చెప్పాలి…) ఫుల్ మాస్ మూవీ . ఇతర ప్రధాన పాత్రల్లో సత్యనారాయణ , రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య , జగ్గయ్య , మిక్కిలినేని , ప్రభాకరరెడ్డి , పద్మనాభం , రావి కొండలరావు , పుష్పలత ప్రభృతులు నటించారు .

వెంకటేశ్వర మూవీ క్రియేషన్స్ బేనరుపై జి రాజేంద్రప్రసాద్ నిర్మించారు . కధ యం డి సుందరం అని టైటిల్సులో వేసారు . బహుశా కన్నడ రైటరేమో ! ఈ సినిమాకు మాతృక ఏదయినా కన్నడ సినిమా అయి ఉండవచ్చు !

వీర మాస్ ఎంటర్టయినర్ . సినిమా మొత్తం మీద యన్టీఆర్ నాలుగయిదు మారువేషాలు వేస్తారు . ఆయనతో పాటు శ్రీదేవి . సినిమా , పాటలు అన్నీ యూట్యూబులో ఉన్నాయి .

యన్టీఆర్ , శ్రీదేవి అభిమానులు , రాం గోపాల్ వర్మ చూసి ఉండకపోతే తప్పక చూడతగ్గ సినిమా . వీర మాస్ ఎంటర్టయినింగ్ మ్యూజికల్ మూవీ . యూట్యూబులో ఉన్న వీడియోల క్వాలిటీ కూడా బాగుంది .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు …….. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )


గుద్దుతా నీయవ్వ గుద్దుతా టైపు ఎన్టీయార్ పాటల ఉత్తమాభిరుచి, పరమాద్భుత సాహిత్యం గురించి మరెప్పుడైనా చెప్పుకుందాం….


 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కాదు… ఆమె మరో షర్మిల కాదు… రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం ఉంటుంది…
  • మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్… జనాగ్రహం బద్దలు..!
  • … బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ సైద్ధాంతిక గందరగోళం…
  • ఆనందశాస్త్రం..! science of happiness … సిలబస్‌లో ఉండాల్సిన సబ్జెక్టు..!
  • ఆ దరిద్రుడి పాత్రలో మోహన్‌లాల్… ఆ డార్క్ షేడ్స్ కథ తెలుసా మీకు..?!
  • ’’నా పిల్లల్ని అమెరికాలో పెంచుతున్నానా..? ఇండియాలోనా..?’’
  • అసలు కన్సల్టెన్సీ అనగానేమి..? నిజానికి అవి ఏమి చేయును..?
  • సొంత బిడ్డపై డర్టీ క్యాంపెయిన్… ఎందుకు కేసీయార్ సైలెంట్..?!
  • ఇచ్చట అన్ని పళ్లూ సరసమైన ధరలకు ఊడపీకబడును..!
  • Cancer Vaccine..! ఒరే అయ్యా… కాస్త ఆగండ్రా బాబూ… కథ వేరు…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions