.
అక్కడ బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి… హసీనాను తరిమేసి, కొత్తగా ఓ నయానియంత ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ దాడులు అధికమయ్యాయి…
ఏ హిందూజాతి తమకు ఏ పాకిస్థాన్ నుంచి విముక్తి ప్రసాదించిందో… అదే పాకిస్థాన్‌తో మళ్లీ కలిసిపోయి మొత్తం దేశం నుంచే హిందువుల్ని తరిమేయాలన్నంత కసిగా దాడులు సాగుతున్నాయి…
Ads
ఇస్కాన్ బాధ్యుడిని అరెస్టు చేశారు, మరొకరి మీద కేసులు పెట్టారు… టార్గెట్ చేశారు… ఈ నేపథ్యంలో మన ఏపీలో, మన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే.,. తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే… గల్లా మాధవి భగవద్గీత ప్రతులు అమ్ముకునే ఇస్కాన్ ప్రచారకులపై చిర్రుబుర్రులాడింది…
ఇలా బజార్లలో పుస్తకాలు అమ్మితే సహించబోనని ఉరిమింది… ఫాఫం, ఒక్కసారిగా ఇస్కాన్ కార్యకర్తలు షాక్… పుష్పరాజ్ అరెస్టు హడావుడి, వేడి వార్తల్లో పడి ఎవరూ దీన్ని పట్టించుకోలేదు… ఇదేమిటమ్మా అని ముచ్చట కూడా ఓ కథనం పబ్లిష్ చేసి, అయ్యా, సనాతన పరిరక్షక నాయకుడా పవన్ కల్యాణుడా ఇది విన్నావా అనడిగింది…
మరి పవన్ కల్యాణ్ చంద్రబాబు సహపాలకుడు కదా… బీజేపీతో పొత్తుంది కదా… తరుావత ఏమైందో ఏమో తెలియదు గానీ, రెండు ట్వీట్లు కనిపించాయి ఆమె ఎక్స్ ఖాతాలో…
‘‘ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఎలాంటి విషయాన్నైనా తాను ప్రశ్నిస్తానని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి స్పష్టం చేశారు. గుంటూరు నగరంలో రెండు రోజుల క్రితం భగవద్గీత ప్రతులు పంపిణీ చేస్తున్న వారిని తాను అడ్డుకున్నట్లు కొంతమంది తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టాల్స్ ఏర్పాటు చేస్తానని అక్కడ నుండి విక్రయించుకోవచ్చు అని మాత్రమే సూచించడం జరిగినది…’’
https://x.com/galla_madhavi/status/1867862753756766233?s=46
ఇదొక ట్వీట్… సర్దుబాటు, దిద్దుబాటు సరే గానీ… అబ్బే, నేను కృష్ణ భక్తురాలినే అని చెప్పడానికి నొసట ఓ పెద్ద నామం… మెడలో ఓం నమో నారాయణాయ నమహ అనే శాలువా… అంతేకాదు…
‘‘కుంచనపల్లిలోని “హరే కృష్ణ గోకుల క్షేత్రం” నందు జరిగిన లక్ష్మీనరసింహస్వామి హోమానికి హాజరయ్యి, రాధాకృష్ణుల స్వామివారిని దర్శించుకొని అనంతరం భక్తులకు ఉచితంగా భగవద్గీతను పంపిణీ చేసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్లా మాధవి గారు…’’ ఇది మరో ట్వీట్…
https://x.com/galla_madhavi/status/1867810017971515722?s=46
దిద్దుబాటు మరీ ఇంత సినిమాటిక్‌గా ఉండాల్సిన అవసరం లేదమ్మా… కొన్ని వివాదాల్లోకి వెళ్లకపోవడమే మంచిది… తత్వం బోధపడింది… ఏదో ఓ దిద్దుబాటు ట్వీట్ చాలు కదా…ైై
Share this Article