.
యావత్ ప్రజానీకానికి . పరిపాలకులకు, దైవాంశ సంభూతులైన సెలబ్రిటీలకు , మానవాతీతులైన లెజెండ్స్ కి, గోల్డెన్ స్పూన్ తో పుట్టిన బడా బాబులకు, భూమ్మీదకి నాలుగు వందల ఏళ్ళు బతికే సత్తా ఉన్న పొలిటీషియన్స్ కి , వితండ వాదులకు , చాదస్తపు ఛాందస వాదులకు .. నా వినయపూర్వక , ప్రాధేయ భరిత , ఆవేదనాంశ, నివేదనా లేఖ ఇది
ఇందుమూలంగా యావన్మందికి తెలియ జేయునది ఏమనగా ..
Ads
అయ్యలారా .. అమ్మలారా ? కొద్దిరోజులుగా నేను నేర్చుకున్న నీతి వాక్యాలు ఇవి
1.సంధ్య దియేటర్ తొక్కిసలాటకు ఆ హీరోగారికి అస్సలు సంబంధం లేదు ..
2.రేవతి చనిపోవడానికి , ఆమె బిడ్డ చావు బతుకుల్లో ఉండటానికి వాళ్ళ స్వయంకృతాపరాధమే
3.అలాగే నాలుగు రోజుల తర్వాత రాకుండా తొలిరోజు తమ అభిమాన హీరో సినిమా చూడటానికి తొలిరోజు రావడమే వాళ్ళ తప్పు
4.అవతల ఆరోపణలు ఎదుర్కుంటున్నది పెద్ద హీరో కాబట్టి ఆయన్ని ఎవరూ ప్రశ్నించకూడదు .. ఒకవేళ ప్రశ్నిస్తే మన ఇంట్లో బిడ్డలతో సహా అందర్నీ తిడుతూ వారి అభిమానులు మనల్ని బెదిరిస్తారు
5.హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య ఉన్న బాబు ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి అయ్యో పాపం .. ఆ బాబుకి న్యాయం చేయండి అనకూడదు
6.పేదోడికో న్యాయం .. పెద్దోడికి ఒక న్యాయమా ? అని అనకూడదు .. ఇది నేరం
7.గత వందేళ్లలో జరిగిన తొక్కిసలాటలు, వారికి కారణమైన వారి మీద పోస్టులు పెట్టి అప్పుడు ఈ ఘటనని ప్రస్తావించాలి ..
8.వీలైతే హీరో సినిమాని కొనియాడుతూ పోస్టులు పెట్టాలి .. అంతేగాని హీరోని ప్రశ్నించకూడదు
అదన్నమాట .. ఒక పేద కుటుంబానికి న్యాయం చేయండి అని ప్రశ్నించినందుకు రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి .. కులాలు , ప్రాంతాలు అన్నీ బయటకు వచ్చాయి .. ఇవన్నీ పరిశీలించిన పిదప, తదుపరి, పిమ్మట నాకొక ఆలోచన వచ్చింది .. వాటిని అమలు చేయడం వీలవుతుందని సూచించగలరు
1.కొత్త సినిమా రిలీజైనప్పుడు హీరో థియేటర్ కి వచ్చినపుడు ప్రేక్షకులు ఎవరూ ఆయా థియేటర్లకు వెళ్లకుండా నియంత్రించాలి .. ఎందుకంటే తొక్కిసలాటలు జరిగి వాళ్ళని వాళ్లే తొక్కుకుంటూ చచ్చిపోకుండా జనాన్ని కంట్రోల్ చేయాలి. ప్రభుత్వాలే బాధ్యత వహించాలి.
2. సినిమాల పబ్లిసిటీ కోసం పెట్టే ఆడియో ఫంక్షన్లు , ప్రెస్ రిలీజ్ ఫంక్షన్లు , సక్సెస్ మెట్లు లాంటివి పెట్టినపుడు ఆయా కార్యక్రమాలకు తమ అభిమాన హీరోని చూడాలని ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చే జనాన్ని రానీయకుండా అడ్డుకోవాలి .. ఎందుకంటే ఆ ఫంక్షన్లలో వాళ్లే తొక్కుకుంటూ వాళ్ళని వాళ్ళే చంపేసుకుంటున్నారు కాబట్టి. అదీ ప్రభుత్వ బాధ్యతే.
3.కొత్త షాపింగ్ మాల్స్ లాంటివి ఓపెనింగులకు లక్షల రూపాయల డబ్బు తీసుకుని ఓపెనింగ్ చేయడానికి హీరో లేదా హీరోయిన్ల వచ్చినపుడు ఆయా హీరో , హీరోయిన్ మీద అభిమానంతో తరలి వచ్చే అభిమానుల్ని ఆ షాప్ ఓపెనింగ్ దరిదాపుల్లోకి రాకుండా బారికేడ్లు అడ్డుపెట్టి , ముళ్ళకంచెలు వేసి , టియర్ గ్యాస్ ప్రయోగించి అడ్డుకోవాలి. అది పోలీసు యంత్రాంగం బాధ్యత.
4.రాజకీయ నాయకులు రోడ్ షోలు చేసినప్పుడు తమ అభిమాన నాయకుడిని చూడటానికి కార్యకర్తలను రోడ్డు మీదికి రానీయకుండా లాఠీ ఛార్జ్ చేయాలి .. వీలైతే గృహ నిర్బంధం చేయాలి
5.రాజకీయ నాయకులు ఎన్నికల్లో తమ గెలుపు కోసం తమ ప్రాభవం కోసం , తాము అందలం ఎక్కడం కోసం బహిరంగ సభలు పెట్టినపుడు ఆయా బహిరంగ సభ ప్రాంగణానికి ప్రజలు అనబడు అమాయకుల్ని అస్సలు వెళ్లకుండా ఆంక్షలు పెట్టాలి .. ఒకవేళ ఆ సభలకు వెళ్లే ప్రయత్నం చేసినా వారి పై దేశద్రోహం కేసులు పెట్టాలి.. ఎందుకంటే ఆయా సభలకు వెళ్లి వాళ్ళని వాళ్లే తొక్కేసుకుని ప్రాణాలు పోగొట్టుకుని ఆ నింద ఆయా రాజకీయ నాయకుడి మీద వేసేస్తారు అందుకనే…
6.పుష్కరాలు లాంటివి జరిగినపుడు .. అక్కడ పుణ్యస్నానాలు కోసం ముఖ్యమంత్రులు , మంత్రులు , సెలెబ్రిటీలు వచ్చినపు నదుల దగ్గరకు భక్తుల్ని అస్సలు పంపకూడదు . ఎందుకంటే వాళ్ళని వాళ్ళే తొక్కేసుకుని వాళ్ళని వాళ్ళే చంపేస్తుంది ఆ చావులకు అమాయకులైన రాజకీయ నాయకులే కారణమని తప్పుడు నిందలు వేస్తారు కాబట్టి…
ఈ విధంగా .. చేసినట్టే హీరోలు ఎన్ని థియేటర్లకు అయినా స్వేచ్ఛగా వెళ్లొచ్చు .. ఎన్ని షాపింగ్ మాల్స్ అయినా ఓపెనింగులు చేసుకోవచ్చు . రాజకీయ నాయకులు ఎన్ని రోడ్ షోలు, బహిరంగ సభలు సక్సెస్ ఫుల్ గా పెట్టుకోవచ్చు .. అస్సలు తొక్కిసలాటలు జరగవు .. అభిమానులు , కార్యకర్తలు అనబడే ప్రజానీకం మీద యాక్షన్ తీసుకుంటే ..తొక్కిసలాటలు జరగవు .. ప్రాణాలు పోవు.. హీరోలు , రాజకీయ నాయకుల మీద మీద కేసులు రిజిస్టర్ కావు .. వాళ్ళు జైలుకి వెళ్లి 11 గంటలపాటు బ్యారక్ లో నాటకం అనుభవించాల్సిన పని ఉండదు .. మాలాంటి దుర్మార్గులు సోషల్ మీడియాలో ఇదేమి అన్యాయం అని చనిపోయిన వాళ్ళ తరఫున ప్రశ్నిస్తే మమ్మల్ని చంపేస్తామని ఆయా హీరోల ఫ్యాన్స్ బెదిరించాల్సిన పని లేదు.
…….ఈ విషయంపై అందరూ ఆలోచించి అమలు చేయాలని పాదాభివందనం చేస్తూ చనిపోయిన రేవతి ఆత్మ సాక్షిగా , రాజకీయ నాయకుల మీటింగుల్లో చనిపోయిన కార్యకర్తల ఆత్మల తరఫున ప్రాధేయపడుతున్నాను.. …. ఇట్లు అశోక్ వేములపల్లి…
.
ఎహె, ఇవన్నీ దేనికి..? ఓ జాతీయ అవార్డు గ్రహీత లేదా వంద కోట్ల సినిమా కలెక్షన్ల సాధించిన ఎవడూ ఈ దేశ చట్టాల పరిధిలోకి రారు అని ఓ రాజ్యాంగసవరణ చేసేస్తే సరి,.. అసలు ఎవడ్రా మీరంతా…?
ఇదుగో అదే చెబుతున్నాడు… మెదడు అరికాళ్లలో ఉన్న వర్మ అనే దిక్కుమాలిన ఓ ప్రబుద్ధుడు… ఇలా…
@alluarjun
the BIGGEST STAR of INDIA, a resident of TELANGANA STATE has given the GREATEST GIFT to the TELANGANA STATE by giving the BIGGEST HIT in the ENTIRE HISTORY of iNDIAN CINEMA and the TELANGANA STATE in turn gave him the BIGGEST RETURN GIFT by sending him to JAIL…
Share this Article