ఈటీవీలో అద్భుతమైన అభిరుచితో జబర్దస్త్ వంటి ప్రోగ్రాములు చేసే మల్లెమాల ఎంటర్టైన్మెంట్ వాళ్లకు మహా గీర… ఎంత అంటే, ఒప్పందాల్లో ఆర్టిస్టులను ఇరికించేసి, వెళ్తానంటే పది లక్షలు కక్కి బయటికిపో అంటారు… ఏళ్లపాటు ఇతర చానెళ్ల వైపు కన్నెత్తి చూడటానికి కూడా అంగీకరించేవాళ్లు కాదు… మేం కట్ చేస్తే కట్, మేం ఎంకరేజ్ చేస్తే హైప్ అన్నట్టుగా ఉంటుంది ధోరణి… ఎక్కడ తేడా కొట్టిందో గానీ, ఎంతోకాలంగా ఈటీవీనే పట్టుకుని ఏడుస్తున్న సుడిగాలి సుధీర్‌కు కత్తెర వేశారు అప్పట్లో… ఈటీవీలో అకేషనల్ స్పెషల్ ప్రోగ్రామ్స్ సాధారణంగా సుధీర్ లేకుండా ఉండవు… కానీ ఏదో పండుగ ప్రోగ్రాం నుంచి కావాలనే అవాయిడ్ చేశారు… ప్రదీప్‌కు డప్పు కొట్టారు… అది కాస్తా తుస్సుమంది… అంతేకాదు, సుధీర్ వంటి లాంగ్ స్టాండింగ్ ఆర్టిస్టుల నీడ కూడా పడకుండా ప్రతి ఆదివారం మధ్యాహ్నం శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు… పరమ నాసిరకం… ‘నాకు తెలియకుండా కొత్తగా కంపెనీ పెట్టారా’ అని సుధీరే తన స్కిట్లో వ్యంగ్యాన్ని విసిరాడు కూడా… ఈ కంపెనీ ఎంత ఘోరంగా ఫ్లాప్ అంటే… టీఆర్పీ రేటింగుల్లో వెతకగా వెతకగా ఎక్కడో 3, 3.5 రేటింగ్స్ దగ్గర కొట్టుమిట్టాడుతూ కనిపిస్తుంది…
చాలా రోజులైంది కదా… ఈ అకేషనల్ స్పెషల్స్ ప్రసారం చేయక… ఇప్పుడు హోళీ వచ్చింది, దీన్ని వాడుకుని యాడ్స్ కుమ్మేద్దామని మూడు తెలుగు చానెళ్లూ ప్లాన్ చేశాయి… (సహజంగానే జెమిని వాడికి ఏ సోయీ లేదు)… ఈటీవీ వాడికి కళ్లు తెరుచుకుని, ఇక తప్పనిసరై మళ్లీ సుధీర్ ప్రధాన యాంకర్‌గా ఓ ప్రోగ్రాం షూట్ చేశాడు… నో ప్రదీప్, నో హైపర్ ఆది ఎట్సెట్రా… ఎప్పటిలాగే వచ్చే ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రసారం… రెగ్యులరే, కానీ దానికి రంగుపడుద్ది అని ఓ పేరు పెట్టి, కాస్త హైప్ క్రియేట్ చేసి, స్పెషల్ ప్రోగ్రాం అన్నట్టుగా కలర్ ఇచ్చారు… అంటే పాత సరుకే, కొత్త రంగులు పూశారు… మరి డబ్బులు కావాలి కదా… రంగ్ దే అనే నితిన్ సినిమా రిలీజ్ అయ్యింది కదా… నితిన్‌ను పిలిచి, ఇదే ప్రోగ్రాంలో ప్రమోషన్ కూడా చేసేశారు… శుభం… ఇప్పుడు సినిమా వాళ్లు వావ్, క్యాష్, జబర్దస్త్ వంటి రెగ్యులర్ షోలలోకి కూడా వచ్చేస్తున్నారు కదా ప్రమోషన్స్ కోసం… అదేలెండి… ఇవోరకం యాడ్స్… అదేరోజు నితిన్ మరో స్పెషల్ షోలో కనిపిస్తాడు… తప్పదు, సినిమా ప్రమోషన్ కదా…
Ads
జీ తెలుగువాడు ‘రంగ్ దే ప్రేమ’ అని ఓ స్పెషల్ చేస్తున్నాడు… సేమ్, ఆదివారమే ఉంటుంది అది… కాకపోతే మాటీవీ, ఈటీవీ వాళ్ల టైముల్లో గాకుండా కాస్త బెటర్ రేటింగ్స్ కోసం సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం చేస్తాడు… సేమ్, ఆ ప్రోగ్రాం పేరే రంగ్‌దే ప్రేమ… అంటే అర్థమైంది కదా… పక్కా ప్రమోషన్ ప్రోగ్రాం… అంటే ఇదోరకం కమర్షియల్ యాడ్… ప్లస్ పండుగ స్పెషల్… ఏముందీ..? తమ టీవీ సీరియళ్లలో నటించే పలువురు ఆర్టిస్టులను పిలిచి, ఓ ఇద్దరు యాంకర్లను పెట్టి ఓ షో నడిపించడమే… ఇదీ అంతే… రంగులు పూసుకోవడాలు గట్రా ఏమీ లేవు… ఓన్లీ స్టూడియోలోనే… ఇందులో కూడా నితిన్ ఉంటాడు… ఆమధ్య త్రినయని సీరియల్ హీరోయిన్ అశిక పడుకోన్ పెళ్లయింది కదా… ఇద్దరినీ పిలిచి కాసేపు వాళ్లతో షో రన్ చేశారు… మొత్తానికి ఏదో కథ నడిపించేశారు… శుభం…
ఈటీవీ, జీటీవీకన్నా బాగా రీచ్ ఉండి… కాస్త ప్రమోషన్, రేటింగ్స్ టెక్నిక్స్ బాగా తెలిసిన స్టార్ మా వాడు ఊరుకోడు కదా… హోలీ ప్రోగ్రాం అంటున్నాడు… స్పెషల్ అంటున్నాడు… సేమ్, ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఒకటిన్నరకు వస్తుంది కదా… అదే కామెడీ స్టార్స్… సేమ్, బిగ్‌బాస్ స్టార్సే తనకు దిక్కు… ప్రత్యేకించి అదే అవినాష్, అదే అరియానా… వాళ్ల చుట్టే తిరుగుతూ ఉంటుంది ఆ ప్రోగ్రాం… ఇది కూడా సేమ్ శ్రీదేవి డ్రామా కంపెనీలాగే తన్నేసింది… రేటింగ్స్‌లో ఎక్కడో కొట్టుకుపోయింది… ఈసారి ప్రొమోలో ఎందుకో మరి అవినాష్, అరియానాల హంగామా కనిపించలేదు… నో, నో, ఇందులో నితిన్ లేడు… ఐనా హోంకారన్నయ్య ఉన్నాక నితిన్ ఆనడు కదా… రెగ్యులర్ షోకే కాస్త రంగుపూసి స్పెషల్ అనేస్తున్నారు… వోకే… చూద్దాం, ఈ రంగుల పోటీలో ఏ చానెల్ గెలుస్తుందో కొత్త బార్క్ రేటింగ్స్ వచ్చాక మాట్లాడుకుందాం…
Share this Article