.
కథో నిజమో తెలీయదు కానీ చదవగానే బాధ వేసింది…
ఒకమ్మాయి అబ్బాయి Facebook లో పరిచయమయ్యారు. Hi తో మొదలై అన్ని విషయాలూ పంచుకునే స్థాయికి close friends అయ్యారు. అబ్బాయి తన photo లు upload చేసేవాడు. కానీ అమ్మాయి photo ఎప్పుడూ అడగలేదు. So ఆ అమ్మాయి ఎలా ఉంటుందో అబ్బాయికి తెలీదు. ఒకరి వివరాలు ఒకరికి మాత్రం తెలుసు. అలా సరదాగా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి.
ఒకరోజు అమ్మాయి చెప్పింది అబ్బాయితో..
Ads
ప్రియ : హే… నీకో good news.
నాని : ఔనా… ఏంటదీ…
ప్రియ: నాకు marriage fix ఐంది.
నాని : ఔనా… హే… congratulations… ఇన్నాళ్ళూ నేను భరించిన నస ఇకనుంచి మీ ఆయన భరిస్తాడన్నమాట… సరేలే… ఇంతకీ treat ఇస్తున్నావా లేదా….!
ప్రియ : ఒరేయ్ సచ్చినోడా…. అంటే నాది నసా… treat లేదు తొక్కలేదూ పో…
నాని : hey…. sorry, sorry just joking ya…
నువ్వు నిజంగా బంగారానివి…
నీకోటి చెప్పనా… నీకు కాబేయే ఆయన నిజంగా లక్కీ… ఎందుకంటే , వంద జన్మల పుణ్యం చేసుకుంటేనే గానీ నీలాంటి అమ్మాయి దొరకదు. He is really Lucky…
ప్రియ : ఒరేయ్…… ఆపు ఇంక . ముందేమో తిట్టి , ఇప్పుడు పొగుడుతున్నావా… సచ్చినోడా…
నాని : హా…….. నిన్ను తిట్టడమా… నన్ను నేను ఎలా తిట్టుకుంటాను బంగారం…. ఊరికే….. సరదాకి.
సరేలే…. నువ్వేం treat ఇవ్వద్దు. ఈ ఆనందంలో నేనే నీకు treat ఇస్తా ok నా….
ప్రియ : పోరా…. నీ treat నాకేం అక్కర్లేదులే bye. రేపు మాట్లాడదాం…
నాని : Hey….. please. Wait wait…. sorry అని చెప్పానుగా… please.
ప్రియ : అయ్యో…. దానిక్కాదు. నాకు headache గా ఉంది , morning chat చేస్తా…. bye.
నాని : ok ok… bye… but don’t feel. Good night. అని ఆ అబ్బాయి chat off అయ్యాడు.
Same time Chat off ఐన ఆ అమ్మాయికి మనసంతా ఆందోళనలో కూరుకుపోయింది.
తను అనుకున్నదొక్కటి , ఐయిందొక్కటి..
తను వాడి నుండి ఏదో Reaction ని ఊహించి ఇలా పెళ్లి కుదిరిందని అబద్ధం చెప్పింది. “ఇప్పుడైనా బయటపడకపోతాడా” అనుకుంది.
“నేను పెళ్ళి అని చెప్పగానే Feel ఐ నామీద వాడికున్న ప్రేమని చెప్పేస్తాడు అనుకుంటే… congratulations అంటాడేంటి…..! ”
“అంటే ఇన్నాళ్ళూ నేనే అనవసరంగా ఎక్కువగా ఊహించుకుంటున్నానా వాడి గురించి”
తను చూసుకోలేదుగానీ… తలదిండు చాలా భాగం తడిచిపోయి ఉంది.
కళ్ళు తుడుచుకుంటే మాత్రం…. కన్నీళ్ళు ఆగితేగా….
అలసి సొలసి నిద్రలోకి జారేవరకూ అలా వర్షిస్తూనే ఉన్నాయి.
మరుసటి ఉదయం నిద్రలోనుంచి కళ్లు తెరిచిన ప్రియకి అమ్మ తిట్లు సుప్రభాతంలా వినిపిస్తున్నాయి.
“ఇంకా చిన్నపిల్లవా….” పదింటివరకు పడుకోవడానికీ ” కొంచమైనా బుద్దిలేదు……….”
అమ్మ తిడుతూనే ఉంది. కానీ… అవేమీ పట్టించుకోని ప్రియ mobile తీసుకుని Facebook చూస్తుంది.
ప్రియ కళ్ళు మళ్లీ వర్షించడం మొదలు పెట్టాయి గోదారిలా….
ఎందుకంటే….. ఎంత వెతికినా…. నాని profile కనిపించట్లేదు.
వెతికి- వెతికి విసుగొచ్చింది. ఐనా లాభం లేదు.
“ఏమై ఉంటుంది , ఎందుకిలా ఛేసాడు…. నన్ను block చేసాడా…! లేక తన profile deactivate చేసాడా…!”
అనుకుంటూ….. సరే చూద్దాం అనుకుని అప్పటికప్పుడు కొత్త profile creat చేసి అందులోంచి వెతికింది నాని profile కోసం. ఐనా కనిపించలేదు.
ఇక లాభం లేదనుకుని phone చేసింది. Phone switch off…
ప్రియ మనసులో ఏదో కీడు శంకిస్తుంటే.. అలాగే ఏడుస్తూ కుప్పకూలిపోయిందీ. ఇక అప్పట్నుంచి రోజూ Facebook లో వెతుకుతూనే ఉంది , రోజూ call చేస్తూనే ఉంది. But…ఒకరోజు phone ring ఔతుంటే…. exciting గా ఎదురుచూసింది అవతల lift చేసేవరకూ….
తీరా lift చేసిక “sorry ఈ number నేను కొత్తగా తీసుకున్నాను, wrong number ” అని పెట్టేసాడు అవతలి వ్యక్త
ఇంచుమించు పిచ్చిదానిలా తయారైంది ప్రియ పరిస్థితి. రోజూ దిగాలుగా phone కోసం ఎదురు చూస్తూ… Facebook లో వెతుకుతూ… ఇలా ఇంచుమించు 6- 7 నెలల వరకు మామూలు మనిషి కాలేక పోయింది నందిని. కానీ… మనసుకైన గాయం అప్పుడప్పుడు రేగుతూనే ఉంది. ఇలా సంవత్సరం గడిచిపోయింది.
ఒకరోజు ఉదయం ప్రియ వాళ్ళింటికి తన close friend శుభశ్రీ వచ్చింది.
ప్రియ : ఏంటే పిచ్చి మొహం… నెల రోజుల్నుంచి నీ phone switch off. అందుకే.. మీ ఇంటికి కూడా వచ్చాను తెలుసా…
శుభశ్రీ : సారీనే… మేము అనుకోకుండా ఊరు వెళ్ళాం… ఆ పల్లెటూర్లో అస్సలు signal ఉండి చావదు.
ప్రియ : kk… ఇంతకీ ఏంటి విషయం..! చేతిలో ఆ కవరేంటి…!
శుభశ్రీ : అదే విషయం , నాకు marriage fix ఐంది , ఇది ఇవ్వడానికే వచ్చాను అని ప్రియ చేతిలో శుభలేఖ పెట్టింది.
ప్రియ : హే… Congratulations..
ఏంటే.. ఇంత Sudden గా…!
శుభశ్రీ : ఏంటో… అలా జరిగిపోయింది. సర్లేగానీ… మన friends అందరూ వస్తారు , నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి. లేకపోతే చంపుతా…
హైద్రాబాద్ నుండి మా ఊరికి Bus Book చేసాం…. S,o miss అవ్వకే please…
ప్రియ : నీ మొహం , నీ పెళ్ళికి నేను రాకుండా ఎలా ఉంటానే…. తప్పకుండా వస్తా… ఇంతకీ ఏ ఊరు..!
శుభశ్రీ : తోట్లావల్లూరు. VIJAYAWADA కి సరిగ్గా 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది.. సరే ఇంక నేను వెళ్తాను , Bye.
ప్రియ : సరే Bye….
శుభశ్రీ వెళ్లిపోయింది , కానీ , ప్రియ మనసుకైన గాయాన్ని రేపి పోయింది.
విజయవాడ … ఆ పేరు గుర్తొస్తే చాలు… నాని గుర్తొస్తాడు. ప్రియకి సరిగ్గా గుర్తులేదుగానీ నానిది కూడా విజయవాడ పక్కన ఏదో పల్లెటూరు అని చెప్పాడు. ఈ సంవత్సర కాలంలో ఎన్నిసార్లు ఆలోచించిందో ఆ ఊరి పేరు కోసం.. కానీ , ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు.
ఇప్పుడు ఒకపక్క ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే… విజయవాడ వెళ్ళాక ఏమో ఎక్కడైనా కలుస్తాడేమో అని ఆశ..
చూస్తూ చూస్తూనే పెళ్ళిరోజు రానే వచ్చింది. Friends అందరూ Bus లో బయలుదేరారు. అందరూ ఫుల్ Josh లో ఉంటే… ప్రియ మాత్రం Bus ఓ మూల కూర్చుని తన ఆలోచనల్లో తను మునిగిపోయింది. విజయవాడ దగ్గిరికి వస్తుంది అని తెలియగానే… ప్రియ రోడ్డు పక్కన నడుస్తున్న ప్రతి ఒక్కరినీ వదలకుండా చూస్తోంది ఆత్రంగా…
నాని కనపడలేదుగానీ… పెళ్ళివాళ్ళ ఇల్లు మాత్రం వచ్చేసింది. అందరూ Fresh అయ్యాక మళ్ళీ ఎవరి Josh లో వాళ్ళు మునిగిపోయారు. ప్రియ మాత్రం విచారంగా కనపడిన ప్రతి కుర్రాడిని పరీక్షగా చూస్తూనే ఉంది.
చూస్తూ చూస్తూనే పెళ్ళి కూడా ఐపోయింది. కానీ తనకు నాని మాత్రం కనపడలేదు. ఆ రాత్రికే అందరూ తిరుగు ప్రయాణం అయ్యారు. అందరూ బాస్లో బయలు దేరారు. బస్సు బయలు దేరింది. చిన్నగా వర్షం కురుస్తూంది. Bus లో ఓ మూలగా బయటికి చూస్తూ కూర్చుంది ప్రియ.
చీకట్లో బస్సు బయలుదేరింది
నున్నటి రోడ్డుమీద చీకట్లో speed గా వెళ్తోంది బస్సు. బస్సు లైటు వెలుతుర్లో నల్లటి రోడ్డు మీద తెల్లని పూలలాంటి చినుకులు టప్ టప్ అంటున్నయ్… మెల్లగా ఒక్కొక్కరు నిద్రలోకి జారుకుంటున్నారు. ప్రియ మాత్రం ఎడతెగని ఆలోచనల్లో అలా మూసుకుని ఆలోచిస్తూనే ఉంది.
ఉన్నట్టుండి అందరి ప్రశాంతతని భగ్నం చేస్తూ…. పెద్ద శబ్దం… ఏదో భయంకరంగా పేలినట్లు. అందరూ ఉలిక్కిపడి కళ్లు తెరిచారు. బస్సు మెల్లగా ఆగింది ఒక పక్కకి ఒరిగిపోయి. బస్సులో లైట్లు వెలిగాయి. అందరిలోనూ ఆత్రుత Tension ఏం జరిగిందో అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు.
ఇంతలో బస్సు cleaner కిందకి దిగి చూసి పైకి వచ్చాడు.
Cleaner : అందరూ కాసేపు కిందకి దిగాలి. టైరు పేలింది, మార్చాలి.
అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వారిలో ఒకరు అడిగారు.
“ఒకపక్క వర్షం వస్తుంది. ఎలా బయట నిబడమంటావ్…”
Cleaner ; తప్పదండీ… మీరు దిగకపోతే Tyre మార్చడం కుదరదు. ఒక్క పదిహేను నిముషాలు ఓపిక పట్టండి. లేదంటే వర్షం తగ్గేవరకూ ఇక్కడే ఉండాల్సి వస్తుంది.
ఇక అందరూ తప్పదన్నట్టు కిందకి దిగారు. రోడ్డుకి రెండు పక్కలా అప్పుడే దున్నిన మెట్టపొలాలు . రోడ్డు పక్కనే ఒక పొలంలో ఒక చెట్టు కనపడటంతో priya వాళ్ళ friends ఆ చెట్టు కిందకి పరిగెట్టారు. కొంతమంది కుర్రాళ్లు బస్సుకి ఒక పక్కగా నిలబడ్డారు.
చెట్టు కిందకు చేరిన ప్రియ Batch కింద ఏదో నల్లటి బల్ల లాంటి పెద్ద బండ ఉండటంతో ఆ బండమీద కూర్చున్నారు.
చెట్టు ఆకుల్లోంచి వాళ్ళమీద టప్-టప్ మంటూ చినుకులు పడుతున్నాయి. ఉన్నట్టుండి అప్పుడప్పుడు చిన్నగా మెరుస్తుంది ఆకాశం.
అలా ఒక మెరుపులో కూర్చున్న ప్రియ friends లో ఒకరు కూర్చున్న బల్లని చూసి కంగారుగా లేచి ఒక్క గెంతులో దూరంగా వెళ్ళి నిలబడింది.
ఏమైందో అర్ధంకాక అందరూ కంగారుగా లేచి తన పక్కగా వచ్చి నిలబడ్డారు.
అప్పుడు మళ్ళీ మెరిసింది ఈసారి కొంచం పెద్దగా….
అప్పుడర్ధమైంది వాళ్ళకి… వాళ్ళు కూర్చున్నది ఒక నల్లని రాతితో కట్టిన “సమాధి” అని.
అందరూ భయంగా చూసారు…. కానీ , మెరుపు వెలుతురులో సమాధిపై ప్రియకి ఏదో కనపడింది. కానీ , ఏంటో clear గా తెలీదు. అందుకే మళ్ళీ మెల్లగా సమాధి దగ్గరికి వెళ్లబోయింది. ఎవరో friend చేయి పట్టుకుని ” ఏయ్ ఎందుకే అక్కడికి ” అంటూ ఆపింది.
ఇంతలో ఒకబ్బాయి mobile torch వేసుకుని అమ్మాయిల దగ్గిరికి వచ్చాడు.
అబ్బాయి : హే… మీ shelter భలే ఉందే ….
ఆ అబ్బాయి చేతిలోని మొబైల్ తీసుకుని సమాధిపై లైట్ వేసింది.
మెల్లగా దగ్గిరికి వెళ్ళి సమాధిపై ఉన్న ఫోటోని తుడిచింది….!
నవ్వుతున్న నాని Photo…
“నన్నే ఏడిపించాలనుకుంటావా…. చూడు ఇప్పుడు నిన్ను ఎంతలా ఏడిపిస్తున్నానో… ” అని నాని నవ్వుతూ వెటకరిస్తున్నట్టు అనిపించింది తనకి.
చిన్న-చిన్న వర్షపు చినుకులు ప్రియ కన్నీటితో పోటీ పడలేక కురవటం మానేసాయి.
ఏమైందో అర్ధంకాక friends అందరూ ఆశ్చర్యంగా చూస్తూ దగ్గిరికి వెళ్ళి ప్రియని చుట్టుముట్టి చేతులు పట్టుకున్నారు. నిలబడే ఓపిక లేదన్నట్టు ప్రియ సమాధిపై కూలబడి నాని photo పై రాసిన అక్షరాలను చదువుతోంది. ప్రియతో పాటు అందరూ చదవటం మొదలెట్టారు.
ఇది నా కొడుకు చనిపోయే ముందు రాసుకున్న లేఖ. మా నానిలా ఎవరూ కాకూడదనే ఆ లేఖని ఇక్కడ చెక్కించాను.
“ప్రియా…….
అసలు ప్రేమంటే ఏంటి ప్రియా….
విషాదమా…. ఆనందమా….
నాకైతే ఏం అర్ధం కాలేదు. కానీ…. ఒకటి తెలుసు. దీనిని ఏమంటారో తెలీదుగానీ… మనసంతా ఎప్పుడూ ఎవరో మెలితిప్పుతున్నట్టు ఉండేది. ప్రతిక్షణం టెన్షన్ గా ఉండేది. ఐనా ..కొని తెచ్చుకున్న ధైర్యంతో నీతో అలా నవ్వుతూ మాట్లాడేవాడిని.
“నిన్ను ప్రేమిస్తున్నాను ప్రియా” అని గట్టిగా అరిచి చెప్పాలనుండేది. కానీ… నీతో మాట్లాడుతున్న ప్రతిసారి నా కాళ్లూ చేతులూ వణుకుతూనే ఉండేవి. నాకు ఇప్పటికీ అర్ధం కాదు , నువ్వంటే ఎందుకంత భయమో…..
అందుకే అసలు ప్రేమంటే ఏంటో నాకిప్పటికీ అర్ధ కాలేదు.
సరే ఏదోకరోజు నేనంటే ఇష్టమని నువ్వే చెప్తావ్ లే అని ఎదురు చూసా….
కానీ , నువ్వు sudden గా పెళ్ళి కుదిరిందని చెప్తే తట్టుకోలేకపోయా…..
ఎంత పెద్ద రోగమొచ్చినా అంత పెద్ద నొప్పి రాదేమో….. అందుకే, ఆ నొప్పి భరించటం నావల్ల కాక ఆత్మహత్య చేసుకుంటున్నా..
నువ్వు మాత్రం సంతోషంగా జీవించాలనేదే నా చివరి కోరిక.
చివరగా చిన్న మాట….. నిజంగా వచ్చే జన్మంటూ ఉంటే నాకోసం పుట్టు.. please ప్రియా…..
ఇక సెలవు , నిన్ను చేరలేకపోయిన నీ నాని ”
ప్రియ సమాధిపై తలవాల్చి వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది.
Friends అందరూ ప్రియని పట్టుకుని అలా చూస్తూ ఉండిపోయారు , ఎలా ఓదార్చాలో తెలీక.
ఇంతలో bus cleaner అరవటం వినపడింది. ” Bus ready, అందరూ తొందరగా వచ్చి ఎక్కండి ” అంటూ…
ఒక friend ప్రియని లేపింది ” వెళ్దాం పద ” అంటూ
ప్రియ లేవలేదు.. అందరూ కలిపి బలవంతంగా లేపబోయారు…. కానీ…
అప్పటికే ప్రియ శ్వాస ఆగిపోయి చాలా సేపయ్యింది.
అందరిలోనూ దుఖం కట్టలు తెంచుకుంది. అక్కడున్న అబ్బాయి ప్రియని భుజంమీద వేసుకున్నాడు. అందరూ ఏడుస్తూ bus వైపు బయల్దేరారు.
మళ్ళీ వర్షం మొదలైంది…… (రచయిత ఎవరో తెలియదు, ధన్యవాదాలు… వాట్సప్‌లో కనిపించిన కథ…)
Share this Article