.
ఓ మంచి సినిమా కథలా… ఆ సినిమా కుటుంబం కథ కూడా చాలా ట్విస్టులు తిరుగుతోంది… ఇన్నాళ్లు తండ్రీ కొడుకులు, అన్నాదమ్ముళ్లకు పరిమితమైన తాజా కొట్లాటల కథలోకి తల్లులనూ తీసుకొచ్చారు…
మోహన్‌బాబు రెండో భార్య, అనగా మంచు మనోజ్ తల్లి పేరిట ఓ లేఖ ప్రచారంలోకి వచ్చింది… రావడమే కాదు, ఏకంగా ఆ లేఖ తన కొడుక్కి వ్యతిరేకంగా ఉండటం సంచలనం…
Ads
(మంచు విష్ణు, మంచు లక్ష్మి తల్లి వేరు… మంచు మనోజ్ తల్లి వేరు తెలుసు కదా… )
మొన్న తమ జనరేటర్‌లో మంచు విష్ణు పంచదార పోశాడని, తనను హతమార్చడానికి కుట్ర చేశాడనీ మనోజ్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే కదా… దాన్ని అదే మనోజ్ తల్లే ఖండిస్తోంది… నాకు నా సొంత కొడుకు ఎంతో, మోహన్‌బాబు మొదటి భార్య కొడుకు విష్ణు (పెద్ద కొడుకు అట) కూడా అంతే సమానమే అని చెబుతోంది…
నా పెద్ద కొడుకు తన మనుషులతో రాలేదు, దౌర్జన్యం చేయలేదు, ఈ ఇంట్లో పనిచేసినవాళ్లే ఇక్కడ పనిచేయలేం అని మానేశారు తప్ప విష్ణు ప్రమేయం లేమీ లేదు, అసలు నా కొడుకు మనోజ్ చేసిన కంప్లయింట్‌లో నిజాలే లేవు, అంతా అబద్ధం అంటోంది ఆమె…
సో, ఆ కుటుంబంలో చివరకు సొంత తల్లి సహా అందరూ మనోజ్‌కు వ్యతిరేకం అయిపోయారు… భార్య మౌనిక, తను… ఇద్దరే… లక్ష్మి సంగతి తెలియదు గానీ… మోహన్‌బాబు రెండో భార్య, మొదటి కొడుకు, తను అందరూ మనోజ్‌కు వ్యతిరేకమే ఇప్పుడు…
ఏమో, మోహన్‌బాబుకు భయపడి నిర్మల సొంత కొడుకునే వ్యతిరేకిస్తోందా..? తెలియదు..! ఎందుకంటే..? ఈ కేసులో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు… చివరకు అన్ని వేళ్లూ సాక్షి మాజీ సీఈవో వినయ్ మహేశ్వరి చుట్టూ తిరుగుతున్నాయి… మనోజ్ కూడా తన మీదే ఆరోపణలు చేస్తున్నాడు…
ఈ కుటుంబ తగాదా ఇంకా ఇంకా పెంట పెంట గాకుండా మోహన్‌బాబు శ్రేయోభిలాషులు, సినిమా పెద్దలు ఎంటరై, అందరినీ కూర్చోబెట్టి సెటిల్ చేస్తున్నారనే వార్తలు కూడా కనిపించాయి మొన్న… కానీ అవేవీ ఫలించినట్టు లేవు…
1) మోహన్‌బాబు ఎవరు చెప్పినా వినడు… 2) ఆస్తి మొత్తం తన సంపాదన, ఎవరికి ఎంత పంచాలనేది తన ఇష్టం… 3) ఇద్దరు సోదరుల నడుమ ఆస్తి తగాదాలు కాదు, ఇంకేవో బయటికి రాని కారణాలతో పీటముడి బిగిసినట్టుంది…
Share this Article