.
ప్రభాస్ గాయం… ఈ వార్త అన్నింటిలోనూ వచ్చిందే… పాన్ ఇండియా స్టార్, వేల కోట్ల ప్రాజెక్టులు తన మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి తన ఆరోగ్య స్థితి మీద ఆసక్తి, వార్తా ప్రాధాన్యం సహజమే…
వార్త ఏమిటీ అంటే..? తను ఏదో షూటింగులో గాయపడ్డాడు, అందుకని జపాన్‌లో కల్కి ప్రమోషన్ కోసం వెళ్లలేకపోయాడు… ఈమేరకు తన టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది…
Ads
జపాన్‌లో తనకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు… సో, జపనీస్ భాషలోనే అక్కడ రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేశారు… ఏకంగా ప్రభాస్‌తోనే అక్కడ ప్రమోషన్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు… కానీ అనుకోకుండా చీలమండ దగ్గర కాలు బెణికి వెళ్లలేకపోతున్నాడు అనేది ప్రాథమిక సమాచారం…
కానీ..? వేరే భిన్న సమాచారం కూడా వినిపిస్తోంది… తను చాన్నాళ్లు కాళ్ల నొప్పులతో, విదేశాల్లో సర్జరీలు, చికిత్సలతో సతమతం అయ్యాడని తెలుసు కదా… ఆదిపురుష్ ప్రిరిలీజ్ సమయంలో తిరుపతిలో వేదిక ఎక్కడానికి సైతం కష్టమై లిఫ్ట్ పెట్టాల్సి వచ్చింది… నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు…
సినిమాల్లో తన మూమెంట్స్, యాక్షన్ సీన్లలో ఆ ప్రభావం కనిపిస్తోంది… ఐతే ఇప్పుడు తను ఏ షూటింగులో గాయపడ్డాడు..? అదీ ప్రశ్న… రాజా సాబ్ షూటింగ్ అయిపోయిందనే వాళ్లే చెబుతున్నారు… ఫౌజీ స్టార్ట్ కావల్సి ఉంది… స్పిరిట్ కూడా అంతే… కల్కి సీక్వెల్ సంగతి తెలియదు…
ఐతే హఠాత్తుగా తనకు న్యూరో సంబంధ సమస్యలు వచ్చాయని అంటున్నారు… హుటాహుటిన ఈ చికిత్స కోసం లండన్ వెళ్లాడని వినిపిస్తోంది… బాహుబలి షూటింగుల తరువాత ఆర్థోపెడిక్ ఇష్యూస్ వచ్చాయనే అనుకున్నారు అందరూ… కానీ అవి కేవలం ఆర్థోపడిక్ ఇష్యూస్ కావనీ, కొన్ని న్యూరో ఇష్యూస్ కూడా తలెత్తాయని అంటున్నారు…
తను ఇండియన్ హాస్పిటల్స్, డాక్టర్స్ మీద ఏమాత్రం ఆధారపడటం లేదు… ఇటలీలోనే ఓ ఖరీదైన విల్లా తీసుకుని అక్కడ చికిత్స, విశ్రాంతి తీసుకున్నాడని కూడా ఆమధ్య వార్తలు వచ్చాయి… తన మీద ఆధారపడి మూణ్నాలుగు పాన్ ఇండియా భారీ ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి తన గాయం, ఇతర ఆరోగ్య స్థితి, సీరియస్‌నెస్ మీద ఫిలిమ్ సర్కిళ్లు ఆరాలు తీస్తున్నాయి…
Share this Article