.
( Shankar G ) …… మనం ఆన్‌లైన్ షాపింగుల గురించి కదా చర్చించుకుంటున్నది… సరే, ఇంకాస్త ముందుకెళదాం…
ఆన్లైన్ షాపింగ్ సంతలో కూరగాయలు కొనటం లాంటిదే. చచ్చులు పుచ్చులతో పాటు మంచివి కూడా ఉంటాయి. అనుభవం ఉన్నవాళ్లయితే ఏరి ఏరి మరీ మంచివి తీసుకుంటారు.
Ads
ఆన్లైన్ షాపింగ్ T Shirts…
T shirts బ్రాండ్స్ ఎక్కువ శాతం సైజ్ సమస్య ఉండదు. ఏ బ్రాండ్ తీసుకున్నా కొంచం అటు ఇటుగా ఉంటాయి. నేనయితే అన్ని రకాల బ్రాండ్స్ వాడుతాను.
కొనేటప్పుడు సైజ్ చార్ట్ చెక్ చేసుకోండి. ఒక నంబర్ అటు ఇటుగా తీసుకున్నా ఏం కాదు. మీ షర్ట్ 40 సైజ్ ఐతే 39 లేదా 40 తీసుకోవచ్చు. T షర్ట్ లెన్త్ ఎప్పుడు 25 నుండి 28 వరకు ఉంటుంది. S, M, L సైజస్ వరకు. అంతకంటే ఎక్కువైయితే XL, XXL, లాంటివి 29 ఉంటుంది.
లావుగా ఉన్నవారు రెగ్యులర్ ఫిట్ సెలెక్ట్ చేసుకోండి. లూస్ ఫిట్, ఓవర్ సైజ్ కూడా దొరుకుతాయి.. T షర్ట్స్ ల్లో POLO లేదా షర్ట్ కాలర్ లేదా రౌండ్ నెక్, V నెక్, హేన్లీ నెక్ ఎక్కువగా ఉంటాయి. లావుగా ఉన్నవారికంటే మంచి ఫిజిక్ ఉన్నవారికి మ్యాన్లీ గా ఉంటాయి. ఏ సీజన్ లో ఐనా ఏ అకేషన్ కైనా సెట్ ఔతాయి.
వీటిల్లో కాటన్, కాటన్ బ్లెండ్, పోలిస్టర్ ఫ్యాబ్రిక్స్ లో దొరుకుతాయి. ప్యూర్ కాటన్ ఎక్కువగా సాగే అవకాశం ఉంది. కొన్ని సింక్ కూడా ఔతాయి. కాబట్టి కాటన్ బ్లెండ్ లేదా పాలిష్టర్ తీసుకోండి.
ఎక్కువమంది సాలిడ్ లేదా స్ట్రిప్ టీ షర్ట్స్ వాడుతారు. వీటిల్లో ఫుల్ స్లీవ్, హాఫ్ స్లీవ్, షార్ట్ స్లీవ్ మోడల్స్ ఉంటాయి.
నాణ్యత…. 250 Gsm ఉంటే మంచిది. 300 లేదా 350 Gsm ఉంటే సూపర్ అన్నమాట. తిర్పూర్ లో తయారయ్యే టీ షర్ట్స్ కూడా బాగుంటాయి. ఇండియా మొత్తానికి వాళ్ళే ఎక్కువగా సప్లై చేస్తారు. T షర్ట్స్ మీద ప్రింటింగ్ చేసేవాళ్ళు బల్క్ లో అక్కడినుండే తెప్పిస్తారు.
ఒక్క T షర్ట్ యాభై రూపాయల నుండి మొదలవుతుంది. నేను ఎక్కువగా వాడే బ్రాండ్స్ యారో, లివైస్, us polo, ఫ్లైయింగ్ మిషన్,..
Nautica అనే బ్రాండ్ మాత్రం కొనకండి. అవి ఒక్క ఉతుకుకే నాలుగంగుళాలు సాగుతాయి… నా దగ్గర అలాంటివి ఐదు ఉన్నాయి. కస్టమర్ ఓపినియన్, రేటింగ్ చూడ్డం మరిచిపోకండి. ఊరుపేరులేని బ్రాండ్స్ కొని ఇబ్బంది పడకండి, వాటికీ రిటర్న్ పాలసీ కూడా ఉండదు. తర్వాత పోస్ట్ లో జీన్స్ ప్యాంట్స్ గురించి చెప్పుకుందాం….
Share this Article