.
వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుపడిన నటి కస్తూరి మళ్లీ వార్తల్లోకి వచ్చింది… ఈసారి శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో ఇళయరాజాకు అవమానం గురించి…
నో, నో, ఏమిటీ వివాదం..? గర్భగుడిలోకి ఎవరికీ ప్రవేశం లేదు, ఆయనకు జరిగిన అవమానమూ లేదు, నోర్ముయ్యండెహె అన్నట్టు ఓ ట్వీట్ వదిలింది… అసలు వివాదం ఏమిటంటే..?
Ads
ఆ గుడికి వెళ్లిన ఇళయరాజాకు అక్కడి అధికారులు స్వాగతం పలికారు, ప్రోటోకాల్ మర్యాదలు కల్పించారు… అంటే విశేష దర్శనం ఎట్సెట్రా… 81 ఏళ్ల ఈ స్వరకర్త రాజ్యసభ సభ్యుడు కూడా కాబట్టి…
అనుకోకుండా ఇద్దరు జియ్యర్లతోపాటు తను అర్థమంటపంలోకి వెళ్లాడు… కావాలని కాదు… కానీ ఆలయ సంప్రదాయాల ప్రకారం ఎవరూ అందులోకి రాకూడదు… ఆ విషయం చెప్పాక తను అక్కడి నుంచి వచ్చేశాడు…
ఇంకేముంది..? వివాదం షురూ… తనను అవమానించారని..! ఇక్కడ కులం అనేది కాదు, అందులోకి బ్రాహ్మణులకూ ప్రవేశం లేదు… స్వయంగా ఇళయరాజాయే తనకు ఆత్మాభిమానం ముఖ్యమనీ, అక్కడ తను కించపడేదేమీ జరగలేదని వివరణ, స్పష్టత ఇచ్చాడు…
నిజానికి గుడి అధికారుల ఆహ్వానం మేరకే తను అక్కడికి వెళ్లాడు… ఆలయంలో మార్గశిర మాస వేడుకల్లో భాగంగా దివ్య పాశుర సంగీత కచ్చేరి, భరతనాట్య కార్యక్రమం ఆదివారం రాత్రి నిర్వహించారు… ఇందులో శ్రీవిల్లిపుత్తూరు శడగోప రామానుజ జీయర్, త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ ముఖ్య అతిథులుగా హాజరుకాగా, ప్రత్యేక అతిథిగా ఇళయరాజా పాల్గొన్నాడు…
ఐనా సరే, ఇంకా దానిపై రణగొణ ధ్వనులు వినిపిస్తూనే ఉన్నాయి… అవమానం గురించి చెప్పుకోవడానికి కూడా ఇళయరాజా భయపడుతున్నాడనే అభిప్రాయాలు కూడా నెట్‌లో కనిపిస్తున్నాయి… అప్పట్లో యాదగిరిగుట్టలో భట్టి విక్రమార్క ఇష్యూ ఒకటి ఈ సందర్భంగా గుర్తొచ్చింది…
మార్చి 12న యాదగిరిగుట్టలో సీఎం పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి దంపతులతో పాటు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎత్తయిన స్టూళ్లపై కూర్చోగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం చిన్న పీటపై కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను చూసి.. దళితుడైన భట్టి విక్రమార్కను కింద కూర్చోబెట్టి.. ముగ్గురు రెడ్లు పైన కూర్చున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదం నడిచింది…
వేదాశీర్వచనం సందర్భంగా దేవుడి ముందు ఎత్తులో కూర్చోవడం ఇష్టం లేక తనే చిన్న స్టూల్ మీద కూర్చున్నాననీ, ఒక డిప్యూటీ సీఎంను ఎవరు ఎందుకు అవమానిస్తారనీ, తన ఆత్మగౌరవాన్ని తానే ఎందుకు వదలుకుంటాననీ తను స్వయంగా క్లారిటీ ఇచ్చే దాకా వివాదం నడిచింది…
శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయం వివాదమూ అంతే.,. అక్కడ నిజంగా అవమానం జరిగి ఉంటే ఇళయరాజా ఊరుకునేవాడు కాదు కదా… అక్కడేమీ జరగలేదురా బాబూ అని తనే చెబుతున్నాడు కదా… ముంజెమ్మల్ బాయ్స్ సినిమాలో తన పాట తాలూకు చరణం ఒకటి కాజువల్ డైలాగుగా వాడుకున్నందుకే రచ్చ, గాయి చేసిన ఇళయరాజా తనకు అవమానం జరిగితే ఊరుకునేవాడా..?
Share this Article