.
గతం ఏమిటి..? అరవయ్యేళ్ల ముసలి హీరో కూడా వీపుకు బద్దలు కట్టుకుని పదహారేళ్ల హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తుంటాడు… ఫ్లర్టింగ్, గెంతులు, పాటలు, మన్నూమశానం…
మన మూర్ఖాభిమానులు ఈరోజుకూ అలాంటి హీరోలను చూసి ఈలలు వేస్తుంటారు… ఒక ప్రముఖ నటి మొదట మనమరాలు, తరువాత బిడ్డ, తరువాత హీరోయిన్, ఆ తరువాత తల్లి పాత్రలు వేస్తుంటుంది… కొండొకచో బామ్మ పాత్రలు కూడా…
Ads
కానీ హీరో వయస్సు తరగదు… వాడు ఫరెవర్ యంగ్… సరే, ఈ పైత్యరాజుల కథలు విన్నవే… ఈరోజుకూ చూస్తున్నవే… కానీ నయనతార ఒక ప్రకటన బాంబు షెల్‌లా పడింది ఇండస్ట్రీ కోర్టులో…
ఆమె వయస్సు జస్ట్, 40… ఐనా సరే… 30 ఏళ్ల దానిలా కనిపిస్తుంది… ఆమె ఏమన్నదంటే..?
‘‘తొలి జనరేషన్ కు చెందిన రజనీకాంత్, మోహన్ లాల్, మమ్ముట్టి, చిరంజీవిలతో నటించాను. రెండవ జనరేషన్ కు చెందిన విజయ్, అజిత్ తోనూ సినిమాలు చేసాను. మూడవ జనరేషన్ కు చెందిన సూర్య, విక్రమ్ తోనూ, నాల్గవ జనరేషన కు చెందిన ధనుష్, శింబులతోనూ పనిచేసాను… అయిదవ జరనేషన్ కు చెందిన శివ కార్తికేయన్ తో సినిమాలు చేసాను… ప్రస్తుతం ఆరవ జనరేషన్ హీరో అయిన కవిన్ తో నటిస్తున్నా… ఇలా ఇన్ని (ఆరు) జనరేషన్ హీరోలతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవాన్నిచ్చింది… ఇదొక రిమార్కబుల్ జర్నీ’’
వావ్, వాట్ ఏ కెరీర్… ఈ రోజుకూ హయ్యెస్ట్ పెయిడ్ స్టార్… ఒకప్పుడు శ్రీరామరాజ్యం కాగానే కెరీర్‌కు వీడ్కోలు పలికినట్టు ప్రకటించిన ఆమె అనేకానేక కారణాంతరాలతో తిరిగి కెరీర్‌ను పునర్నిర్మించుకుని ఈ రేంజుకు చేరింది…
అంతేకాదు… ఒక సమంత, ఒక శ్రీలీల, ఒక తమన్నా మాత్రమే ఐటమ్ సాంగ్స్ చేయాలా..? ఊ అంటావా, దెబ్బలు పడతయ్‌రో, రా రా రావాలయ్యా అని నేను పాడలేనా, ఎగరలేనా అనుకుని రాబోయే ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో గెంతడానికీ రెడీ అయిపోయిందట…
నెటిజన్లలో ఓ విమర్శ… ముసల్దానివి అయ్యావు, ఇంకా ఈ ఐటమ్ గెంతులు దేనికి అని… నెవ్వర్, నేను ఫేడవట్ కాదు, కాలేదు, అప్పుడప్పుడే కాబోను… అసలు నాలో ఏం తక్కువుంది అని చెప్పడానికే చేయబోతున్నదేమో… సరే, ఆ సాంగ్ ఉంటుందానేది ధ్రువపడలేదు గానీ… తను చేయగలదు…
అసలే ధనుష్‌తో వివాదం తరువాత తన కెరీర్ మీద, తన రేంజ్ మీద, తన పొజిషన్ మీద కసిగా ఉంది… ప్రూవ్ చేసుకోవాలి… అన్నిరకాలుగా… తన ఫిజిక్, తన గ్లామర్, తన రేంజ్, తన పాపులారిటీ అన్నీ… ఏయ్, ఎవడ్రా అది, నయనతార ముసల్ది అయిపోయింది అని కూసింది..?!
Share this Article