.
కొందరు ఉంటారు… మన దేశం అనుభవిస్తున్న సార్వభౌమిక స్వేచ్ఛ విలువ తెలియదు… మరోసారి చెబుతున్నా… అంతర్జాతీయ సమాజంలో మనం అనుభవించే స్వేచ్ఛ విలువ వాళ్లకు తెలియదు…
చుట్టూ అగ్నిగుండాలు… శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్, మాల్దీవులు, చివరకు హిందువుల్ని, బౌద్ధుల్ని తరిమేస్తున్న బంగ్లాదేశ్… మళ్లీ అదే బంగ్లాదేశ్ అయ్యో అయ్యో మా రోహింగ్యా ముస్లింలను బర్మాలో ఊచకోత కోస్తున్నారని ఏడుస్తుంది..
Ads
సేమ్, చైనా… ఇదే చైనా జింజియాంగ్ ప్రావిన్సులో తనే ముస్లింల మీద ఉక్కుపాదం మోపుతుంది… కానీ అదే బర్మాలోని సైనిక ప్రభుత్వంపై తిరగబడే అరకాన్ ఆర్మీకి సపోర్టు…
ఎస్, అరకాన్ ఆర్మీ… ఎప్పుడైతే హసీనా అధికారం కోల్పోయి, ప్రాణాలు చేతపట్టుకుని ఇండియా వచ్చేసిందో… బంగ్లాదేశ్ అరాచకంలోకి అడుగుపెట్టింది.,. అడుగడుగునా అరాచకం…
ది గ్రేట్ నోబెల్ ప్రైజ్ విన్నర్ యూనస్… తాత్కాలిక ప్రభుత్వ సారథి… పక్కా భారత వ్యతిరేకుల గ్రూపుల లీడర్.,. హిందువుల ఊచకోతలు పదే పదే… ఏ హిందూ దేశమైతే దాన్ని విముక్తం చేసిందో, అదే దేశం మీద అడుగడుగునా ద్వేషం… ఏ పశ్చిమ పాకిస్థాన్ వాళ్లను నానారకాలుగా హింసించిందో ఇప్పుడదే పాకిస్థాన్ వాళ్లకు ఆదర్శ దేశం…
ఎస్, కృతజ్ఞత అనేది బంగ్లాదేశ్ వాళ్ల రక్తంలోనే లేదు… ఇప్పుడు ఇండియాపై ఉరుముతోంది… ఒక్క హిందువూ తమ దేశంలో ఉండటానికి వీల్లేదు అంటోంది…
ది గ్రేట్ కాంగ్రెస్ సహా… ది గ్రేట్ సెక్యులర్ టీఎంసీ, డీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ, బీఆర్ఎస్, టీడీపీ ఎట్సెట్రా పార్టీల్లో ఒక్కడూ స్పందించడు… తమ సెక్యులర్ పవిత్రత, శీలం దెబ్బతింటాయని..!
ఈలోపు అంతర్జాతీయ వార్తా సంస్థల్లో అనేక వార్తలు… అఫ్‌కోర్స్, మన మీడియాకు, ప్రత్యేకించి దిక్కుమాలిన తెలుగు మీడియాకు అస్సలు పట్టదు, అసలు అర్థం కాదు… అరకాన్ ఆర్మీ బంగ్లాదేశ్- బర్మా సరిహద్దుల్లో పూర్తి ఆధిపత్యం సంపాదించింది… అసలు ఏమిటీ అరకాన్ ఆర్మీ..?
బర్మాలో సైన్యానికి వ్యతిరేకంగా పోరాడే తిరుగుబాటు సైన్యం… పక్కా తాలిబన్ తరహా సైన్యం… బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మాత్రమే కాదు, థాయ్ సరిహద్దుల్లోనూ దానిదే హవా ఇప్పుడు… దానికి చైనా సపోర్టు…
పరిస్థితులు ఇంకా విషమిస్తే ఈ అర్మీ పూర్తిగా బంగ్లాదేశ్‌ను హస్తగతం చేసుకునే స్థితిలో ఉందనే ప్రచారం… అదే జరిగితే మనం ఆనందపడనక్కర్లేదు… మరీ నొటోరియస్ ఆర్మీ అది… పైగా ప్రపంచంలోకెల్లా అత్యంత అవిశ్వసనీయమైన చైనా సపోర్టు… ఈ పరిణామాలేవీ ఇండియాకు మంచివి కావు… అఫ్‌కోర్స్, మన దేశంలోని పలు రాజకీయ పార్టీల శునకానందానికి తప్ప..!!
Share this Article