.
నెవ్వర్… ఈ ఇద్దరు మహిళల తగాదా… అదీ ఫుల్లు అహంతో కూడిన ఇద్దరు ఉన్నతాధికారిణుల పంచాయితీని చివరకు సుప్రీం కోర్టు కాదు కదా… దేవుడు కూడా పరిష్కరించలేడేమో…
కర్నాటక… ఒకావిడ పేరు రోహిణి సింధూరి… తెలుగు ఐఏఎస్… 43 ర్యాంకు… మరొకావిడ పేరు రూపా మొద్గిల్… కన్నడ ఐపీఎస్… ఇద్దరూ తరచూ వార్తల్లోకి ఎక్కుతుంటారు… ఒకరికి ఒకరు తీసిపోరు…
Ads
అసలే ఆడ లేడీస్, ఆపై సెంట్రల్ సర్వీస్… కీలక బాధ్యతల్లో పనిచేసినవాళ్లు… ఎక్కడో తేడా కొట్టింది ఇద్దరికీ… ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు, ట్విట్టర్ ఉందిగా, ఈ పనికిమాలిన పంచాయితీలకు…
ఓ దశలో ఇద్దరినీ కొలువుల నుంచి పీకేసి కర్నాటక ప్రభుత్వం ఖాళీగా ఉంచింది… కొన్నాళ్లకు రోహిణిని గెజిట్ పబ్లికేషన్స్ పోస్టు అనబడే ఓ లూప్ లైన్‌లోకి తరిమేసింది,.. రూప మాత్రం ఐజీ… లా అండ్ ఆర్డర్ కాదనుకుంటా…
రోహిణి ఎక్కడున్నా పంచాయితీలే… మొదట్లో చాలా సిన్సియర్ అనే పేరుండేది… తరువాత చాలా వివాదాలు, ఆమె మీదే విమర్శలు, ఆరోపణలు… గతంలో రోహిణి మీద మైసూరు మున్సిపల్ కమిషనర్ శిల్పా నాగ్‌తో కూడా పెద్ద గొడవ…
సరే, రోహిణి, రూప గొడవలో రూప మీద రోహిణి పరువు నష్టం దావా వేసింది… దాని రద్దుకు రూప ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్లింది… కోర్టు కూడా ఇద్దరూ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు, ఏమిటీ పంచాయితీ, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి, రాజీపడండి అని సూచన మాత్రం చేసింది… తనూ ఏమీ తేల్చలేకపోయింది…
నో, నో… ఎవరూ తగ్గేదేలే అన్నారు… చివరకు మీరూ మీరూ లోకల్ కోర్టులో తేల్చుకొండి అంటూ సుప్రీం జాగ్రత్తగా తన కోర్టు నుంచి ఆ వ్యాజ్యాన్ని బయటికి పంపించేసింది… ఇప్పుడిక రూప రోహిణి మీద పరువు నష్టం దావా వేసింది… ఏకంగా క్రిమినల్ వ్యాజ్యం ఈసారి…
ఆమె కారణంగా తనకు కొన్నాళ్లు ఏ పోస్టూ ఇవ్వలేదు ప్రభుత్వం, ఆరు నెలలు జీతం లేదు… తను, భర్త, పిల్లలు, సోదరి, కుటుంబం మొత్తం మానసిక వేదనను అనుభవించాం అనేది రూప తాజా ఆరోపణ… కోర్టు రోహిణికి నోటీసులు కూడా జారీ చేసింది…
ఇదే రోహిణి, భర్త సుధీర్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి కలిసి తన భూమి కబ్జా చేశారని అప్పట్లో సింగర్ లక్కీ ఆలీ లోకాయుక్తను ఆశ్రయించాడు… డీకే రవి అనే మరో ఐఏఎస్ అధికారి మరణం వెనుక రోహిణి పాత్ర ఉందనే ఆరోపణలు, కథలు చాలా వచ్చాయి అప్పట్లో… సరే, అదెవరూ తేల్చలేరు, నిజమేమిటో ఎవరూ చెప్పలేరు, పైగా అదిక్కడ అప్రస్తుతం..!!
అన్నట్టు… ఇదే రూపకు అదే రోహిణి పేరుతో ఓ సోదరి ఉంది… ఐఆర్ఎస్ అధికారిణి… ఆదాయపు పన్ను శాఖలో జాయింట్ కమిషనర్… ఆమె కూడా రోహిణి సింధూరి వల్ల సఫరవుతున్నట్టు రూప ఆరోపణ…
Share this Article