.
సాధారణంగా ఏ టీవీ అయినా సరే, ఇయర్ ఎండ్ స్పెషల్ ప్రోగ్రామ్ అంటే… జోష్, జోక్స్, సాంగ్స్, డాన్స్, సరదా ఆటలు, సెలబ్రిటీల హంగామా గట్రా ఉండేలా చూసుకుంటుంది… అలాగే ప్లాన్ చేస్తారు,..
కానీ ఈటీవీ ఈసారి ఇయర్ ఎండ్ పార్టీ విచిత్రంగా అనిపించింది… ఆ ప్రోమో చూస్తుంటే అది సుమ, రాజీవ్ కనకాల లైఫ్ జర్నీ వీడియోలా ఉంది… సందర్భం ఏమిటో తెలియదు… ప్రోగ్రాం కూడా సుమ అడ్డాకు దావత్ అనే ట్యాగ్ యాడ్ చేసి, రెగ్యులర్ సుమ అడ్డాకు ఓ ఎక్స్‌టెన్షన్ ప్రోగ్రాం అన్నట్టుగా నిర్మించారు…
Ads
వాళ్లిద్దరి లవ్ స్టోరీ దగ్గర నుంచి… ఆ జ్ఞాపకాలు, సుమ మిత్రులతో పరిచయాలు, సందడి… చివరకు రాజీవ్ కనకాల తల్లిదండ్రుల బొమ్మలను కూడా పెట్టి కన్నీళ్లు… సుమ తన షోలో తన గురించే ఓ వీడియో ప్రజెంట్ చేసినట్టు కనిపిస్తోంది…
వాళ్ల పెళ్లి రోజు కాదు… 25 ఏళ్ల వైవాహిక జీవితం మీద తనే ఓ వీడియోను తన యూట్యూబ్ చానెల్‌లోనే గత ఫిబ్రవరిలోనే వదిలింది… మరేమిటి సందర్భం..? ఎందుకు ఈ స్పెషల్ దావత్..?
సహజంగానే జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులందరూ వచ్చారు… బిగ్‌బాస్ షో ప్రభావం కూడా కనిపిస్తోంది… ఆ రియాలిటీ షోలో కంటెస్టెంట్ల ఫోటోలను మంటల్లో కాల్చి నెగెటివ్ రీజన్స్ చెబుతుంటారు కదా నామినేషన్లు అంటూ… అలాంటిదే ఓ పేరడీ పెట్టారు…
అరియానా, ఇమ్మూల నడుమ వాగ్వాదం… సౌమ్య, నూకరాజుల నడుమ పంచాయితీ… అలాంటివే… నిజానికి సౌమ్యను ఇరిటేట్ చేశారు… ఆమె పది మాట్లాడితే అందులో 8 బూతులే అని నూకరాజు నిందించాడు… మొన్నటిదాకా బిగ్‌బాస్ షోలో ఇదే పంచాయితీ కదా… తెలుగు వర్సెస్ కన్నడ… నేను ఇక్కడికి వచ్చి భాష నేర్చుకుని పర్‌ఫామ్ చేస్తున్నాను, ఇలా నిందించేబదులు నన్నెందుకు పిలిచారు, తెలుగువాళ్లనే పిలుచుకోలేకపోయారా అని రియాక్టయింది ఆమె…
నిజానికి ప్రోమో కోసం ఏదో హాట్ సీన్ క్రియేట్ చేశారేమో గానీ… ఆమె బాధలో మాత్రం అర్థముంది… ఆమెతో పదే పదే ఏవేవో మాట్లాడించి, ఆమె సరిగ్గా పలకలేకపోతే అందులో బూతులు వెతికి మరీ నవ్వడం ఈటీవీ షోలలో చూసిందే… బాడీ షేమింగ్ లాగా లాంగ్వేజ్ షేమింగ్… ఆమే కాదు, సోనియా, తరచూ రష్మి కూడా ఈ బాధలు పడ్డవారే…
ప్రోమోలో కావ్య డాన్స్ ఉంది… ఆమె కూడా కన్నడిగే… బిగ్‌బాస్ విజేత నిఖిల్ మాజీ లవర్… వెరసి… సుమ, రాజీవ్‌ల లైఫ్ జర్నీ మెమొరీస్ ప్లస్ బిగ్‌బాస్ పేరడీ సీన్లు… ఇదేనట ఈ ఇయర్ ఎండ్ స్పెషల్ షో ఈటీవీలో..!!
Share this Article