.
మనిషి ఎంత ఎదిగితేనేం… కాసింత నైతికత లేకుండా పోయాక… సరిగ్గా ఇదే అనిపించింది ఓ మిత్రురాలి బాధ తెలిశాక…
ఆయన పేరు మొటపర్తి శివరామ ప్రసాద్ – పారిశ్రామికవేత్త – ఆఫ్రికా ఖండంలో ముప్ఫైకి పైగా స్టీల్, సిమెంట్ సిమెంట్ కర్మాగారాల అధినేత. గోదావరి జిల్లా దెందుకురు సమీపంలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టాడు…
Warangal REC లో మెటలర్జి చదివి, గుజరాత్ లో పని చేసి, హైదరాబాద్ లో ఫౌండ్రి పెట్టాడు. తర్వాత ఘనాలో విస్తరించాడు. సారధి స్టూడియోస్ ప్రస్తుతం ఈయనదే. డెక్కన్ ఆటో అనే బస్ బిల్డింగ్ సంస్థ కూడా ఉంది…
వ్యాపారం అనే కోణంలో సక్సెస్ స్టోరీ… డౌట్ లేదు… ఆఫ్రికన్ దేశాల్లో అననుకూల పరిస్థితుల్లో వ్యాపార విస్తరణ అంత ఆషామాషీ ఏమీ కాదు…
Ads
ఆయన జీవితంలో విషాద కోణాలూ ఉన్నయ్… రెండో కుమారుడికి ఏరికోరి మరీ దివిస్ మురళి తమ అమ్మాయిని ఇస్తే, అతను బ్రెయిన్ tumor తో చనిపోయాడు! నీలిమ ప్రసాద్ దివి ఈయన రెండో కోడలు…
సాధన సంపత్తి… అపారమైన సంపద… ఓ వ్యాపార సామ్రాజ్యం… ఐతేనేం, ముందే చెప్పినట్టు చిన్న చిన్న విషయాల్లో కాస్త నైతికత కనబరచాలి… విషయం ఏమిటంటే…?
పప్పు అరుణ… ఓ సీనియర్ జర్నలిస్ట్… చాలామంది జీవిత కథల్ని, పుస్తకాల్ని రాసింది…
- చందనపు బొమ్మ (కథల సంపుటి 2013) 2. తడి ఆరని సంతకాలు (ఇన్ఫోసిస్ సుధామూర్తిగారి రచనకు అనువాదం) 3. పదండి ముందుకు ( లావు రత్తయ్య – విజ్ఞాన్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు, ఆత్మకథ) 4. నా జ్ఞాపకాలు ( వై.వి.రెడ్డి – రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ ఆత్మకథ ) 5. ఉత్సాహమే ఊపిరిగా (డాక్టర్ ముక్కామల అప్పారావు – ఎన్నారై మెడికల్ కాలేజ్, ఆస్పత్రుల వ్యవస్థాపకులు ఆత్మకథ ) 6. నేనూ ప్రభుత్వాలూ ( అరిగెపూడి ప్రేమ్ చంద్ – ఐ.ఎమ్.ఎఫ్.లో ఉన్నతాధికారి ఆత్మకథ ) 7. నా సుదీర్ఘ ప్రయాణం (టెలికమ్ విశ్రాంత ఉద్యోగి నూకల నరసింహమూర్తిగారి ఆత్మకథ, అనువాదం ) 8. ఒదిగిన కాలం (డాక్టర్ నోరి దత్తాత్రేయుడు – ప్రముఖ కాన్యర్ వైద్యులు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వ్యవస్థాపకులు ఆత్మకథ ) 9. నాలో నేను ( అద్దంకి శ్రీధర్ బాబు కుటుంబం- గుంటూరు టొబాకో బోర్డ్ ఛైర్మన్ – ఐ.ఎ.ఎస్. అధికారి ఆత్మకథ ) 10. విత్తనంలో విశ్వం – ( కన్నెగంటి పాపారావు – దేశంలో హైబ్రిడ్ పత్తివిత్తనాల సృష్టికర్త, విద్యాధికుడైన వ్యవసాయదారుడి ఆత్మకథ )
- ఆమె ఈ మొటపర్తి శివరామ ప్రసాద్ ఆత్మకథ కూడా రాసింది… ఫైనల్ స్క్రిప్ట్ ఆయనకు ఇచ్చింది… తరువాత ఏం జరిగింది…? ఏమో…
- తీరా అమీబా పేరుతో ఓ పుస్తకం… అదీ ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పేరుతో… అసలు రాసింది ఎవరు..? ఎవరి పేరుతో మార్కెట్‌లోకి వస్తున్నట్టు..? ఇది గ్రంథ చౌర్యం కాదు, అంతకుమించి… ఒకరి శ్రమను పూర్తిగా హస్తగతం చేసుకోవడం…
- ఆమె పేరు లేదు పుస్తకంలో… ప్రస్తావన లేదు… అందుకే అన్యాయం, అనైతికం అనే పదాలు వాడింది… పైగా టైటిల్ పక్కనే గాంధీ బొమ్మ వేసుకుని..! ఆమె ఏడ్చింది, ఆమె శ్రమకు ఇదొక అవమానం… అదీ దుర్భరం… ఇక్కడ ప్రసాద్ తప్పా..? యండమూరి తప్పా..? అనేది ప్రశ్న కాదు… శ్రమ దోపిడీ ఈ రూపంలో కూడా ఉంటుందానేదే ప్రశ్న..!!
Share this Article