.
. ( పొట్లూరి పార్థసారథి ).. …. భారత్ -పాకిస్తాన్ -బాంగ్లాదేశ్ -ఆఫ్ఘనిస్తాన్ part 2
2017 ట్రిగ్గర్ పాయింట్!
Ads
2017 లో పాకిస్థాన్ ఆఫ్ఘన్ సరిహద్దు ( డ్యూరాండ్ లైన్ ) వెంట ముళ్ళకంచె వేయడం ప్రారంభించింది! అప్పటికి ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైన్యం ఉంది మరియు తాలిబాన్ అగ్ర నాయకులు పాకిస్తాన్ జైళ్ళలో ఉన్నారు.
కానీ డ్యూరాండ్ లైన్ వెంట పాకిస్తాన్ ముళ్ల కంచె వేయడం జైల్లో ఉన్న తాలిబాన్ అగ్ర నాయకులకి ఆగ్రహం తెప్పించింది కానీ వాళ్ళు జైల్లో ఉన్నారు. ఇటు ఖైబర్ ఫఖ్తున్ఖ్వ ప్రావిన్స్ లో ఉన్న ట్రైబల్స్ కి కూడా నచ్చలేదు. రోజువారి పనుల కోసం స్వేచ్ఛగా సరిహద్దు దాటి ఆఫ్ఘానిస్తాన్ లోకి వెళ్లి వచ్చే ట్రైబల్స్ కి ఇప్పుడు తమ పాస్పోర్ట్ చూపించి చెక్ పోస్ట్ దాటి వెళ్ళాలి!
ఎప్పటినుండో ఎదురు చూస్తున్న TTP కి ముళ్లకంచె అంశం కలిసి వచ్చింది! తరుచూ పాకిస్థాన్ లోకి వచ్చి దాడులు చేసి ఆఫ్ఘనిస్తాన్ లోకి పారిపోవడమో లేదా ఖైబర్ ఫఖ్తున్ఖ్వ ప్రావిన్స్ లో తలదాచుకోవడమో చేస్తూ వస్తున్నారు.
ఖైబర్ ఫఖ్తున్ఖ్వ ప్రావిన్స్ అనేది టెర్రర్ గ్రూపులకి కేంద్ర స్థానం! పాకిస్థాన్ సైన్యం కూడా ఎయిర్ సపోర్ట్ ( హెలికాప్టర్ గన్ షిప్స్ లేదా ఫైటర్ జెట్స్ ) లేకుండా ఖైబర్ ఫఖ్తున్ఖ్వప్రావిన్స్ లోకి వెళ్లి దాడులు చేయలేదు!
ఖైబర్ ఫఖ్తున్ఖ్వ ప్రావిన్స్ అనేది ఆయుధాలు తయారీకి కేంద్ర స్థానం!
అమెరికన్, జెర్మన్, ఫ్రాన్స్, రష్యన్, బ్రిటన్, స్వీడన్ దేశాల రివాల్వర్, అసాల్ట్ రైఫిల్, షాట్ గన్, లైట్ మిషన్ గన్స్, వాటిలో వాడే బులెట్స్ తో సహా తయారు చేయగలరు పష్తూన్లు. ఇంతా చేస్తే వాళ్ళ దగ్గర ఉండే లేత్ మిషన్లు చాలా పాతవి కానీ ఒరిజినల్ వాటికి తీసిపోకుండా తయారుచేయగలరు.
*******
డిసెంబర్ 21, దక్షిణ వజీరిస్తాన్ (South Waziristan ) లో సరిహద్దు దగ్గర కాపలాగా ఉన్న 16 మంది పాకిస్థాన్ సైనికులని కాపు కాచి చంపేశారు TTP మిలిటంట్లు.
ఆఫ్ఘన్ సరిహద్దు దగ్గర పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకువచ్చి TTP మిలిటంట్లు మెరుపు దాడి చేసి తిరిగి ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్లిపోయారు!
ఈ సంఘటన మీద పాకిస్థాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ సైన్యంలో అసంతృప్తి మొదలయ్యింది. సాటి సైనికులని TTP మిలిటంట్లు చంపడం దాని మీద పాక్ ప్రభుత్వం కానీ సైనిక అధికారులు కానీ వెంటనే స్పందించకపోవడం పాకిస్తాన్ సైనికులలో ఆత్మస్థైర్యం దెబ్బతినడం చూసి చివరికి స్పందించింది పాకిస్తాన్!
డిసెంబర్ 26 న పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ఘనిస్తాన్ లోపలి కి వెళ్లి TTP అగ్రనాయకులు ఉన్నారు అని భావించి ఎయిర్ స్ట్రైక్స్ చేసింది!
నిజానికి TTP నాయకులు అక్కడ ఉన్నారా లేదా అనేది తెలియదు కానీ ఆఫ్ఘన్ పౌరులు 26 మంది చనిపోయారు, వీళ్ళలో మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారు!
తాము చేసిన విమాన దాడుల మీద కూడా పాకిస్థాన్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు కానీ విదేశాంగ అధికారి మాత్రం పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లోను ఉగ్రవాదాన్ని సహించదు అంటూ జోక్ వేసాడు!
ముజాహిదిన్ పుట్టుకకి కారణం పాకిస్థాన్. అదే ముజాహిదిన్ ని తాలిబాన్ గా మార్చింది పాకిస్తాన్. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థలు పుట్టుకకి కారణం పాకిస్తాన్. ఆ మాటకి వస్తే TTP కూడా పాకిస్తాన్ సైన్యం చొరవతో పుట్టి పెరిగి చివరికి పాకిస్థాన్ కే ఎదురు తిరిగింది!
డిసెంబర్ 31 న TTP మిలిటంట్లు ఖైబర్ ఫఖ్తున్ఖ్వ ప్రావిన్స్ లోని బజోర్ జిల్లా ( Bajaur District ) లోని సలార్జై ( Salarzai ) మిలిటరీ బేస్ మీద మెరుపు దాడి చేసి దానిని స్వాధీనం చేసుకుంది!
అరకాన్ ఆర్మీ బర్మా బాంగ్లాదేశ్ సరిహద్దు అవుట్ పోస్ట్ ని స్వాధీనం చేసుకుంటే TTP ఏకంగా మిలిటరీ బేస్ ని స్వాధీనం చేసుకుంది!
బోర్డర్ అవుట్ పోస్ట్ లో ఇద్దరు గార్డులు ఉంటారు. ఎత్తయిన వాచ్ టవర్ ఉంటుంది. ప్రతీ 8 గంటలకి డ్యూటీ మారుతుంటారు. ఒక వైర్లెస్ సెట్ ఉంటుంది దగ్గరలో ఉన్న బేస్ తో మాట్లాడడానికి.
మిలిటరీ బేస్ లో హెవీ మిషన్ గన్ తో పాటు కనీసం 8 మంది సైనికులు ఉంటారు. మెషిన్ గన్ తో పాటు అందరి దగ్గర గన్స్ ఉంటాయి. అలాగే రీ ఇన్ఫోర్సడ్ కాంక్రీట్ తో కట్టిన బంకర్ ఉంటుంది. వారానికి సరిపడా ఆహారం, అత్యవసర మందులు, అదనపు బుల్లెట్స్ ఉంటాయి. ఇక పూర్తి స్థాయి వైర్లెస్ కమ్యూనికేషన్ సెట్ ఉంటుంది.
అయితే TTP స్వాధీనం చేసుకున్నది పూర్తి స్థాయి మిలిటరీ బేస్ కాదు కానీ కీలకమైనదే! TTP దాడి చేసి స్వాధీనం చేసుకున్నది సలార్జై బోర్డర్ పోస్ట్ ని కానీ దాడులు చేసింది గోగ్ఝర్హి ( Goghari ), మాత సన్గర్ (Matha sangar ), కోట్ రాఘా ( Kot Ragha ), తరి మెంగల్ ( Tari Mengal ) లు కూడా ఉన్నాయి.
అంటే ఒకేసారి 5 సరిహద్దు బేస్ ల మీద దాడి చేశారు TTP ఫైటర్లు! ఒక దానిని స్వాధీనం చేసుకోగలిగారు!
కొద్ది రోజుల్లో అన్నిటిని స్వాధీనం చేసుంటాము అని ప్రకటన చేసింది TTP!
WELL… బోర్డర్ పోస్ట్ లమీద ఎలా దాడి చేసి స్వాధీనం చేసుకోవాలో శిక్షణ ఇచ్చింది ISI. అదే శిక్షణ వాళ్ళ మీదే ప్రయోగిస్తున్నారు!
మన దొడ్లో పాములు పెంచుతూ అవి మనల్ని కాటేయవు అని ఆలోచించేది ఒక్క పాకిస్తాన్ మాత్రమే!
*********
దీని మీద ఇప్పటి వరకూ పాకిస్థాన్ స్పందించలేదు!
ఎందుకంటే ఖైబర్ ఫఖ్తున్ఖ్వ ప్రావిన్స్ లో స్థానికులు ఎవరూ పాకిస్తాన్ సైన్యానికి సహకరించరు! కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వరు.
ఇలాంటి స్థితిలో కనీసం ఒక బెటాలియన్ ( 3000 మంది ) సైనికులని అక్కడ మొహరించి పోరాడాలి! పైగా ఎయిర్ సపోర్ట్ కోసం ఫైటర్ జెట్స్ ని వాడాల్సి ఉంటుంది! ఇంత ఖర్చు భరించే స్థితిలో పాకిస్తాన్ సైన్యం లేదు!
ఖైబర్ ఫఖ్తున్ఖ్వ ప్రావిన్స్ లో హెలికాప్టర్ గన్ షిప్స్ ని వాడడానికి కుదరదు ఎందుకంటే స్టింగర్ మిసైల్స్ ఉన్నాయి. స్టింగర్ మిసైల్స్ కి హెలికాప్టర్లు చాలా సులభమైన టార్గెట్స్ అవుతాయి!
పాకిస్థాన్ బాంగ్లాదేశ్ లో చేతులు పెట్టినంత కాలం ఖైబర్ ఫఖ్తున్ఖ్వ సమస్య ఉంటుంది. ఖైబర్ ఫఖ్తున్ఖ్వ ని తాలిబాన్లు ఒదులుకునే అవకాశం లేదు!
*******
గజని మొహమ్మద్ ఒక దురాక్రమణదారుడు – పాకిస్థాన్!
వ్వాహ్! క్యా బాత్ హై 😂😂😂
బాబర్, గజని మొహమ్మద్ లు వీరులు, శూరులు!
పాకిస్తాన్ లోని పాఠశాలలలో విద్యార్థులకి చెప్తూ వచ్చింది ఇదే!
ఖైబర్ ఫఖ్తున్ఖ్వ లోని బోర్డర్ పోస్ట్ ని TTP స్వాధీనం చేసుకోగానే పాక్ ప్రధాని సలహాదారుడు ఒకరు ఏకంగా గజనీ, బాబర్ లని దురాక్రమణ దారులు అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ దూషించాడు!
సైకాలాజికల్ గా ఇది తాలిబన్లతో మేము పోరాడలేము అని ఒప్పుకున్నట్లుగా ఉంది! లేకపోతే బాబర్, గజనీల ప్రసక్తి లేకుండా నేరుగా వెళ్లి ఎదురు దాడి చేసి వాళ్ళ బేస్ ని తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు కదా?
అఫ్కోర్స్! పాకిస్థాన్ పరిస్థితి ఏమిటో మన వాళ్లకి బాగా తెలుసు!
అందుకే ఎప్పుడో 2029 లో పూర్తవ్వాల్సిన బాల్కనైజేషన్ అఫ్ పాకిస్థాన్ కి అజిత్ దోవల్ జెండా ఊపి మొదలుపెట్టారు! లాంచనంగా బాల్కనైజేషన్ అఫ్ పాకిస్థాన్ మొదలైనట్లే!
2010 లో సిరియాలో మొదలైన బాల్కనైజేషన్ అఫ్ సిరియా 2024 లో పూర్తి అయ్యింది! సిరియాకి రష్యా, ఇరాన్ లు మద్దతు ఇస్తూ పదేళ్ల పాటు కాపాడారు!
పాకిస్తాన్ కి ఆ అవకాశం లేదు! సౌదీ అరేబియా ఒక్కటే అండగా నిలబడగల అవకాశం ఉంది కానీ అదీ సందేహమే!
బాలూచిస్తాన్ కి చెందిన ఫైటర్లు బాలూచ్ లిబరేషన్ ఆర్మీ TTP, తాలిబన్ లతో చేతులు కలిపి ఉమ్మడిగా దాడులు చేసే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో!
ఇదంతా ఎందుకు జరుగుతున్నది?
జస్ట్, పాకిస్థాన్ బాంగ్లాదేశ్ లు ఒప్పందం చేసుకున్నాయి రహస్యంగా! పాకిస్తాన్ ఆర్మీ బాంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇస్తుంది అన్నమాట ఏమిటీ ఉన్న మాటే!
అందుకే ఖైబర్ ఫఖ్తున్ఖ్వ లో సినిమా మొదలయ్యింది. ఇది టైటిల్స్ మాత్రమే!
BLA ని కట్టడి చేయలేకపోయిన పాకిస్తాన్ ఆర్మీ తాలిబాన్, TTP లని ఎదుర్కొని నిలబడగలదా?
బాలూచిస్తాన్ లో గ్వదర్ పోర్టు రక్షణ కోసం చైనా తన ఆర్మీని మొహరించింది అక్కడ అంటే అర్ధం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఆర్మీ సామర్ధ్యం ఏమిటో!
ఒక పెద్ద అపోహని పటాపంచలు చేసిన భారత్!
2021 లో నాటో సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుండి వెనక్కి వెళ్లిపోయే సమయంలో దాదాపుగా 7 బిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధాలని కాబూల్ లోనే వదిలేసి వెళ్ళిపోయింది. అయితే వీటిలో ఎక్కువ ఖరీదు చేసేవి విమానాలు, హెలికాఫ్టర్లు ఉన్నాయి కానీ వాటిని వాడడానికి వీలులేకుండా చేశారు.
ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికన్ సైనికులు వాడింది M4 అసాల్ట్ రైఫిల్! దాదాపుగా 4 వేల M4 అసాల్ట్ రైఫిల్స్ ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది అమెరికన్ సైన్యం. 2022 లో వీటిలో కొన్నింటిని లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ సభ్యులు డబ్బులు ఇచ్చి తాలిబన్ల దగ్గర కొన్నారు.
2023 లో లష్కరే, జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ లోకి చొరబడడానికి చేసిన ప్రయత్నంలో భారత సైన్యానికి పట్టుబడినపుడు వాళ్ళ దగ్గర అమెరికన్ M4 అసాల్ట్ రైఫిల్స్ దొరికాయి. ఈ విషయం మన విదేశాంగ శాఖ అమెరికాకి తెలియచేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరడంతో అమెరికా పాకిస్థాన్ మీద ఒత్తిడి తెచ్చి ఉగ్రవాదుల నుండి M4 రైఫిల్స్ ని స్వాధీనం చేసుకుంది!
కానీ తాలిబాన్ల దగ్గర ఉన్న M4 అసల్ట్ రైఫైల్స్ ని TTP కి ఇచ్చింది. అవే M4 అసాల్ట్ రైఫిల్స్ ఇప్పుడు పాకిస్థాన్ సైన్యానికి సమస్యగా మారాయి. TTP ఫైర్ పవర్ అంతా M4 రైఫిల్ తోనే వచ్చింది. అమెరికా వదిలి వెళ్లిన నైట్ విజన్ గాగుల్స్, థెర్మల్ గాగుల్స్ ని తెల్లవారుఝామున మంచులో వాడుతూ చాలా తేలికగా బోర్డర్ పోస్టుల మీద దాడులు చేయగలగుతున్నారు TTP ఫైటర్స్!
ఈ పోరాటం ఆగదు అంటూ ఇప్పటికే తాలిబన్లు హేచ్చరించారు పాకిస్థాన్ ని.
రష్యా ఆసక్తి?
రెండు రోజుల క్రితం రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మీద మాట్లాడుతూ అవసరం అయితే రష్యా మధ్యవర్తిత్వం చేస్తుంది అని ప్రకటించారు. ఇది అనవసరం!
రష్యా కలుగచేసుకుంటే అమెరికా పాకిస్థాన్ కి సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి తలనెప్పి! ఇందులో భారత ప్రయోజనాలు ఉన్నాయి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా రష్యా ప్రకటన చేసింది! ఒక పక్క చావో రేవో తేల్చుకునే పరిస్థితిలో ఉన్న రష్యాకి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ల విషయంలో వేలు పెట్టాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం ఈ విషయంలో భారత్ చాలా వేగంగా స్పందిస్తున్నది!
అజిత్ దోవల్గా చైనాకి వెళ్లి చర్చలు జరిపి వచ్చిన తరువాతే TTP సరిహద్దు బేస్ ల మీద దాడి చేసింది అన్నది గమనార్హం! ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ ల విషయంలో అమెరికా జోక్యం తగ్గించడం కోసమే భారత్ చైనా లు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి! ఇది తాత్కాలికం!
నిన్న TTP పాకిస్తాన్ సైన్యానికి మరొక హెచ్చరిక చేసింది!
“ మేము ఇక నుండి పాకిస్తాన్ సైనిక అధికారులకి ఆదాయం ఇచ్చే అన్ని వ్యాపారాలని టార్గెట్ చేసి ఒక్కో దానిని నాశనం చేస్తాం!
పాకిస్తాన్ సైన్యం నిర్వహించే వ్యాపారాలు :
1.నేషనల్ లాజిస్టిక్ సెల్ – National Logistic Cell. ఇది పాకిస్తాన్ అంతటా రవాణా మరియు కొరియర్ సేవలు అందిస్తుంది. ఇది రావల్పిండిలో ఉంది. ప్రజలు తప్పనిసరిగా వీళ్ళ సేవలని వినియోగించుకోవాలి లేకపోతే నిర్భంధం తప్పదు.
2.ది ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ – The Frontier Works Organization. ఇంజినీరింగ్ మరియు కన్స్ట్రక్షన్ కంపెనీ ఇది. స్థలాలు కొనడం లేదా కబ్జా చేసి ఇళ్ళు కట్టి అమ్ముతుంది. ప్రయివేట్ సంస్థలు ఉన్నా సైన్యానిది కాబట్టి పోటీకి రావు. ప్రజలు వీళ్ళ దగ్గర కట్టిన ఇళ్ళు కొనడానికి ముందు స్థలాలని వేరే వాళ్ళ చేత కబ్జా చేయిస్తుంది. పోలీసులు, కోర్టుల గొడవ ఎందుకని ధనవంతులు వీళ్ళ దగ్గరే కొంటారు. అన్నీ ఖరీదయిన విల్లాలు కట్టి అమ్ముతుంది.
3.ఫౌజీ ఫర్టిలైజర్స్ – Fauji Fertilizers. ఎరువులు తయారు చేసి అమ్ముతుంది. ఫౌజీ అంటే సైన్యం అని అర్ధం. పాకిస్తాన్ లో మేజర్ ఎరువులు తయారు చేసి అమ్మే సంస్థ ఇది.
4.మిలిటరీ ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం.
5.మిలిటరీ కి చెందిన పాలు, పాల ఉత్పత్తులు చైన్ షాపులు దేశం అంతా ఉన్నాయి.
6.నిత్యావసరాలు అమ్మే సూపర్ బజార్లు దేశవ్యాప్తంగా ఉన్నాయి.
ఒకటేమిటి! ఆదాయం వచ్చే ఏ వ్యాపారాన్ని సైన్యం ప్రయివేట్ వ్యక్తులకి వదల్లేదు!
FIGHTERS NEED LION’S SHARE!
సైనికులకి సింహాభాగం ఇవ్వాలి! ఎందుకంటే దేశాన్ని కాపాడేది సైనికులు కాబట్టి!
ఇంత చేస్తే సైన్యం చేసే వ్యాపారాలకి పన్ను కడుతుందా!
10:1 నిష్పత్తిలో పన్ను కడుతుంది అంటే 10 అమ్మితే 1 దానికీ పన్ను కడుతుంది. టాక్స్ అధికారులకి సైన్యం నిర్వహించే వ్యాపారాల మీద దాడులు చేసే ధైర్యం ఉండదు.
So! TTP రాబోయే రోజుల్లో సైన్యం నిర్వహించే వ్యాపారాల మీద దాడులు చేస్తుంది అన్నమాట!
అన్నట్లు TTP కి ఇలా సైన్యం వ్యాపారాల మీద దాడులు చేయమని సలహా ఇచ్చింది ఎవరయి ఉంటారు?
అందుకే సైన్యంలో తిరుగుబాటు రాదు పాకిస్తాన్ లో. రిటైర్ అయ్యాక పెన్షన్ తో పాటు వ్యాపారాలతో వచ్చిన లాభాలని పై స్థాయి నుండి కింది స్థాయి వరకూ వాటాలు వేసుకొని పంచుకుంటారు!
All Countries have an Army but Pakistan’ Army has a Country.
పాకిస్తాన్ కి చెందిన మహిళ అయేషా సిద్దిక పాకిస్తాన్ ఆర్మీ నిర్వహించే వ్యాపారాల మీద ఒక పుస్తకం వ్రాసింది దాని పేరు.. MILITARY Inc. Inside Pakistan’s Economy. అమెజాన్ లో దొరుకుతుంది….
Share this Article